వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ రికార్డును శుక్రవారం రాత్రితో అధిగమించింది. మరోవైపు, మీ సెలవులు ముగించుకుని వైట్‌హౌస్‌కొచ్చి షట్‌డౌన్‌కు ముగింపు పలికండి అంటూ ప్రతిపక్ష డెమోక్రాట్ సభ్యులను ట్రంప్ చర్చలకు ఆహ్వానించారు. గోడ నిర్మాణానికి నిధులపై ఆమోదం లభించకుంటే మిగతా బడ్జెట్ బిల్లులపై తాను సంతకం చేయబోనని వ్యాఖ్యానించారు. ‘డెమోక్రాట్లకు, కాంగ్రెస్ ప్రతినిధులకు మీరైనా చెప్పండి. ‘షట్‌డౌన్‌కు ముగింపు పలకమనండి’ అంటూ తన 5.72 కోట్ల ట్విట్టర్ ఫాలోయర్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment