టిక్‌టాక్‌ బ్యాన్ : ట్రంప్ ప్రభుత్వంపై దావా  | TikTok,US employees plan to sue Trump administration over app ban | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ బ్యాన్ : ట్రంప్ ప్రభుత్వంపై దావా 

Published Fri, Aug 14 2020 9:53 AM | Last Updated on Fri, Aug 14 2020 10:35 AM

TikTok,US employees plan to sue Trump administration over app ban - Sakshi

వాషింగ్టన్: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్, ఉద్యోగులు అమెరికా ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. టిక్‌టాక్‌పై బ్యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తానన్న బెదిరింపులపై అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్ సర్కార్‌పై దావా వేయనున్నాయి. ఈ చర్య రాజ్యాంగానికి వ్యతిరేకమని వాదిస్తున్నాయి. రిలయన్స్ చేతికి టిక్‌టాక్?)

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కాలిఫోర్నియా కోర్టులో వేయనున్న దావా, ఇది వేరు వేరు అని ఉద్యోగుల తరపున వాదిస్తున్న న్యాయవాది తెలిపారు.  45 రోజుల్లో టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు, లేదా ఏదైనా కంపెనీ కొనుగోలు చేయకపోతే నిషేధం తప్పదన్న ట్రంప్‌ సర్కార్‌​ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది మైక్ గాడ్విన్ అన్నారు. టిక్‌టాక్‌ భవితవ్యంపై అనిశ్చితితో ఉద్యోగులు, ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని వ్యాఖ్యానించారు. అలాగే సెప్టెంబరు వరకు లావాదేవీలనునిషేధించిన నేపథ్యంలో అమెరికాలోని సుమారు 1500 మంది టిక్‌టాక్‌ ఉద్యోగులు చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన నెలకొందని తెలిపారు. అమెరికా రాజ్యాంగంలోని ఐదు, 14వ సవరణల ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేని ఏకపక్ష ప్రభుత్వ చర్య నుండి రక్షణ కావాలని కోరనున్నట్టు తెలిపారు.

కాగా అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు ముప్పు అంటూ ట్రంప్ టిక్‌టాక్ నిషేధ హెచ్చరిక జారీ చేశారు.  టిక్‌టాక్  ద్వారా అమెరికన్ల డేటాను బైట్‌డ్యాన్స్ చైనా ప్రభుత్వానికి అందజేస్తోందని ట్రంప్‌ ప్రభుత్వం, ట్రంప్ మద్దతుదారులు పామ్ గ్రేఫ్, లూసియానా, ఇతర నిపుణులు, న్యాయవాదులు మొదటి నుంచి వాదిస్తున్న సంగతి  తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement