
భారత్‌కు అమెరికా విక్రయించనున్న ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఐదో తరం యుద్ధ విమానాల్లోకెల్లా అత్యాధునికమైనవి.
→ఎఫ్–35లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎఫ్–135 ఇంజన్‌ను వాడారు.
→ఇది 8 టన్నుల బరువైన ఆయుధాలతో గంటకు 1,200 కి.మీ. పై చిలుకు వేగంతో దూసుకెళ్లగలదు.
→అత్యాధునిక రాడార్లను, పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఏమార్చగలదు.
→నానా పరికరాల గందరగోళం లేకుండా అత్యాధునిక టచ్ స్క్రీన్లతో కూడిన విలాసవంతమైన కాక్‌పిట్ దీని ప్రత్యేకత.
→ఎఫ్–35ఏతో పాటు మరో రెండు రకాలున్నాయి. రన్‌వే అవసరం లేకుండా నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యం ఎఫ్–35బీ సొంతం. ఎఫ్–35సీ విమానవాహక నౌకల కోసం ప్రత్యేకంగా రూపొందింది. వీటి ఖరీదు రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల దాకా ఉంటుంది. వీటి శిక్షణతో పాటు నిర్వహణ కూడా చాలా ఖరీదైన వ్యవహారమే. గంటపాటు గాల్లో ఎగిరితే 36 వేల డాలర్లు ఖర్చవుతుంది!
→ఈ విమానాల అభివృద్ధిపై అమెరికా ఏకంగా రూ.2 లక్షల కోట్లు వెచ్చించింది.
→నిర్మాణ భాగస్వాములైన బ్రిటన్, ఇటలీ, నార్వేలను మినహాయిస్తే జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వద్ద మాత్రమే ఎఫ్–35లున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment