మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని కోర్టులో దావా వేశాయి.