F-35 Joint Strike Fighters
-
ఎఫ్–35.. అంతు ‘చిక్కదు’
భారత్కు అమెరికా విక్రయించనున్న ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఐదో తరం యుద్ధ విమానాల్లోకెల్లా అత్యాధునికమైనవి. →ఎఫ్–35లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎఫ్–135 ఇంజన్ను వాడారు.→ఇది 8 టన్నుల బరువైన ఆయుధాలతో గంటకు 1,200 కి.మీ. పై చిలుకు వేగంతో దూసుకెళ్లగలదు.→అత్యాధునిక రాడార్లను, పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఏమార్చగలదు.→నానా పరికరాల గందరగోళం లేకుండా అత్యాధునిక టచ్ స్క్రీన్లతో కూడిన విలాసవంతమైన కాక్పిట్ దీని ప్రత్యేకత.→ఎఫ్–35ఏతో పాటు మరో రెండు రకాలున్నాయి. రన్వే అవసరం లేకుండా నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యం ఎఫ్–35బీ సొంతం. ఎఫ్–35సీ విమానవాహక నౌకల కోసం ప్రత్యేకంగా రూపొందింది. వీటి ఖరీదు రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల దాకా ఉంటుంది. వీటి శిక్షణతో పాటు నిర్వహణ కూడా చాలా ఖరీదైన వ్యవహారమే. గంటపాటు గాల్లో ఎగిరితే 36 వేల డాలర్లు ఖర్చవుతుంది!→ఈ విమానాల అభివృద్ధిపై అమెరికా ఏకంగా రూ.2 లక్షల కోట్లు వెచ్చించింది.→నిర్మాణ భాగస్వాములైన బ్రిటన్, ఇటలీ, నార్వేలను మినహాయిస్తే జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వద్ద మాత్రమే ఎఫ్–35లున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
డోనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది!
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని, తద్వారా వలసలకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న ట్రంప్.. సరిహద్దు గోడకు అయ్యే ఖర్చు చూసి వెనక్కి తగ్గారు. మెక్సికో- అమెరికా సరిహద్దుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఆ నిర్మాణానికి 21.6 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ నిర్మాణంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టంచేసిన ట్రంప్, ఖర్చు మాత్రం కచ్చితంగా సగం తగ్గేలా చూడాలని (దాదాపు రూ.70-80 వేల కోట్లు) అధికారులకు సూచించారు. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు నిరోధించాలంటే 'గ్రేట్ వాల్' నిర్మిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆ నిర్మాణానికి ఖర్చు దాదాపు 12 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.80 వేల కోట్లు ) అవుతుందని ట్రంప్ భావించారు. తమ దేశంతో పాటు మెక్సికో కూడా ఖర్చులో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదివరకే లోక్ హీడ్ మార్టిన్ నుంచి 90 ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను కోనుకోలు చేయడానికి 600 మిలియన్ల ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావించి గ్రేట్ వాల్ అంచనా ఖర్చును తగ్గించాలని నిర్ణయించారు.