
వాషింగ్టన్ : అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో మరోసారి అమెరికా ప్రభుత్వం స్తభించింది. దాంతో భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 12. 01 గంటల నుంచి పలు ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలను, పార్కులను మూసి వేశారు. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించే నిమిత్తం ట్రంప్ ప్రభుత్వం 5 బిలియన్ల అమెరికన్ డాలర్లను డిమాండ్ చేసింది. కానీ డెమొక్రాట్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వ స్తంభన ఏర్పడింది.
ఫలితంగా శుక్రవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఏ ప్రభుత్వ కార్యాలయానికి కూడా ఖజానా నుంచి నిధులు మంజూరు కావు. దాంతో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితవ్వాలి.. లేదా వేతనం లేకుండా పని చేయాల్సి రావచ్చని తెలిసింది. ప్రభుత్వ స్తంభన విషయాన్ని ట్రంప్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సి వచ్చిందని ఆయన అసహనం చెందారు. అయితే ఇది ఎంతోకాలం ఉండకపోవచ్చని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం స్తంభించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.
Comments
Please login to add a commentAdd a comment