వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే నిధులు పొందేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ప్రకటన చేస్తూ అక్రమ వలసల్ని తమ దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని విపక్ష డెమొక్రటిక్ సభ్యులు యోచిస్తున్నారు. మిలిటరీ, డ్రగ్ వ్యతిరేక కార్యక్రమాల నిధుల్ని గోడ నిర్మాణానికి మళ్లించే అవకాశాలున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపా యి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం.
ట్రంప్‌ది అధికార దుర్వినియోగం..
అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని వి« దించడాన్ని డెమొక్రాట్లు, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని కోర్టులో సవాలుచేస్తామని హెచ్చరించాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మం డిపడ్డాయి. అయితే ఈ హెచ్చరికల్ని ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. ‘నా నిర్ణయంపై దావా వేస్తే ఆ విచారణా ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుంది. చివరికి గెలుపు నాదే’అన్నారు. లేని సంక్షోభం పేరిట ట్రంప్ అత్యవసర పరి స్థితి విధించారని, సైనికుల నిధుల్ని దారి మళ్లి స్తే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి, సెనెటర్ షూమర్ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment