బయోపిక్‌లో భార్య రేప్‌ సీన్‌.. షాకైన కేన్స్‌ ఆడియెన్స్‌ | Donald Trump Biopic The Apprentice Premieres At Cannes With Controversial Scene, Details Inside | Sakshi
Sakshi News home page

Donald Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో భార్య రేప్‌ సీన్‌.. షాక్‌కు గురైన ఆడియెన్స్‌

Published Wed, May 22 2024 8:15 AM | Last Updated on Wed, May 22 2024 11:35 AM

Donald Trump Biopic The Apprentice Cannes Controversy Latest News

కేన్స్‌ ఫిల్స్‌ ఫెస్టివల్‌ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయోపిక్‌ ‘ది అప్రెంటైస్‌’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్‌ ఒవేషన్‌  దక్కినప్పటికీ.. ట్రంప్‌ పర్సనల్‌ లైఫ్‌లోని కొన్ని షాకింగ్‌ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్‌ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్‌ ఉంది. ఆ సన్నివేశం కేన్స్‌ ఆడియొన్స్‌ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్‌ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్‌ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్‌ టవర్‌ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు.  

దావాకు రెడీ
మరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్‌కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్‌) ఒక చెత్త. కల్పిత కథనాలతో  సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్‌ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.

ట్రంప్‌ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్‌ అబ్బాసీ
అయితే ట్రంప్‌ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ‌ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్‌ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్‌ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్‌ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్‌ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.

ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్‌ పాత్రను నటుడు సెబాస్టియన్‌ స్టాన్(మార్వెల్‌ చిత్రాల ఫేమ్‌)‌ పోషించగా.. ట్రంప్‌ వ్యక్తిగత లాయర్‌ జెర్మీ స్ట్రాంగ్‌ పాత్రలో రోయ్‌ కోన్‌, ఇవానా ట్రంప్‌ రోల్‌లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement