సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ కార్యాలయం విఫలమైనందును నష్టపరిహారంగా రూ.87 కోట్లు చెల్లించాలని ఓ నిరుద్యోగి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 26 ప్రకారం.. వస్తు, సేవల్లో లోపం కారణంగా తనకు జరిగిన నష్టాన్ని బాధితుడు ప్రతిదారు నుంచి పొందొచ్చు. కానీ, ఈ కేసులో ఫిర్యాదుదారు నిరాధార ఆరోపణలు చేశాడని కమిషన్ అభిప్రాయపడింది.
వివరాలు.. ఆర్టీఐ కింద తాను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ విఫలమైందని పంచకులకు చెందిన విజయ్‌కుమార్ ఆరోపించారు. సరైన సమాచారం లభించనందున తాను తీవ్రంగా నష్టపోయినట్టు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ని ఆశ్రయించాడు. నష్టపరిహారంగా 87 కోట్ల రూపాయలు చెల్లించేలా ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్‌ను ఆదేశించాలని దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరాడు అనేందుకు విజయ్ వద్ద ఎలాంటి ఫ్రూఫ్ లేదని పేర్కొంది. తప్పుదు ఆధారాలతో కమిషన్‌ను విజయ్ తప్పుదోవ పట్టించాడని మండిపడింది. ఎంతోమందికి సేవలందించాల్సిన కమిషన్ కాలాన్ని వృధా చేశాడని ఆక్షేపించింది. జరిమానాగా విజయ్ రూ.100 చెల్లించాలని కమిషన్ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించి రశీదు అందించాలని తెలిపింది. ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment