border wall
-
ఉ.కొరియాలో ‘కరోనా గోడ’
సియోల్: ఉత్తర కొరియాలోకి కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవడానికి అక్కడ కిమ్ ప్రభుత్వం రష్యా, చైనా సరిహద్దుల్లో ఏకంగా ఒక గోడ కట్టింది. చైనా, రష్యా సరిహద్దుల నుంచి వైరస్ దేశంలోకి రాకుండా ఉండాలని 2020 నుంచి కొన్ని వేల కిలోమీటర్ల మేర కంచెల్ని వేసుకుంటూ వస్తోంది. సరిహద్దుల్లో కంచెలు, గోడలు, గార్డ్ శిబిరాలు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. కరోనాకి ముందు వరకు దేశానికి ఉత్తరాన ఉన్న ఈ సరిహద్దు ప్రాంతం నుంచే చాలా మంది కిమ్ ప్రభుత్వం అరాచకాలు భరించలేక పారిపోయేవారు. ఆ సరిహద్దు ప్రాంతాన్ని మూసివేస్తూ ఉండడంతో అలా పారిపోయే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. 2019లో అలా దక్షిణ కొరియాకి పారిపోయిన వారి సంఖ్య 1,047 ఉంటే గత ఏడాది వారి సంఖ్య 67కి తగ్గిపోయింది. అయితే ఈ గోడ నిర్మాణంతో చైనాతో వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం పడింది. -
అల్లకల్లోల అఫ్గాన్: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ
అంకార: తాలిబన్ల దురాక్రమణ అనంతరం అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఆ దేశ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రోడ్డు, వాయు మార్గాలను దిగ్భంధించినప్పటికీ సామాన్య పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ నుంచి ఇరాన్ మీదుగా తమ దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేందుకు టర్కీ దేశం ఓ భారీ గోడను నిర్మిస్తోంది. ఇరాన్ సరిహద్దులో 295 కిమీ మేర గోడను నిర్మిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ తాజాగా వెల్లడించారు. VIDEO: Turkey is building a wall along its border with Iran to prevent a new influx of refugees, mainly from Afghanistan as the Taliban take over the country. For now, a 5km section is under construction but Turkey is aiming to build a 295km-long wall on its Iranian border pic.twitter.com/YJAZgUOEGa — AFP News Agency (@AFP) August 17, 2021 ఈ గోడ నిర్మాణంలో సింహ భాగం ఇదివరకే పూర్తైనట్లు ఆయన ప్రకటించారు. గత కొంతకాలంగా ఇరాన్ గుండా తమ దేశంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయని, వారి వల్ల తమ దేశం సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ గోడ నిర్మాణం ద్వారా అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. సరిహద్దు ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశ భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. కాగా, అఫ్గాన్‌లో అంతర్యుద్ధం కారణంగా ప్రతి రోజు వేల సంఖ్యలో ఆ దేశ పౌరులు తూర్పూ సరిహద్దుల (ఇరాన్) గుండా టర్కీలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు టర్కీలో ఇప్పటికీ రెండు లక్షల మంది సిరియన్లు మరో ఆరు లక్షల మంది అఫ్గాన్లు శరణార్దులుగా ఉన్నారు. చదవండి: అఫ్గన్‌లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది! -
గోడలో పాములు, మొసళ్లు ఉంచండి: ట్రంప్
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై మరోసారి విరుచుకుపడ్డారు. వలసదారులను అడ్డుకోవడానికి కరెంటు తీగలతో కూడిన గోడను నిర్మించి.. దాని పొడవునా పాములు, మొసళ్లు ఉండేలా చూడాలని వైట్‌హౌజ్ సలహాదారులకు సూచించారు. తద్వారా వలసదారులను అడ్డకోవచ్చని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ వలసదారులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రవేశపెట్టిన జీరో టాలరెన్స్ విధానం కారణంగా అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధానం వల్ల ఎంతో మంది వలస చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరం కాగా.. మరికొంత మంది అమెరికాలో ప్రవేశించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వలసదారుల పట్ల కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తామన్నట్లు సంకేతాలు ఇచ్చిన ట్రంప్ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. నేటికీ వలసదారులు అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారంటూ ఉన్నతాధికారులపై ట్రంప్ విరుచుకుపడినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. సరిహద్దు గోడ విషయంలో అలసట వహిస్తూ తనను ఇడియట్‌లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ వారిపై చిందులు తొక్కినట్లు తెలిపింది. కాగా సరిహద్దు సమస్యల నేపథ్యంలో.. మైకెల్ షియర్, జూలీ డెవిస్ అనే ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా రచించిన ‘బార్డర్ వార్స్: వలసదారులపై ట్రంప్ అంతరంగం’ అనే పుస్తకం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ పుస్తకాన్ని అక్టోబర్ 8న ఆవిష్కరించనున్నారు. -
ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు
-
ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు
శాన్ఫ్రాన్సిస్కో: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని కోర్టులో దావా వేశాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని.. నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బీసెర్రా, ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదనను తీసుకోచ్చారు. సైనికుల కోసం, విపత్తుల కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లీస్తే భవిష్యత్తులో ముప్పు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేసిన దేశాల్లో.. కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియాలు ఉన్నాయి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. యూఎస్‌లో మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. -
అమెరికాలో ఎమర్జెన్సీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే నిధులు పొందేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ప్రకటన చేస్తూ అక్రమ వలసల్ని తమ దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని విపక్ష డెమొక్రటిక్ సభ్యులు యోచిస్తున్నారు. మిలిటరీ, డ్రగ్ వ్యతిరేక కార్యక్రమాల నిధుల్ని గోడ నిర్మాణానికి మళ్లించే అవకాశాలున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపా యి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. ట్రంప్‌ది అధికార దుర్వినియోగం.. అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని వి« దించడాన్ని డెమొక్రాట్లు, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని కోర్టులో సవాలుచేస్తామని హెచ్చరించాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మం డిపడ్డాయి. అయితే ఈ హెచ్చరికల్ని ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. ‘నా నిర్ణయంపై దావా వేస్తే ఆ విచారణా ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుంది. చివరికి గెలుపు నాదే’అన్నారు. లేని సంక్షోభం పేరిట ట్రంప్ అత్యవసర పరి స్థితి విధించారని, సైనికుల నిధుల్ని దారి మళ్లి స్తే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి, సెనెటర్ షూమర్ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. -
‘చట్టబద్ధంగా వచ్చిన వారికే మా దేశంలో చోటు’
వాషింగ్టన్ : చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని ట్రంప్ కోరారు. అక్రమ వలసదారులే దేశానికి పెను ముప్పని తేల్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ‘అమెరికన్ల ఉద్యోగాలకు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ బలమైన వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను. కానీ వారు న్యాయపరంగా రావాలి’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్రమ వలసల్ని, మాదక ద్రవ్యాలను అడ్డుకోవాలంటే సరిహద్దు గోడ నిర్మాణం తప్పనిసరని తేల్చారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకంగా నిలిచే సరిహద్దు గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు అడ్డుకోవడం సరికాదన్నారు ట్రంప్. గతంలో చాలా మంది సరిహద్దు గోడ నిర్మణానికి మద్దతు తెలిపారని.. కానీ నేడు వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 15 లోగా సరిహద్దు గోడ నిర్మాణం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గడువు విధించారు. చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని తెలిపారు. అంతేకాక అదేసమయంలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి డెమొక్రాట్లు చేస్తున్న విమర్శల విషయంలో ఘాటుగా స్పందించారు. వాటిని పనికిమాలిన ఆరోపణలుగా కొట్టిపారేశారు. -
అమెరికా చరిత్రలో షట్‌డౌన్ రికార్డు
వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ రికార్డును శుక్రవారం రాత్రితో అధిగమించింది. మరోవైపు, మీ సెలవులు ముగించుకుని వైట్హౌస్కొచ్చి షట్డౌన్కు ముగింపు పలికండి అంటూ ప్రతిపక్ష డెమోక్రాట్ సభ్యులను ట్రంప్ చర్చలకు ఆహ్వానించారు. గోడ నిర్మాణానికి నిధులపై ఆమోదం లభించకుంటే మిగతా బడ్జెట్ బిల్లులపై తాను సంతకం చేయబోనని వ్యాఖ్యానించారు. ‘డెమోక్రాట్లకు, కాంగ్రెస్ ప్రతినిధులకు మీరైనా చెప్పండి. ‘షట్డౌన్కు ముగింపు పలకమనండి’ అంటూ తన 5.72 కోట్ల ట్విట్టర్ ఫాలోయర్లను కోరారు. -
మరోసారి స్తంభించిన అమెరికా ప్రభుత్వం
వాషింగ్టన్ : అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో మరోసారి అమెరికా ప్రభుత్వం స్తభించింది. దాంతో భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 12. 01 గంటల నుంచి పలు ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలను, పార్కులను మూసి వేశారు. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించే నిమిత్తం ట్రంప్ ప్రభుత్వం 5 బిలియన్ల అమెరికన్ డాలర్లను డిమాండ్ చేసింది. కానీ డెమొక్రాట్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వ స్తంభన ఏర్పడింది. ఫలితంగా శుక్రవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఏ ప్రభుత్వ కార్యాలయానికి కూడా ఖజానా నుంచి నిధులు మంజూరు కావు. దాంతో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితవ్వాలి.. లేదా వేతనం లేకుండా పని చేయాల్సి రావచ్చని తెలిసింది. ప్రభుత్వ స్తంభన విషయాన్ని ట్రంప్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సి వచ్చిందని ఆయన అసహనం చెందారు. అయితే ఇది ఎంతోకాలం ఉండకపోవచ్చని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం స్తంభించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. -
మెక్సికో సరిహద్దు గోడకు 1.14 లక్షల కోట్లు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో చేసిన ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తారన్న దానిపై కొంత స్పష్టత వచ్చింది. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది. మరోవైపు, పాక్‌ను దారిలోకి తేవడానికి ఆర్థిక సాయం నిలిపేయడమే కాకుండా ఇతర అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. తాలిబన్, హక్కానీ నెట్వర్క్ లాంటి ఉగ్ర సంస్థల నిర్మూలనకు పాకిస్తాన్‌ను ఒప్పించేందుకు ఇంకా ఎన్నో మార్గాలున్నాయని ఉన్నతాధికారి చెప్పారు. -
డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది!
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని, తద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న ట్రంప్.. సరిహద్దు గోడకు అయ్యే ఖర్చు చూసి వెనక్కి తగ్గారు. మెక్సికో- అమెరికా సరిహద్దుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఆ నిర్మాణానికి 21.6 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ నిర్మాణంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టంచేసిన ట్రంప్, ఖర్చు మాత్రం కచ్చితంగా సగం తగ్గేలా చూడాలని (దాదాపు రూ.70-80 వేల కోట్లు) అధికారులకు సూచించారు. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు నిరోధించాలంటే 'గ్రేట్ వాల్' నిర్మిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆ నిర్మాణానికి ఖర్చు దాదాపు 12 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.80 వేల కోట్లు ) అవుతుందని ట్రంప్ భావించారు. తమ దేశంతో పాటు మెక్సికో కూడా ఖర్చులో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదివరకే లోక్ హీడ్ మార్టిన్ నుంచి 90 ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను కోనుకోలు చేయడానికి 600 మిలియన్ల ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావించి గ్రేట్ వాల్ అంచనా ఖర్చును తగ్గించాలని నిర్ణయించారు.