వాషింగ్టన్ : చైనా చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ నిషేధం గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ అల్టి మేటం జారీ చేశారు. టిక్‌టాక్ యాప్ కొనుగోలు వ్యవహారాన్ని సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా, లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్‌టాక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ వెల్లడించారు. తాజా పరిణామంపై మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టిక్‌టాక్ స్పందించాల్సి ఉంది. (టిక్‌టాక్ : ట్రంప్ తాజా డెడ్‌లైన్)
గత నెలలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా విధించిన సంగతి తెలిసిందే. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీ సంస్థ బైట్‌డాన్స్‌తో ప్రధానంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చర్చల్లో ఉన్నాయి. మరోవైపు టిక్‌టాక్ యజమాని బైట్ డాన్స్, నిర్దేశిత గడువు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తుండటం, చైనా కొత్త నిబంధనలు, బిడ్డర్లతో సంక్షిమైన చర్చల కారణంగా కొనుగోలు ఒప్పందం కుదరకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. (టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం)
Comments
Please login to add a commentAdd a comment