ముంబై : టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. నేడు 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా యువీ ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. 'ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దేశానికి రాజుగా అభివర్ణించే రైతు ఈరోజు నిరసనలు చేయడం బాధగా ఉంది. పుట్టినరోజులనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.రైతులు దేశానికి వెన్నముక అన్న మాట నిజం.. వారు చేస్తున్న ఆందోళన త్వరలోనే సమసిపోవాలని.. కేంద్రంతో చర్చలు శాంతియుత వాతావరణంలో జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. (చదవండి : నెటిజన్ కామెంట్‌కు గబ్బర్ ధీటైన కౌంటర్)
రైతుల చేస్తున్న ఆందోళనకు నా తండ్రి యోగరాజ్ మద్దతు పలికారు. వారి ఆందోళన సరైనదేనని.. వెంటనే రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రానికి తెలిపారు. అంతేగాక రైతుల ఆందోళనకు మద్దతుగా కొందరు క్రీడాకారులు తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తున్నారంటే రైతుల ఉద్యమంలో నిజం ఉందని ..అందుకే వారి సమస్యలు తీర్చాలని నా తండ్రి పేర్కొనడం బాధ కలిగించింది. ఆయన ఆలోచన విధానాలతో నేను సరితూగలేను.ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆయన వ్యాఖ్యలను నేను తప్పుబట్టలేను.. అలా అని సమర్థించలేను.అంతేకాదు కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగియలేదు. కరోనా వైరస్ పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరుతున్నా. జై జవాన్, జై కిసాన్! జై హింద్' అంటూ ఉద్వేగంతో ముగించాడు.
(చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి)
— Yuvraj Singh (@YUVSTRONG12) December 11, 2020
ఇక 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువీ 304 వన్డేల్లో 8701, 40 టెస్టుల్లో 1900, 58 టీ20ల్లో 1177 పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వన్డేల్లో 120 వికెట్లు.. టెస్టుల్లో 10 వికెట్లు తీశాడు. 2007టీ 20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. టీమిండియా తరపున టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ అతని పేరిట ఉండడం మరో రికార్డుగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment