డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది! | Trump wants to bring down the cost of wall on Mexico border | Sakshi
Sakshi News home page

డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది!

Published Sun, Feb 12 2017 9:00 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది! - Sakshi

డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది!

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని, తద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న ట్రంప్.. సరిహద్దు గోడకు అయ్యే ఖర్చు చూసి వెనక్కి తగ్గారు. మెక్సికో- అమెరికా సరిహద్దుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఆ నిర్మాణానికి 21.6 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.  ఆ నిర్మాణంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టంచేసిన ట్రంప్, ఖర్చు మాత్రం కచ్చితంగా సగం తగ్గేలా చూడాలని (దాదాపు రూ.70-80 వేల కోట్లు) అధికారులకు సూచించారు.

మెక్సికో నుంచి అమెరికాకు వలసలు నిరోధించాలంటే 'గ్రేట్ వాల్' నిర్మిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆ నిర్మాణానికి ఖర్చు దాదాపు 12 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.80 వేల కోట్లు ) అవుతుందని ట్రంప్ భావించారు.  తమ దేశంతో పాటు మెక్సికో కూడా ఖర్చులో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటో  నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదివరకే లోక్ హీడ్ మార్టిన్ నుంచి 90 ఎఫ్-35 ఫైటర్ జెట్  విమానాలను కోనుకోలు చేయడానికి 600 మిలియన్ల ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావించి గ్రేట్ వాల్ అంచనా ఖర్చును తగ్గించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement