sue
-
బయోపిక్‌లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ‘ది అప్రెంటైస్’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినప్పటికీ.. ట్రంప్ పర్సనల్ లైఫ్‌లోని కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం కేన్స్ ఆడియొన్స్‌ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్ టవర్ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్‌కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్ అబ్బాసీఅయితే ట్రంప్ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్(మార్వెల్ చిత్రాల ఫేమ్) పోషించగా.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ జెర్మీ స్ట్రాంగ్ పాత్రలో రోయ్ కోన్, ఇవానా ట్రంప్ రోల్లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. ఆయనపై లండన్ కోర్టులో కేసు పెడతానని చెప్పారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని రాహుల్ 2019 ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఇప్పటివరకు ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, అలాంటప్పుడు దేశం వీడిపోయిన ఆర్థిక నేరగాడు అని ఎలా అంటారని లలిత్ మోదీ ప్రశ్నించారు. రాహుల్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఏ ఆధారాలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్‌పై యూకే కోర్టులో కేసు పెడతానని, ఆయన న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని పేర్కొన్నారు. ఈమేరకు లలిత్ మోదీ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేసి రాహుల్, కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. 'పప్పు అనబడే రాహుల్ గాంధీ నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఓ కేసులో దోషిగా తేలారు. నేను మాత్రం గత 15 ఏళ్లలలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదు అలాంటప్పుడు నన్ను నేరగాడు అని ఎలా అంటారు. నేనొక సాధారణ వ్యక్తిని. 100 బిలియన్ డాలర్లు విలువ చేసే అతిపెద్ద క్రీడా కార్యక్రమానికి ఆధ్యుడిని.' అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing… — Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023 చదవండి: సీబీఐ అప్పుడు నాపై ఎంతో ఒత్తిడి చేసింది: అమిత్ షా -
గొప్పగా భావిస్తున్న!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సీరియల్ కిల్లర్ శోభరాజ్
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 78 ఏళ్లు కావడంతో వయసు రీత్య విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు పేర్కొనడంతో.. ఆయన శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయనను విలేకరులు ఇంటర్య్వూలో తాను చాలా గొప్పగా భావిస్తున్నానని శోభరాజ్ చెప్పారు. తాను చేయాల్సింది చాలా ఉందని, చాలా మంది వ్యక్తులపై దావా వేయాలని అన్నారు. ఆయన ప్రస్తుతం దోహా మీదుగా విమానంలో ఫ్రాన్స్‌కి వెళ్లనున్నాడు. మిమ్మల్ని సీరియల్ కిల్లర్‌గా తప్పుగా వర్ణించారని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా..ఔను అని చెప్పాడు. నెట్‌ఫిక్స్‌లో 'సిరిస్ ది సర్పెంట్'లో శోభరాజ్ జీవిత చరిత్రలో 1970లలోని 20 హత్యలతో ముడిపడిన కథను తెరకెక్కించారు. భారత్‌లో 1976లో అరెస్టు అయ్యాడు. ఐతే 2003లో నేపాల్‌కు వెళ్లాడు, అక్కడ జర్నలిస్ట్ అతనిని గుర్తించి అరెస్టు చేశాడు. చివరికి 1970లలో చేసిన జంట హత్యలకు గాను అక్కడ 21 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ వారంలోనే అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా విడులై ఫ్రాన్స్‌కి పయనమయ్యాడు. (చదవండి: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలకు ఆదేశాలు) -
3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
వాషింగ్టన్: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్... క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా! -
రూ.2.3లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. కేసు పెట్టిన రెస్టారెంట్
వాషింగ్డన్: రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసి హాయిగా తిన్నాడు. ఆ తర్వాత వెయిట్రెస్‌కు రూ.2.3లక్షలు(3వేల డాలర్లు) టిప్ ఇచ్చాడు. అంత భారీ మొత్తం తనకే అని తెలిసి ఆమె ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయింది. అమెరికా పెన్సిల్వేనియాలోని అల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. టిప్ ఇచ్చిన కస్టమర్ పేరు ఎరిక్ స్మిత్ కాగా.. తీసుకున్న వెయిట్రెస్ పేరు మరియానా లాంబర్ట్. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు కస్టమర్. తాను ఇచ్చిన టిప్‌ను తిరిగిచ్చేయాలన్నాడు. దీంతో రెస్టారెంట్‌తో పాటు వెయిట్రెస్ కూడా కంగుతింది. ఎరిక్ తన బిల్లుతో పాటు టిప్‌ను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. టిప్ ఇస్తూ బిల్లుపై 'ఫర్ జీసస్'(జీసస్ కోసం) అని రాశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పేరుతో ఉద్యమం నడుస్తోంది. చాలా మంది ఇతరుల కోసం భారీ సాయం చేస్తున్నారు. దీంతో ఇది దేవుడు తనకోసం ఇచ్చిన కానుక అని వెయిట్రెస్ సంబరపడిపోయింది. కానీ కొన్ని గంటలకే ఆనందం ఆవిరైంది. తాను టిప్ ఇచ్చిన రూ.2.3లక్షలపై క్రెడిట్ కార్డు కంపెనీతో గొడవపడ్డాడు ఎరిక్. ఈ మొత్తాన్ని బిల్లులో చేర్చవద్దన్నాడు. దీంతో క్రెడిట్ కార్డు కంపెనీ ఈ విషయాన్ని రెస్టారెంట్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ఎరిక్‌ను సంప్రదించేందు ప్రయత్నించింది. ఫేస్బుక్లో సందేశాలు పంపింది. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఎరిక్‌పై కోర్టులో దావా వేసింది రెస్టారెంట్ యాజమాన్యం. రూ.2.3లక్షలను తాము అప్పటికే లాంబర్ట్‌కు ఇచ్చేశామని, ఇప్పుడు అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వలేమని చెప్పింది. కస్టమరే స్వయంగా టిప్ ఇచ్చి మళ్లీ వెనక్కి ఇవ్వాలనడంపై అభ్యంతరం తెలిపింది. ఆ టిప్ తీసుకునేందుకు లాంబర్ట్‌కు పూర్తి అర్హత ఉందని, ఆమె చాలా కష్టపడి పనిచేస్తుందని చెప్పింది. చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
కొడుకు మీదే కోర్టుకు.. ఆ తల్లిదండ్రుల డిమాండ్ మీదే చర్చంతా!
డెహ్రాడూన్: పిల్లలను కనడంతోనే తల్లిదండ్రుల బాధ్యత ముగిసిపోదు. వాళ్లను పెంచి.. విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నతస్థానానికి చేర్చే దాకా సాగుతూనే ఉంటుంది వాళ్ల ప్రయాణం. మరి ఆ తర్వాత.. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కూడా అంతే బాధ్యతతో వ్యవహరిస్తుంటారా?. ఇక్కడ వయసుపైబడ్డ ఓ పెద్దాయన, ఆయన భార్య.. సొంత కొడుకు, కోడలి మీద కోర్టుకు ఎక్కారు. ఎందుకో తెలుసా? తమకు ఓ మనవడినో, మనవరాలినో ఇవ్వమని! ఆశ్చర్యంగా అనిపించే ఈ కేసు ఉత్తరాఖండ్‌లో ఇవాళ(బుధవారం) చోటు చేసుకుంది. ఏడాదిలోగా మనవడో, మనవరాలినో తమ చేతుల్లో పెట్టాలని.. లేకుంటే ఐదుకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు హరిద్వార్‌కు చెందిన ఆ జంట. 2016లో మా అబ్బాయికి వివాహం చేశాం. ఇప్పటిదాకా పిల్లల్ని కనలేదు. ఆడామగా అనే తేడా లేదు. ఎవరో ఒకరిని కనిస్తే చాలు.. అని అంటోంది ఆ జంట. మరి ఇక్కడ డబ్బు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా?. తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో సమాజానికి తెలియజేయడానికే అలా చేశారట!. మా దగ్గర ఉన్నదంతా మా అబ్బాయి కోసమే ఖర్చు చేశాం. అమెరికాలో చదివించాం. ఘనంగా పెళ్లి చేశాం. ఆపై బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టాం. ఇప్పుడు మా దగ్గర పైసా లేదు. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. అందుకే కొడుకు కోడలు నుంచి చెరో రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశాం అంటున్నారు ఎస్ఆర్ ప్రసాద్. ‘‘మనం పిల్లల కోసం లెక్కలేసుకోం. మంచి ఉద్యోగాలకు తోడ్పాడు అందిస్తాం. తల్లిదండ్రులుగా అది బాధ్యత. కానీ, పిల్లలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలో కనీస అవసరాలకు కూడా డబ్బులివ్వడం లేదు. మనవడో మనవరాలో కావాలని కేసు వేయడం వెనుక వాళ్ల ప్రధాన ఉద్దేశం.. అందరి దృష్టిని ఆకర్షించడమే’’ అంటున్నారు ప్రసాద్ తరపు లాయర్ శ్రీవాస్తవ. -
Elon Musk: ఎలన్ మస్క్-ట్విటర్ భారీ డీల్‌లో ట్విస్ట్
డెలావేర్: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు అయిన ‘ఫ్లోరిడా పెన్షన్ ఫండ్’.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2025లోపు ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో(యూఎస్) పిటిషన్ దాఖలు చేసింది ఎఫ్‌పీఎఫ్. అంతేకాదు.. త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఇరువురికీ ట్విట్టర్ లో వాటాలుండడం గమనార్హం. మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది. న్యాయపరమైన ఈ చిక్కుల్ని ట్విటర్, ఎలన్ మస్క్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. చదవండి: ట్విటర్.. టెస్లా ఒక్కటి కాదు - బిల్‌గేట్స్ -
అంతా బోగస్ లెక్కలు..! యాపిల్‌కు గట్టి షాకిస్తూ కోర్టుకు
ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీ యాపిల్‌కు గట్టి షాక్ ఇస్తూ కోర్టుకు ఈడ్చింది బ్రిటిష్ లోకల్ ఆథారిటీ. ఐఫోన్ అమ్మకాల క్లెయిమ్స్ విషయంలో షేర్ హోల్డర్స్‌ను తప్పుదారి పట్టించినందుకు యాపిల్‌పై దావా పడింది. నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావాలో...యాపిల్ జనవరి 2019లో లాభాల హెచ్చరికను జారీ చేయడానికి ముందు ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలను యాపిల్ చేసిందని నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ ఆరోపించింది. ఈ కౌన్సిల్ 3.8 బిలియన్ యూరోల పెన్షన్ ఫండ్‌ను నడిపిస్తోంది. ఇది యాపిల్‌లో షేర్ హోల్డర్ కంపెనీగా ఉంది. 2018లో చైనాలో ఐఫోన్ల డిమాండ్‌పై వాటాదారులను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ యాపిల్ చీఫ్ ఎర్జిక్యూటివ్ టిమ్ కుక్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మ్యాస్తిపై దావా వేసింది. కొన్ని నివేదికల ప్రకారం...యాపిల్ ఐఫోన్ అమ్మకాల ఒత్తిడి చూసే అవకాశం ఉందని కుక్ 2018లో వాటాదారులతో చెప్పారు. షేర్ హోల్డర్లకు న్యాయం కుదిరేలా..! జనవరి 2019లో యాపిల్ తన లాభాల అంచనాలను దాదాపు 6 బిలియన్ల యూరోల మేర కోల్పోనుందని కుక్ పెట్టుబడిదారులకు పేర్కొన్నాడు. అయితే నవంబర్ 2018లో ఐఫోన్ అమ్మకాలు సరిగ్గా జరపలేదనే విషయం కుక్ కు ముందే తెలుసునని నార్బోక్ కౌంటీ కాన్సిల్ వాదించింది. దీని వల్ల కౌన్సిల్ పెన్సన్ ఫండ్ దాదాపు 1 బిలియన్ డాలర్లlను నష్టపోయినట్లు పేర్కొంది. ఈ కౌన్సిల్ వేసిన దావాలను కాలిఫోర్నియా న్యాయమూర్తి క్షాస్-యాక్ష న్ హోదాను మంజూరు చేయగా...దీనిలో ఇతర వాటాదారులను కూడా కేసులో చేరేందుకు అనుమతించనుంది. ఒక వేళ యాపిల్‌పై వేసిన ఆరోపణలు నిజమని తెలిస్తే కంపెనీ భారీ మూల్యాన్ని చెల్లించనుంది. చదవండి: ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ షాక్! -
Novak Djokovic: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై పరువునష్టం దావా.. ఏకంగా 32 కోట్లకు..!
Djokovic To Sue Australian Govt: వ్యాక్సిన్ తీసుకోలేదన్న కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనను ఆడనీయకుండా అడ్డుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. స్కాట్ మోరిసన్ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. తన 21వ గ్రాండ్‌స్లామ్ కలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బలవంతంగా క్వారంటైన్‌కు తరలించడాన్ని కారణాలుగా చూపుతూ 32 కోట్ల రూపాయలకు దావా వేయాలని డిసైడయ్యాడు. దీనిపై ప్రస్తుతం లాయర్లతో చర్చిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్ళిన జకోవిచ్‌ను కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న సంగతి తెలిసిందే. జకో.. టోర్నీలో పాల్గొనేందుకు నిర్వహకులు అనుమతించినప్పటికీ, ఆ దేశ ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అతన్ని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించింది. వ్యాక్సిన్ తీసుకోని కారణంగా అతన్ని దేశంలోకి అనుమతించలేమని, అలాగే అతని వీసాను కూడా రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన జకోకు మొదట్లో ఉపశమనం లభించినా.. ఆతర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వాన్నే విజయం వరించింది. ఈ విషయాన్ని చాలా సీరియన్‌గా తీసుకున్న జకో.. స్వదేశానికి వెళ్లగానే ఆస్ట్రేలియా ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీతో పోలిస్తే అతను దావా వేయాలనుకున్న మొత్తం చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే, ఈ సెర్బియన్ యోధుడు ఇటీవలే ఔషధ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అతనికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే క్వాంట్ బయోరెస్ అనే ఔషధ తయారీ సంస్థలో 80 శాతం వాటా ఉన్నట్లు సదరు కంపెనీ సీఈఓ స్వయంగా వెల్లడించాడు. చదవండి: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! -
భారత్‌లో మొట్టమొదటిసారి.. ఉద్యోగుల మీద దావా!
Urban Company Sues Women Employees: దేశంలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చర్చ నడుస్తోంది. సాధారణంగా హక్కుల ఉల్లంఘనల మీద ఉద్యోగులు కంపెనీల మీద కోర్టుకు వెళ్లడం చూస్తుంటాం. అయితే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీనే ఉద్యోగులపై దావా వేసిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. గురుగ్రామ్(హర్యానా) నగర వేదికగా హోం అండ్ బ్యూటీ సర్వీసులు అందించే ‘అర్బన్ కంపెనీ’.. మహిళా ఉద్యోగిణులపై కోర్టుకెక్కింది. కంపెనీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమ తమ ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయంటూ.. మహిళా ఉద్యోగిణులు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల నిరసనను వ్యతిరేకిస్తూ unfair labor practices కింద గురుగ్రామ్ జిల్లా కోర్టుకు వెళ్లింది అర్బన్ కంపెనీ. దీంతో ఉద్యోగిణులు ఉన్నపళంగా నిరసనలను విరమించినట్లు సమాచారం. మ్యానిక్యూర్ సేవల నుంచి కార్పెట్ క్లీనింగ్, చిన్న చిన్న రిపేర్లు.. తదితర సేవలను మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది అర్బన్ కంపెనీ. ఇందుకోసం వేల సంఖ్యలో భాగస్వాములతో(ఆడామగా ఉద్యోగులతో) ఒప్పందం చేసుకుంటోంది. అయితే ఆమధ్య కంపెనీ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం.. సబ్స్క్రిప్షన్ స్కీమ్ తోపాటు భాగస్వాములు(ఉద్యోగిణులు) ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి నెలా కనీస సంఖ్యలో ఉద్యోగాలు, కొత్త భాగస్వామ్య వర్గాలు, కస్టమర్ల కోసం తీసుకొచ్చిన తగ్గింపు పథకం పాటించాల్సి వస్తుంది. ఈ పరిమితులన్నింటి వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందన్నది ఉద్యోగిణుల(భాగస్వాముల) అభ్యంతరం. భాగస్వామి పాయింట్‌తో కొట్టింది! ఈ కొత్త పాలసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కంటే ముందునుంచే.. ‘బెటర్ పే, వర్కింగ్ కండిషన్’ డిమాండ్లతో అక్టోబర్ నుంచే ఉద్యోగిణులు రోడ్డెక్కడం గమనార్హం. సుమారు 50 మంది ఉద్యోగిణులు గురుగ్రామ్‌లోని కంపెనీ ముందు నినాదాలతో రాత్రింబవలు ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో నలుగురు మహిళా ఉద్యోగిణుల పేర్లను చేర్చి మరీ దావా వేసింది అర్బన్ కంపెనీ. వాళ్ల(ఉద్యోగిణుల) చర్యలను అనైతికం, అన్యాయంగా పేర్కొంది కంపెనీ. పైగా వాళ్లను ఉద్యోగిణులుగా కాకుండా ‘భాగస్వాములు’గా దావాలో పేర్కొనడం కేసును మలుపు తిప్పింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సదరు భాగస్వాములకు(ఉద్యోగిణులకు) లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు అర్బన్ కంపెనీ ఆఫీస్ ప్రాంగణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఊహించని ఈ పరిణామంతో మహిళా ఉద్యోగిణులు బుధవారం తమ నిరసనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తమ నిరసనలు మాత్రం కొనసాగుతాయని దావాలో పేర్కొనబడిన ఓ ఉద్యోగిణి చెప్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగిణులను భాగస్వామ్యులుగా ప్రకటించుకుంటూ దేశవ్యాప్తంగా 35 వేల మందితో పని చేస్తోంది అర్బన్ కంపెనీ. భారత్‌తో పాటు అసీస్, సింగపూర్‌లోనూ సేవలిందిస్తోంది. ఇప్పుడు భాగస్వాములనే కారణాన్ని కోర్టులో పేర్కొంటూ.. వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గిగ్ సెక్టార్లో వణుకు మన దేశంలో యాభై లక్షల మందికి పైగా గిగ్(చిన్న చిన్న పనులు.. ప్రదర్శనలు, ఇతరత్ర సేవలు.. స్టార్టప్ తరహా కంపెనీల్లో) ఎంప్లాయిస్ ఉన్నట్లు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ చెప్తోంది. వీళ్ల వల్ల గిగ్ ఎకానమీ సమర్థవంతంగా నడుస్తోంది. అర్బన్ కంపెనీ వ్యవహారం ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని కలిగిస్తోందని, తద్వారా గిగ్ సెక్టార్‌కు చాలా మంది దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే వీళ్ల హక్కుల రక్షణకు ఎలాంటి చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ఫుడ్ డెలివరీ, రైడ్ ఇలాంటి యాప్స్‌లో పని చేసే ఉద్యోగులకు భద్రత కరువైంది. కరోనా పరిస్థితుల తర్వాత ఇది మరీ ఘోరంగా ఉంటోంది. ఈ తరుణంలో ఈ ఏడాది అక్టోబర్‌లో 35వేలమంది గిగ్ ఎంప్లాయిస్‌తో కూడిన ఓ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉబెర్, ఒలా, జొమాటో, స్వీగ్గీ.. ఇలా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ‘సోషల్ సెక్యూరిటీ చట్టం’ను 2020లోనే ప్రతిపాదించినప్పటికీ.. అది ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. -సాక్షి, వెబ్ స్పెషల్ -
ర్యాపర్‌పై రూ.218 కోట్లకు దావా..!
వాషింగ్టన్: అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్‌ని లీగల్ వివాదాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే విడాకులు తీసుకోవాలని భావించి కోర్టు మెట్లు ఎక్కిన కాన్యే వెస్ట్ తాజాగా తన సండే సర్విసెస్ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే నేపంతో.. ఆయన మీద 30 మిలియన్ డాలర్లకు(దాదాపు 218 కోట్ల రూపాయలు) దావా వేశారు. సన్ అండ్ ది డైలీ మెయిల్ ప్రకారం, కాన్యే తన సండే సర్వీసెస్, ఇతర ప్రదర్శనలకు సంబంధించిన క్లాస్-యాక్షన్ సూట్లను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లో ఈ దావాలు దాఖలు చేశారు. ఇక వీటిలో వందలాది వర్కర్స్, స్టాఫ్ కాన్యే చెల్లింపులో చాలా ఆలస్యం చేస్తాడని, వాటిలో ఊహించని కోతలు, ఉద్యోగంలో దుర్వినియోగం వంటి వాటి గురించి వెల్లడించారు. ఇక కాన్యే మీద రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా.. మొదటిది 500 మంది వర్కర్స్ తరఫున దాఖలైంది. డైలీ మెయిల్ యూఎస్ ప్రకారం కాన్యే వెస్ట్ వారికి కనీసం భోజనం చేయడానికి సమయం ఇవ్వకుండా, విరామం లేకుండా రెండు రోజులు ఏకధాటిగా పని చేయించడాని ఆరోపించారు. (చదవండి: ‘విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్’) దావా దాఖలు చేసిన వారిలో ఒకరైన మైఖేల్ పియర్సన్ మాట్లాడుతూ, ‘‘కాన్యే వెస్ట్ నిబంధనలకు మించి మాతో అధిక సమయం పని చేయించుకుంటారు. ఓవర్‌టైం పని చేసినా కేవలం 500 డాలర్ల మాత్రమే చెల్లిస్తారు’’ అని తెలిపాడు. అంతేకాక మిగతా వర్కర్స్ మాదిరిగానే నేను రోజంతా నిలబడి పని చేశాను. లంచ్, బాత్రూం బ్రేక్స్ కూడా తీసుకోనివ్వలేదు. ఇంత చేస్తే.. కనీసం ఇంటికి వెళ్లడానికి వెహికల్ కూడా ఏర్పాటు చేయలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అలానే కాన్యే వెస్ట్ 2019 ఒపెరా "నెబుచాడ్నెజ్జార్" ప్రదర్శనలో పని చేసిన వారు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఇక తాము కోల్పోయిన బ్రేక్ టైం, పని చేసిన ఓవర్ టైంకు సంబంధించి నష్ట పరిహారం పొందేందుకు గాను దావా దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాన్యే సండే సర్వీసులకు సంబంధించిన మరో దావాను టెక్ కంపెనీ మైచానెల్ ఇంక్ దాఖలు చేసినట్లు డైలీ మెయిల్ నివేదించింది. ఆ దావాలో వర్కర్స్ ఆరు నెలలుగా తమకు వేతనం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండు దావాల వల్ల కాన్యే సుమారు 30 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలి -
సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం?
వాషింగ్టన్: రెండు సంవత్సరాల క్రితం ఇస్తాంబుల్‌లో జరిగిన దారుణ హత్యకు నష్టపరిహారం కోరుతూ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కాబోయే భార్య సెంగిజ్ సౌదీ అరేబియా యువరాజు, ఇతర అధికారులపై మంగళవారం అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమెరికా రచయిత జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాశాడు.దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖషగ్గీని హత్య చేయించాడని అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్ళిన ఖషోగ్గి అక్టోబరు 2, 2018న హత్యకు గురయ్యాడు. అమెరికాకు మిత్రపక్షంగా ఉన్న సౌదీ ఆరేబియా తొలుత ఖషోగ్గి హత్యలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. తరువాత పలు పొంతనలేని వ్యాఖ్యలు చేసినా చివరికి ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయంలో సౌదీ ఏజెంట్ల బృందం ఖషోగ్గిని హత్య చేసినట్లు అంగీకరించింది. దీనిపై విచారణ చేసిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కూడా మహ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గి హత్యకు ఆదేశించారని నివేదిక ఇచ్చింది. ఈ హత్యతో తమకు అపార నష్టం వాటిల్లిందని అతనికి కాబోయే భార్య అమెరికా కోర్టులో కేసు వేసింది. ఖషోగ్గి డీఏడబ్ల్యూఎన్ అనే సంస్థను స్థాపించాడని అతను మరణించిన కారణంగా దాని కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఖషోగ్గిని క్రూరంగా హింసించి హత్య చేశారని ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని షాక్‌కు గురిచేసిందని దావాలో తెలిపారు. అరబ్‌లో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఖషోగ్గి ప్రయత్నించారని, ప్లాన్ ప్రకారమే ఆయనను హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు కోర్టుకు తెలిపారు. చదవండి: మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా -
టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్ ప్రభుత్వంపై దావా
వాషింగ్టన్: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్, ఉద్యోగులు అమెరికా ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. టిక్‌టాక్‌పై బ్యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తానన్న బెదిరింపులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌పై దావా వేయనున్నాయి. ఈ చర్య రాజ్యాంగానికి వ్యతిరేకమని వాదిస్తున్నాయి. రిలయన్స్ చేతికి టిక్‌టాక్?) టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కాలిఫోర్నియా కోర్టులో వేయనున్న దావా, ఇది వేరు వేరు అని ఉద్యోగుల తరపున వాదిస్తున్న న్యాయవాది తెలిపారు. 45 రోజుల్లో టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు, లేదా ఏదైనా కంపెనీ కొనుగోలు చేయకపోతే నిషేధం తప్పదన్న ట్రంప్ సర్కార్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది మైక్ గాడ్విన్ అన్నారు. టిక్‌టాక్ భవితవ్యంపై అనిశ్చితితో ఉద్యోగులు, ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని వ్యాఖ్యానించారు. అలాగే సెప్టెంబరు వరకు లావాదేవీలనునిషేధించిన నేపథ్యంలో అమెరికాలోని సుమారు 1500 మంది టిక్‌టాక్ ఉద్యోగులు చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన నెలకొందని తెలిపారు. అమెరికా రాజ్యాంగంలోని ఐదు, 14వ సవరణల ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేని ఏకపక్ష ప్రభుత్వ చర్య నుండి రక్షణ కావాలని కోరనున్నట్టు తెలిపారు. కాగా అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు ముప్పు అంటూ ట్రంప్ టిక్‌టాక్ నిషేధ హెచ్చరిక జారీ చేశారు. టిక్‌టాక్ ద్వారా అమెరికన్ల డేటాను బైట్‌డ్యాన్స్ చైనా ప్రభుత్వానికి అందజేస్తోందని ట్రంప్ ప్రభుత్వం, ట్రంప్ మద్దతుదారులు పామ్ గ్రేఫ్, లూసియానా, ఇతర నిపుణులు, న్యాయవాదులు మొదటి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు
-
ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు
శాన్ఫ్రాన్సిస్కో: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని కోర్టులో దావా వేశాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని.. నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బీసెర్రా, ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదనను తీసుకోచ్చారు. సైనికుల కోసం, విపత్తుల కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లీస్తే భవిష్యత్తులో ముప్పు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేసిన దేశాల్లో.. కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియాలు ఉన్నాయి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. యూఎస్‌లో మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. -
ఐఫోన్ వాడినందుకు రూ. 12 కోట్ల జరిమానా
మాస్కో : ఐ ఫోన్ వాడినందుకు ఓ రష్యన్ మహిళ దాదాపు 12 కోట్ల రూపాయల జరిమానా చెల్లించనున్నారు. అదేంటి ఆ దేశంలో ఐ ఫోన్ వాడకాన్ని నిషేధించారా ఏంటి.. ఎందుకు అంత జరిమానా అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే సదరు మహిళ శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. వివరాలు.. క్సేనియా సోబ్చక్ అనే మహిళ శాంసంగ్ కంపెనీకి బ్రాండ్ అంబసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో క్సేనియా కొన్ని రోజుల క్రితం ఓ టీవి ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ సమయంలో క్సేనియా తన దగ్గర ఉన్న యాపిల్ ఐఫోన్ఎక్స్ను కెమరా కంటికి చిక్కకుండా జాగ్రత్తగా పేపర్ కింద దాచే ప్రయత్న చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యి కెమరాకు చిక్కారు. ఈ విషయం కాస్తా శాంసంగ్ అధికారుల దృష్టికి చేరింది. దాంతో వారు క్సేనియా మీదా దావా వేశారు. మా కంపెనీ ఫోన్లకు ప్రచారకర్తగా ఉంటూ మా పోటీ కంపెనీ ఫోన్ వాడతావా అని చెప్పి శామ్సంగ్ కంపెనీ క్సేనియాను 1. 6 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.11,71,76,480) జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. -
‘వివరాలు ఇవ్వలేదు.. 87 కోట్లు చెల్లించండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ కార్యాలయం విఫలమైనందును నష్టపరిహారంగా రూ.87 కోట్లు చెల్లించాలని ఓ నిరుద్యోగి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 26 ప్రకారం.. వస్తు, సేవల్లో లోపం కారణంగా తనకు జరిగిన నష్టాన్ని బాధితుడు ప్రతిదారు నుంచి పొందొచ్చు. కానీ, ఈ కేసులో ఫిర్యాదుదారు నిరాధార ఆరోపణలు చేశాడని కమిషన్ అభిప్రాయపడింది. వివరాలు.. ఆర్టీఐ కింద తాను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ విఫలమైందని పంచకులకు చెందిన విజయ్‌కుమార్ ఆరోపించారు. సరైన సమాచారం లభించనందున తాను తీవ్రంగా నష్టపోయినట్టు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ని ఆశ్రయించాడు. నష్టపరిహారంగా 87 కోట్ల రూపాయలు చెల్లించేలా ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్‌ను ఆదేశించాలని దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరాడు అనేందుకు విజయ్ వద్ద ఎలాంటి ఫ్రూఫ్ లేదని పేర్కొంది. తప్పుదు ఆధారాలతో కమిషన్‌ను విజయ్ తప్పుదోవ పట్టించాడని మండిపడింది. ఎంతోమందికి సేవలందించాల్సిన కమిషన్ కాలాన్ని వృధా చేశాడని ఆక్షేపించింది. జరిమానాగా విజయ్ రూ.100 చెల్లించాలని కమిషన్ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించి రశీదు అందించాలని తెలిపింది. ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. -
రణబీర్ కపూర్‌కు కోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌పై పుణె సివిల్ కోర్టులో దావా దాఖలైంది. కల్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్‌లో గల రణబీర్ కపూర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సూర్యవంశీ అనే మహిళ రణబీర్‌పై 50 లక్షల రూపాయలకు దావా వేశారు. రెంటల్ అగ్రిమెంట్ నియమాలను రణబీర్ ఉల్లంఘించాడంటూ సదరు మహిళ ఈ దావా వేశారు. అగ్రిమెంట్ వ్యవధి కంటే ముందే తనను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నట్టుండి తన కుంటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించడంతో తీవ్ర ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని వాపోయారు. వివరాలు: 2016 అక్టోబర్‌లో ‘లీవ్ అండ్ లైసెన్స్’ ప్రాతిపదికన రణబీర్ తన అపార్ట్‌మెంట్‌ను సూర్యవంశీకి నెలకు 4 లక్షల రూపాయల చొప్పున 24 నెలల కాలానికి అద్దెకు ఇచ్చారు. కానీ, అనుకోకుండా 11 నెలలు కాగానే ఇల్లు ఖాళీ చేయాలని రణబీర్ పట్టుబట్టాడని ఆమె వెల్లడించారు. చివరికి 2017 అక్టోబర్‌లో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అపార్ట్మెంట్ ఖాళీ చేయండని రణబీర్ వాళ్లు మాతో అమర్యాదగా ప్రవర్తించారని సూర్యవంశీ కోర్టుకు విన్నవించారు. కాగా, మెయిల్ ద్వారా కోర్టు నోటీసులు అందుకున్న రణబీర్ స్పందిస్తూ.. తాను రెంటల్ అగ్రిమెంట్ నియమాలను ఉల్లంఘించలేదని అన్నారు. ఇష్టపూర్వకంగానే సూర్యవంశీ ఇల్లు ఖాళీ చేశారని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. కోర్టులో తన వాదనలు వినిపిస్తానని స్పష్టంచేశారు. -
దేవాలయంపై దావా వేసిన సన్యాసి
టోక్యో : బలవంతంగా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఏకంగా దేవాలయంపైనే దావా వేశాడో బౌద్ధ సన్యాసి. ఈ ఉదంతం జపాన్‌లోని టోక్యోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని మౌంట్కోయ మీద ఉన్న కోయాసన్ ఆలయం బౌద్ధులకు ప్రముఖమైంది. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూవుంటారు. సన్యాసులుగా శిక్షణ పొందటానికి వచ్చిన వారు శిక్షణలో భాగంగా అక్కడ సేవ చేయాల్సి ఉంటుంది. శిక్షణా సమయాన్ని మించి ఎక్కువ సేపు పని చేయించారని సన్యాసి తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. కొన్నిసార్లు ఒక రోజులో 17 గంటల కంటే ఎక్కువ సమయం అతనితో పని చేయించారని పేర్కొన్నారు. సెలవు దినాల్లో కూడా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారన్న కారణంగా అక్కడి కార్మిక సంఘం మద్దతు కూడగట్టుకున్నాడు సదరు సన్యాసి. బలవంతంగా తనతో ఎక్కువ పని చేయించినందుకు పరిహారంగా 70 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు శ్రమ జపాన్‌లో ప్రధాన సమస్యగా మారింది. 2017లో అదనపు శ్రమ కారణంగా 191 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. షింజో అబే ప్రభుత్వం అదనపు శ్రమను నివారించడానకి తగిన చర్యలు తీసుకున్నా అవి క్షేత్ర స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
చైనాలో యాపిల్‌కు మరో ఎదురు దెబ్బ
బీజింగ్: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ కు చైనాలో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా 28 యాప్ డెవలపింగ్ కంపెనీలు యాపిల్ కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు చేశాయి. మార్కెట్ పవర్ దుర్వినియోగం, యాపిల్ స్టోర్ కంట్రోల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ 28 యాప్ డెవలపర్లు గ్రూప్ ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. యాపిల్ తన ఆపరేటింగ్ సిస్టం దుర్వినియోగం చేస్తూ చైనా యాప్ డెవలర్లను మోసం చేస్తోందని ఈ గ్రూపు ఆరోపించింది. అలాగే ఎలాంటి కారణం లేకుండా చైనా యాప్‌లను తొలగిస్తూ , యాప్ కొనుగోలుకు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తోందనేది చైనా రెగ్యులేటరీ ప్రధాన ఆరోపణ. బీజింగ్-ఆధారిత డేర్ అండ్ సుయర్ అనే న్యాయ సంస్థ చైనాలో ఈ కేసుని నమోదు చేసింది. దీంతో ఇప్పటికే చైనాలో నియంత్రణ సమస్యలు ఎదుర్కొంటున్న కుపెర్టినో ఆధారిత అమెరికన్ బహుళజాతి సాంకేతిక దిగ్గజం యాపిల్ మరిన్ని ఇబ్బందుల్లో పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ పిర్యాదుపై యాపిల్ స్పందించింది. "స్థానిక చట్టాలు, నిబంధనలకు" కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. చైనాలో లోకల్ డెవలపర్లతో తమ సత్సంబంధాలను మరింత విస్తరించనున్నామని చెప్పింది. కాగా గత నెల, ఆపిల్ చైనాలోని యాప్ స్టోర్ నుండి అన్ని ప్రధాన వీపీఎన్ యాప్‌లను తొలగించింది. చైనాలో వీపీఎన్ సర్వీసు ప్రొవైడర్లు ఆపిల్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టుగా యాపిల్ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. చైనాలో చట్టవిరుద్ధమైన కంటెంట్ కలిగి ఉన్న కారణంగా వీటిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. -
అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లి, ఆపై..
అస్టిన్: ఆన్లైన్లో పరిచయం అయిన అమ్మాయిని డేట్‌కు పిలిచాడు. సరేనన్న ఆమెను.. సరదాగా ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమాకు తీసుకెళ్లాడు. అయితే, సినిమా పూర్తయిన వెంటనే అనూహ్యంగా లాయర్‌ను కలిసి.. ఆ అమ్మాయిపై దావా వేశాడు. ఇంతకీ ధియేటర్లో ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా? అమెరికాలోని టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఆమెపై కేసు మాత్రమే వేస్తే సరిపోదు.. జైలుకు పంపాల్సిందే..’ అని నెటిజన్లు వత్తాసు పలుకుతున్నారు. విషయంలోకి వెళితే.. అస్టిన్‌కు చెందిన బ్రెండన్ వెజ్మర్ అనే యువకుడికి.. ఆన్లైన్లో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ కలిసి మే 6న డేట్‌కు వెళ్లారు. అది.. అతని మొట్టమొదటి డేట్ అట! వాళ్లిద్దరూ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమా చూస్తుండగా.. ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సినిమా చూస్తూనే ఆమె దానికి రిప్లై కూడా ఇచ్చింది. అలా ఓ 20 వెసేజ్లు రావడం, వాటన్నింటికీ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. పక్కనే కూర్చున్న బ్రెండన్‌కు ఈ మెసేజ్‌ల వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. ‘నా డబ్బులతో సినిమాకొచ్చి, నా పక్కనే కూర్చొన్న ఆమె.. వరుసగా మెసేజ్‌లు పంపుంపి, సినిమా చూడాలన్న నా హక్కును కాలరాసింది. హాలులో మొబైల్ వాడటం థియేటర్ పాలసీకి వ్యతిరేకం కూడా’అని బ్రెండన్ కోర్టుకెక్కాడు. డేట్ కోసం ఖర్చుచేసిన 17.31 డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని లాయర్ ద్వారా అమ్మాయిని డిమాండ్ చేశాడు. ఆ విధంగా అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లడమేకాక, ఆమెపై దావా వేసిన బ్రెండన్ చర్యను వెర్రితనమని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? -
మాస్టర్ కార్డ్ కు భారీ షాక్
లండన్ : బ్రిటన్ లో దాదాపు 46 మిలియన్ల పౌరులకు డెబిట్, క్రెడిట్ సేవలు అందిస్తున్న మాస్టర్ కార్డ్ సంస్థకు ఊహించని పరిణామం ఎదురైంది. గత 16 సంవత్సరాలుగా వినియోగదారులనుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై లండన్ లోని కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. బ్రిటన్‌కు చెందిన న్యాయ సంస్థ క్విన్ ఇమాన్యుయేల్ ఈ దావా వేసింది. ఖాతాదారులకు అందించే సేవలపై అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ, దాదాపు రూ.1.30 లక్షల కోట్లు (19 బిలియన్ డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ తాజా వివాదంతో మాస్టార్ కార్డ్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. 1992-2007 మధ్య వినియోగదారులనుంచి చట్టవిరుద్ధమైన అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ దాదాపు 600 పేజీల డాక్యుమెంట్ ను కాంపిటీషన్ అప్పీల్ ట్రైబ్యునల్ కు సమర్పించింది. పెరిగిన రుసుముల భారాన్ని కూడా అంతిమంగా వినియోగదారులపైనే వేసినట్టు ఆరోపిస్తూ క్విన్ ఇమాన్యుయేల్‌కు చెందిన న్యాయవాది, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ స్వతంత్ర న్యాయాధికారి వాల్టర్ మెరిక్స్ బీబీసీ కి తెలిపారు. దుకాణాదారులు యూజర్ల డెబిట్, క్రెబిట్ కార్డులు స్వైప్ చేసినపుడు చట్ట విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది బ్రిటన్ వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న ఒక అదృశ్యమైన పన్ను లాంటిదని వ్యాఖ్యానించారు .అయితే ఈ వాదనలను మాస్టర్ కార్డ్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. మరోవైపు బ్రిటన్ చరిత్రలో మాస్టర్‌కార్డ్‌పై ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద దావా అని విశ్లేషకులు చెబుతున్నారు. -
‘సూ’ సంస్థపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొడుతున్న ఎస్ఈడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సూ) సంస్థపై శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. గ్రీన్‌ల్యాండ్స్‌లోని సంస్థ కార్యాలయంతో పాటు సంస్థ ఎండీ, డెరైక్టర్ నివాసాలపై తనిఖీలు చేసి కోట్లాది రూపాయలను గుర్తించారు. ముందుగా ఎస్ఈడబ్ల్యూ కంపెనీపై దాడి చేసిన అధికారులు రూ. 155 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేత పత్రాలను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలోని సంస్థ ఎండీ వల్లూరిపల్లి రాజశేఖర్ నివాసంలో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను గుర్తించారు. అలాగే సంస్థ డెరైక్టర్లు వై.సూర్యపక్రాశ్రావు, వై.గంగాధర్ నివాసాల్లో కూడా దాడులు నిర్వహించారు. కావూరి హిల్స్‌లో నివసించే సూర్యప్రకాశ్‌రావు నివాసంలో, జూబ్లీహిల్స్ రోడ్ నం. 15లో నివసించే గంగాధర్ నివాసంలో కూడా దాడులు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి నివాసాల్లోనూ రూ. 5 కోట్ల పైచిలుకు నగదును, బంగారాన్ని గుర్తించారు.