ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 78 ఏళ్లు కావడంతో వయసు రీత్య విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు పేర్కొనడంతో.. ఆయన శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయనను విలేకరులు ఇంటర్య్వూలో తాను చాలా గొప్పగా భావిస్తున్నానని శోభరాజ్ చెప్పారు.
తాను చేయాల్సింది చాలా ఉందని, చాలా మంది వ్యక్తులపై దావా వేయాలని అన్నారు. ఆయన ప్రస్తుతం దోహా మీదుగా విమానంలో ఫ్రాన్స్‌కి వెళ్లనున్నాడు. మిమ్మల్ని సీరియల్ కిల్లర్‌గా తప్పుగా వర్ణించారని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా..ఔను అని చెప్పాడు. నెట్‌ఫిక్స్‌లో 'సిరిస్ ది సర్పెంట్'లో శోభరాజ్ జీవిత చరిత్రలో 1970లలోని 20 హత్యలతో ముడిపడిన కథను తెరకెక్కించారు.
భారత్‌లో 1976లో అరెస్టు అయ్యాడు. ఐతే 2003లో నేపాల్‌కు వెళ్లాడు, అక్కడ జర్నలిస్ట్ అతనిని గుర్తించి అరెస్టు చేశాడు. చివరికి 1970లలో చేసిన జంట హత్యలకు గాను అక్కడ 21 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ వారంలోనే అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా విడులై ఫ్రాన్స్‌కి పయనమయ్యాడు.
(చదవండి: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలకు ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment