defence sector
-
‘రక్షణ’ ఎగుమతుల్లో నంబర్ వన్ కానున్న భారత్..
అవనిగడ్డ: రక్షణరంగ ఎగుమతుల్లో భారత్ నంబర్ వన్ స్థానానికి ఎదిగేరోజు దగ్గరలోనే ఉందని భారత రక్షణరంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఆదివారం దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు 99వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ప్రతీదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని చెప్పారు. గత ఏడాది రూ.21 వేలకోట్ల విలువైన రక్షణరంగ పరికరాలను మనం విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మన దేశం రూ.50 వేలకోట్ల నుంచి రూ.80 వేలకోట్ల పరికరాలు ఎగుమతి చేసేస్థాయికి చేరుతుందన్నారు. మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం సారథ్యంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్టులు నేడు మన దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చాయని చెప్పారు. నిమ్మకూరులో ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేస్థాయికి చేరుకుంటామన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఎదురైన ఆటంకాలను తొలగించి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేస్తామని చెప్పారు. తెలుగువారిని ఒక్కటి చేసిన మండలి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సరసన చేర్చదగిన గొప్ప వ్యక్తి సతీష్‌రెడ్డి అని కొనియాడారు. తెలుగు భాషాభివృద్దికి తోడ్పడిన మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెంకటకృష్ణారావు ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు ద్వారా తెలుగువారందరినీ ఒక్కటి చేశారని పేర్కొన్నారు. సతీష్‌రెడ్డి జీవితచరిత్రపై మండలి ఫౌండేషన్ ప్రచురించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. -
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్‌నాథ్
తేజ్‌పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్‌ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
నింగి.. నేల.. నీరు.. ఎక్కడైనా పవర్ఫుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.. నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్‌ను నియంత్రిస్తూ ఉంటారు భారత్‌కు ఎలా ఉపయోగం ? దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి? ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్‌ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్‌తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు. ప్రత్యేకతలు ► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు ► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు ► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది ► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్‌క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు ► 12,177 కేజీల బరువైన పేలోడ్‌ను మోసుకుపోగలదు ► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు ► 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్‌వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు ► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు సాక్షి, నేషనల్ డెస్క్ -
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
అగ్రరాజ్యాలకు దీటుగా.. సాగర జలాల్లో ఇక నిరంతర నిఘా!
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటూ డిఫెన్స్ సెక్టార్ కీలకంగా వ్యవహరిస్తోంది. కేవలం నౌకాదళం, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే కాకుండా... సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అగ్రరాజ్యాలకు దీటుగా బలాన్ని, బలగాన్ని పెంచుకుంటోంది. వైరి దేశాల కవ్వింపు చర్యలకు సరైన సమాధానం ఇచ్చేందుకు నిరంతరం నూతన రక్షణ వ్యవస్థలతో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సాగర జలాల్లో నిరంతరం పహారా కాసేలా ఇండియన్ కోస్ట్ గార్డ్ తొలిసారిగా మానవ రహిత మల్టీకాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ కోస్ట్‌గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్లకు బదులుగా... సరికొత్త సాంకేతికతతో మల్టీకాప్టర్లను తన అమ్ములపొదిలో చేర్చుకుంది. నిరంతరం పహారా కాసే సామర్థ్యం ఉన్న ఈ మల్టీకాప్టర్ డ్రోన్లు... కోస్ట్‌గార్డ్ రక్షణ వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. వెర్టికల్‌గా టేకాఫ్‌తోపాటు ల్యాండింగ్ కూడా అయ్యేలా ఇవి పనిచేస్తాయి. కోస్ట్‌గార్డ్ నౌకల్లోనూ, ఆఫ్‌షోర్ స్టేషన్ల నుంచి వీటిని ప్రయోగించొచ్చు. మూడేళ్లలో 100 మల్టీకాప్టర్లు.. ప్రస్తుతం కోస్ట్ గార్డ్.. తొలి విడతగా 10 మల్టీకాప్టర్లను కొనుగోలు చేసుకుంది. వీటిని విశాఖ, కోల్‌కతా ప్రాంతాల్లోని ఐసీజీ ప్రధాన స్థావరాలకు కేటాయించాలని నిర్ణయించింది. తీరప్రాంత నిఘా, భద్రత వ్యవస్థలను మరింత పటిష్టం చేసేలా.. సరిహద్దు ప్రాంతాల్లో ఈ మల్టీకాప్టర్ డ్రోన్లు రాత్రి, పగలు పహారా కాస్తాయి. నిఘాకు మాత్రమే కాకుండా... ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లలోనూ, యాంటీ పైరసీ, యాంటీ స్మగ్లింగ్, ఆయిల్స్పిల్, కాలుష్య నియంత్రణ ఆపరేషన్స్ మొదలైనవాటికి కూడా వీటిని వినియోగించనున్నారు. ఏడాది నుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ తీర ప్రాంత భద్రతపై మరింత పట్టు సాధించింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి నిర్వహించిన ఏడు జాయింట్ ఆపరేషన్లలో రూ.1,900 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్ దేశంలోకి రాకుండా స్వా«దీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లలో పాక్, ఇరాన్ దేశాలకు చెందిన చొరబాటుదారుల్ని కూడా అదుపులోకి తీసుకుంది. ఇకపై భద్రత వ్యవస్థను మరింత స్మార్ట్‌గా పటిష్టం చేసేందుకు మల్టీకాప్టర్లను వినియోగించాలని కోస్ట్‌గార్డ్ నిర్ణయించింది. ఇందుకోసం 2025 నాటికి మరో 100 మల్టీకాప్టర్ డ్రోన్లను కొనుగోలు చేసే దిశగా అడుగులేస్తోంది. -
బైడెన్ సంచలనం: అమెరికా చరిత్రలో తొలిసారి
వాషింగ్టన్: నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్.. ట్రంప్ అధ్యక్ష కాలంలో ముదిరిన జాత్యాంహకార ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ఆఫ్రికన్-అమెరికన్‌ని రక్షణ శాఖ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. బరాక్ ఒబామా ఆధ్వర్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికన్ దళాలను పర్యవేక్షించిన రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్‌ని ఈ అత్యున్నత పదవికి బైడెన్ ఎన్నుకున్నారు. 2003లో అమెరికా దళాలను బాగ్దాద్‌లోకి నడిపించి, యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అధిపతిగా ఎదిగారు లాయిడ్ ఆస్టిన్. తన కేబినెట్లో మైనారీటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రటరీ మిచెల్ ఫ్లోర్నోయ్ ఒత్తిడి మేరకు 67 ఏళ్ల ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్‌లు పేర్కొన్నాయి. బైడెన్ శుక్రవారం ఆస్టిన్ నియామకం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవి చేపట్టడానికి ముందు ఆస్టిన్‌కు సెనేట్ అంగీకారం అవసరమని సమాచారం. ఆస్టిన్ నాలుగు దశాబ్దాలపాటు అమెరికా ఆర్మీకి సేవలు అందించారు. 2003లో 3వ ఇన్ఫాంట్రీ డివిజన్‌కు అసిస్టెంట్ డివిజన్ కమాండర్‌గా వ్యవహరించిన ఆస్టిన్ ఇరాక్‌పై దాడిలో యూఎస్ సేనలను కువైట్ నుంచి బాగ్దాద్‌లోకి నడిపించారు. 2010లో ఇరాక్‌లోని అమెరికా దళాలకు కమాండింగ్ జనరల్‌గా నియమితులైన ఆస్టిన్.. రెండేళ్ల తర్వాత మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్‌లలో పెంటగాన్ కార్యకలాపాలకు బాధ్యత వహించే సెంట్రల్ కమాండ్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. 2016లో మిలటరీ నుంచి రిటైర్ అయిన ఆయన అనంతరం పెంటగాన్ అతిపెద్ద కాంట్రాక్టర్స్లో ఒకటైన రేథియాన్ టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో చేరారు. (చదవండి: అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్) ఇక ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్‌కి, ఆస్టిన్ మధ్య మంచి సంబంధాలుండేవి. ఇక వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్ సోమవారం హెల్త్ సెక్టర్‌లోకి తాను తీసుకోబోతున్న ప్రముఖ వ్యక్తుల పేర్లు వెల్లడించారు. కరోనావైరస్పై యుద్ధంలో వీరు బైడెన్‌కు బాసటగా నిలవనున్నారు. -
101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం
సాక్షి, ఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా డీఆర్డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఈ నిర్ణయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన అన్నారు. భారత్, చైనా మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో క్రమంగా దిగుమతులపై నిషేధాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.(రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు) రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాబితాను భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించిన తరువాత తయారు చేసినట్లు రక్షణ మంత్రి చెప్పారు. ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్ట్ మధ్య సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 6 నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమకు సుమారు రూ .4 లక్షల కోట్లు ఆర్డరు ఇవ్వనున్నారు. -
రక్షణ రంగంలోకి.. మేఘా
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు ఎంఈ ఐఎల్కు అనుమతిస్తూ కేంద్ర హోం, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. వివిధ దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఈ సంస్థ ఆయుధాలు, రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేం దుకు అనుమతి పొందింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉత్పత్తులు ఇవే... ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. అలాగే సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపీసీ) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసీవీ), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలికపాటి యుద్ధ వాహనాలు (ఏసీటీవీ) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్యూప్మెంట్ను కూడా ఉత్పత్తి చేయనుంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంతో చమురు–ఇంధన వాయువు, విద్యుత్, సౌర విద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్Š సంస్థ ఈ పరిశ్రమ ద్వారా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. ఇప్పటికే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో.. మేఘా గ్రూప్‌కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్రసాంకేతిక రంగాల్లో సహాయసహకారాలు అందిస్తోంది. óఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌తో పాటు విద్యుత్ ప్రసారం, సౌర రంగాల్లో కూడా నిమగ్నమై ఉంది. అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్లు, ఈడబ్ల్యూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరా చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశంలోనే తొలిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం.. దేశీయంగా ఆధునిక రక్షణ పరికరాలను తయారు చేయడానికి అవసరమైన అనుమతులన్నింటిని ఎంఈఐఎల్ పొందిందని సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొమ్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాధునిక శాస్త్రసాంకేతిక సామర్థ్యంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కల, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఆయన లక్ష్యంలో మేఘా గ్రూప్ కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు. -
రక్షణ రంగానికి భారీ కేటాయింపులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్లో ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పరిపాలనలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌పై ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గత ఏడాది కంటే రక్షణ రంగానికి 5.8 శాతం మాత్రమే ఎక్కువ కేటాయింపులు జరపడం గమనార్హం. పోయిన సంవత్సరం రక్షణ రంగానికి కేంద్రం రూ.3.18 లక్షల కోట్లు కేటాయించింది. కాగా బడ్జెట్లో గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశామని నిర్మల తెలిపిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచినట్లు ఆమె వెల్లడించారు. జీఎస్టీ అమలుతో ఆర్థిక రంగంలో చారిత్రక సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ.85 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.53 వేల 700 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని నిర్మల తెలిపారు. -
‘డిఫెన్స్ స్కాములతో దోచుకున్నారు’
తిరుపూర్ : కాంగ్రెస్ హయాంలో దేశ భద్రతను పూర్తిగా విస్మరించారని, రక్షణ రంగంలో అడుగడుగునా కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షంపై ధ్వజమెత్తారు. రక్షణ రంగంలో సముద్రం నుంచి ఆకాంశం వరకూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడే క్రమంలో సైనిక బలగాల ఆధునీకరణనూ విస్మరించిందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పని సంస్కృతి గత ప్రభుత్వాల కంటే భిన్నమన్నారు. తిరుపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన వారు దేశ రక్షణ రంగం గురించి పట్టించుకోలేదన్నారు. ఈ రంగంలో కుంభకోణాల ద్వారా తమ సన్నిహితులకు లబ్ధి చేకూరడమే పరమావధిగా పనిచేశారని దుయ్యబట్టారు. జాతీయ భద్రతకు, రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. తమిళనాడులో ఏర్పాటు చేయబోయే డిఫెన్స్ కారిడార్ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయన్నారు. -
‘చేతి’వాటమున్నా రక్షణ బాగే
మోదీ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ముందంజలో ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఇంతవరకు ఆయన ప్రభుత్వం దిగుమతి చేసుకోదలిచినవి 36 రాఫెల్స్ మాత్రమే. వీటి దిగుమతుల కోసం చర్చలు జరిగినది యూపీఏ హయాంలోనే. రక్షణ పరికరాల సేకరణ, లోపాల సవరణ వరకు మూడున్నరేళ్ల మోదీ బ్యాలెన్స్ షీట్ ఖాళీగానే ఉంది. మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ రక్షణమంత్రులుగా వచ్చినప్పటికీ రక్షణ కొనుగోళ్లు చేయడానికి వెనుకాడడం, దృష్టి పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. మరో సాయమేదీ లేకుండా ఎన్నికలలో విజయం సాధించిన ఘనతను చరిత్రలో నమోదు చేసుకున్నది బొఫోర్స్ గన్ ఒక్కటే. ఈ యంత్రాంగం వెనుక ఎవరో ఒకరు ఉన్నారని అనడం మనకీ ఇష్టమే కాబట్టి, ఆ విషయం పరిగణనలోకి వస్తుంది. ఆ వ్యక్తి వీపీ సింగ్. లక్ష్యం గుండా చూస్తే ఆయనే కనిపిస్తారు. 1988లో అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో వీపీ సింగ్ గెలుపొందారు. అప్పుడే రాజీవ్‌గాంధీని శంకరగిరి మన్యాలు పట్టిస్తానన్న తన సవాలు అమలుకు శ్రీకారం చుట్టారాయన. అలహాబాద్ గ్రామీణ ప్రాంతాలలో మోటార్‌సైకిల్ మీద ప్రయాణిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఆగి సూటిగా మాట్లాడేవారు. ఆయన సందేశం సాధారణమైనదే. మీ ఇళ్లు దోపిడీ అయిపోతున్నాయి! ఎలా అంటారా? మీరు ఓ బీడీ కట్ట లేదా అగ్గిపెట్టె కొంటారు. అందులో కొన్ని అణాలు పన్ను పేరుతో ప్రభుత్వం దగ్గరకు చేరతాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నడిపినా, పాఠశాలలు నిర్వహించినా ఆఖరికి మీ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసినా ఆ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బుతోనే. కానీ మీరు ప్రభుత్వానికి చెల్లించిన ఆ డబ్బులో కొంత అపహరణకు గురవుతున్నది. దీనిని మీరు ఇల్లును దోచేయడం అనక ఇంకేమంటారు? ఈ మాటలతో పాటు ఆయన జత చేసిన ఇంకో రెండు అంశాలు మినహాయిస్తే అంతవరకు బాగానే ఉంది. ఆ రెండు అంశాలలో మొదటిది– మామూలుగా రాజకీయ పరిధిలో ఉపయోగించే అతిశయోక్తే– బొఫోర్స్ చోరుల జాబితా నా కుర్తా జేబులోనే ఉంది. నేను అధికారంలోకి వచ్చేదాకా వేచి చూడండి ఏం జరుగుతుందో! అనేవారు. రెండో అంశం: తమకు ఇచ్చిన తుపాకులు వెనుక నుంచి పేలుతున్నాయని మన సైనికులు అవాక్కయ్యేవారు. శత్రువులకు బదులు తమనే చంపుతున్నాయని బిత్తరపోతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి మాటలను ఎవరూ నమ్మరు. కానీ ఈ మాటలతో ప్రజలు బాగా వినోదించేవారు. బొఫోర్స్ రగడ మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. బొఫోర్స్ ముడుపుల కేసులో ఎవరినీ పట్టుకోలేదు. ఎవరికీ శిక్ష కూడా పడలేదు. కానీ అప్పుడు దర్యాప్తు పేరుతో బయటకు వచ్చిన కథలన్నీ కాలగర్భంలో కలిశాయి. ఆ గన్ మాత్రం చాలా బాగా పనిచేసింది. కార్గిల్ ఘర్షణ సమయంలో భారత్‌కు పరువు దక్కిందంటే బొఫోర్స్ గన్ వెనక్కి పేలడం వల్ల కాదు. ఇప్పటికీ ప్రధానంగా ఉపయోగపడుతున్న ఆయుధం అదే. అయితే, ఈ ముప్పయ్ ఏళ్లలో ఒక్క బొఫోర్స్ తుపాకీ కొనుగోలు కోసం కూడా మళ్లీ ఆర్డర్ వెళ్లలేదు. ఇటీవల కాలంలో ధనుష్ వంటి తుపాకుల తయారీకి ప్రయత్నాలు చేసినా, ఒక్క తుపాకీ కూడా తయారుచేసుకోలేదు. బొఫోర్స్ సృష్టించిన గలభా అలాంటిది. అసలు భారతదేశ రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఉల్లిపాయలు దొంగతనం చేస్తూ పట్టుబడిన పల్లెటూరి మూఢుడి కథలా ఉంటుంది. ఎలాంటి శిక్ష కావాలో నీవే తేల్చుకొమ్మని పంచాయతీ చెప్పింది. ఆ శిక్షలు– వంద చెప్పుదెబ్బలు తినడం, లేదా వంద ఉల్లిపాయలు తినడం. ఈ మూఢుడు మొదట వంద ఉల్లిపాయలు తిని శిక్షని అనుభవిస్తానని చెప్పాడు. కానీ పది తినేసరికే ఘాటుకు తట్టుకోలేకపోయాడు. మళ్లీ తూనాబోడ్డు, చెప్పుదెబ్బలే తింటానన్నాడు. పది దెబ్బలు పడేసరికి తట్టుకోలేక, లేదు లేదు ఉల్లిపాయలే తింటానన్నాడు. అలా, అవి కాదని ఇవి, ఇవి కాదని అవి – మొత్తానికి రెండు శిక్షలు అనుభవించాడు. 1977 తరువాత రక్షణ పరికరాల సేకరణలో భారత్ అనుసరించిన తీరుతెన్నులను చెప్పడానికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది. ఆ సంవత్సరాన్ని మైలురాయిగా తీసుకోవడం ఎందుకంటే, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినది అప్పుడే. అలాగే భారత్ సోవియెట్ రష్యా ఆయుధాలే కాకుండా ఇతర దేశాల ఆయుధాలు తీసుకోవడం మొదలుపెట్టినది కూడా అప్పుడే. జనతా ప్రభుత్వం అన్వేషించిన తొలి ఆయుధ వ్యవస్థ ఆంగ్లో–ఫ్రెంచ్ జాగ్వార్. కానీ, వైరి సంస్థల ఏజెంట్లు వార్తలు పుట్టించడంతో ముడుపులు చేతులు మారాయంటూ వెంటనే గోల మొదలయింది. అప్పుడే గ్రీన్ హౌస్ జర్నలిజం పుట్టుకొచ్చింది కూడా. రక్షణ కొనుగోళ్ల గురించి వార్తలు రాయడమే గ్రీన్హౌస్ జర్నలిజం. జాగ్వార్ కూడా వివాదాస్పదంగా మారింది. దాని శక్తి సామర్థ్యాలను గురించి మొదట్లో ఊహించిన స్థాయికి అది ఏనాడూ చేరలేదు. ఇలాంటి వ్యవస్థకు సంబంధించినంత వరకు శక్తిసామర్థ్యాలతో ఉన్న విమానం ఏదీ అని అడిగితే ఐఏఎఫ్ 100 – ప్లస్ జాగ్వార్ అనే సమాధానం. ఈ నాలుగు దశాబ్దాల తరువాత కూడా దీని ఘనతను ఇది నిలుపుకుంటూనే ఉంది. ఇందిర అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ సోవియెట్ రష్యా దగ్గర కొనుగోళ్లు ప్రారంభించారు. మళ్లీ రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చి సమీకరణలలో గణనీయంగా మార్పులు తెచ్చే వరకు ఇదే కొనసాగింది. ఈ విషయం ఇప్పుడు ఘనంగా చెప్పవలసినదేమీ కాదు. కానీ బొఫోర్స్ తరం ఆగ్రహానికి గురి కావలసి వస్తున్నా, నేను కచ్చితంగా చెప్పే వాస్తవం ఒకటి ఉంది. మన చరిత్రలో త్రివిధ దళాల ఆధునీకరణ ప్రయత్నమంటూ జరిగినది– ఇందిర–రాజీవ్‌ల హయాములలోనే. స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్ కేటాయిం పులు నాలుగు శాతానికి మించినది వారి పాలనా కాలంలోనే. మామూలుగా ఈ కేటాయింపు రెండు శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్నది నియమం. రాజీవ్ ఫ్రాన్స్ నుంచి మిరాజ్ –2000 విమానాలు, స్వీడన్ నుంచి బొఫోర్స్ శతఘ్నులు, మిలన్, మాట్రా (ఫ్రెంచ్)ల నుంచి క్షిపణులు, జర్మనీ నుంచి టైప్–209 తరహా జలాంతర్గాములను కొనుగోలు చేశారు. అయితే ప్రతి కొనుగోలు మీద ఏదో రూపంలో కుంభకోణం ఆరోపణ వచ్చింది. దీనితో ప్రతి ఆయుధ వ్యవస్థ కొనుగోలు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. వాస్తవానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలీ చేసుకోలేదు. ఇతర దేశాలతో కలసి ఉత్పత్తి సాగించలేదు. సంతృప్తికరమైన స్థాయి రక్షణ సామర్థ్యాన్ని గుర్తించే యత్నమే కనిపించదు. అయితే సోవియెట్ రష్యా నుంచి కూడా రాజీవ్ పెద్ద ఎత్తున రక్షణ కొనుగోళ్లు చేశారు. బీఎంపీ యుద్ధ వాహనాలు, కొత్త కిలో జలాంతర్గాములు, అణు జలాంతర్గామిని (మొదటి చక్ర) లీజుకు తీసుకున్నారు. వీటన్నిటికీ ఆయన చెల్లించిన మూల్యం, తాను అధికారం కోల్పోవడం. ఈ కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని నేను పందెం వేసి మరీ చెబుతాను. కుంభకోణాలున్నాయని కూడా అంటాను. కానీ ఈ చేదు నిజం ఉన్నప్పటికీ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు భారత్ కనుక యుద్ధానికి వెళితే, యుద్ధరంగంలో అధికంగా కనిపించే ఆయుధాలు ఇందిర, రాజీవ్ పాలనా కాలాలలో దిగుమతి చేసుకున్నవే అయి ఉంటాయి. లేదంటే పీవీ నరసింహారావు కాలంలో దిగుమతి చేసుకున్నవయినా అయి ఉంటాయనడం వాస్తవం. నిస్తేజంగా బీజేపీ హయాం ఇదొక నిష్టుర సత్యం. ఇది మనసులను గాయపరుస్తుంది కూడా. రక్షణ పరికరాల సేకరణలో బీజేపీ ప్రభుత్వం రికార్డు అత్యంత నిరాశాజనమైనది. యుద్ధ సమయంలో అత్యవసరంగా చేసినవి తప్ప, శవపేటికల కొనుగోళ్ల కుంభకోణం (ఇది పూర్తిగా ఊహాజనితమైనది) దెబ్బ తగిలిన వాజపేయి చేసిన కొనుగోళ్లు చాలా తక్కువ. మోదీ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ముందంజలో ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఇంతవరకు ఆయన ప్రభుత్వం దిగుమతి చేసుకోదలిచినవి 36 రాఫెల్స్ మాత్రమే. వీటి దిగుమతుల కోసం చర్చలు జరిగినది మాత్రం యూపీఏ హయాంలోనే. రక్షణ పరికరాల సేకరణ, లోపాల సవరణ వరకు పరిశీలిస్తే మూడున్నరేళ్ల మోదీ బ్యాలెన్స్ షీట్ ఖాళీగానే ఉండిపోయింది. మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ రక్షణమంత్రులుగా వచ్చినప్పటికీ రక్షణ కొనుగోళ్లు చేయడానికి వెనుకాడడం, దృష్టి పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. రాఫెల్ దిగుమతికి బీజేపీ ప్రభుత్వం సంతకాలు చేసిన ఒప్పందం కూడా ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఇది మోదీని అశాంతికి గురి చేయవచ్చు. నేను గాని, నా ప్రభుత్వం గాని ఎలాంటి తప్పు చేయలేదని (నేనుగాని, నా కుటుంబ సభ్యులు గాని ఎలాంటి తప్పు చేయలేదని రాజీవ్ చెప్పినట్టు కాకుండా) మోదీ ధైర్యంగా అనగలరా? సు–30 విమానాలు 20 ఏళ్ల క్రితానివి. అంటే భారత వైమానికి దళం ప్రాధాన్యం లేని శక్తిగా మారుతుంది. మిగిలిన రెండు దళాల విషయంలో కూడా ఆయన శ్రద్ధ చూపాలి. రాఫెల్ మీద జరుగుతున్న చర్చ కూడా పాత పంథాలోనే సాగుతోంది. ఇందులో మరీ హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానం బదలీ అన్నమాట. ఆరు దశాబ్దాలుగా, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇతర రక్షణకు చెందిన ప్రభుత్వరంగ సంస్థలు అనేక సాంకేతిక విజ్ఞాన బదలీలతో దిగుమతి చేసుకున్న వ్యవస్థలను ఒకచోట చేర్చి కూర్చాయి. అయినప్పటికీ ఒక్క హెలి కాప్టర్ని మినహాయిస్తే, ఈ సూక్ష్మబుద్ధితో కూడిన సాంకేతిక విజ్ఞాన బద లీలలో ఏ ఒక్కదాన్నయినా ఉపయోగించి మనకు ఉపయోగపడగల ఏ వ్యవస్థనూ ఇవి తయారు చేయలేకపోయాయి. ఉదాహరణకు, ఇన్ఫాంట్రీ రైఫిల్స్, భుజాన ఉంచుకుని కాల్పులు జరిపే లేదా మ్యాన్–ప్యాడ్ క్షిపణులు, పొరలుపొరలుగా ఉండే జాకెట్లు, ఇతర ప్రాధమిక సామగ్రి కొనుగోలు కోసం కోసం మనం ఇప్పటికీ ఆర్డర్ చేస్తున్నాం, రద్దు చేస్తున్నాం. బహుశా రాజీవ్ గాంధీ చేపట్టిన సాహసంతో కూడిన నిర్ణయాలను మోదీ చేపట్టి, 1980ల నాటి స్పర్థ కోసం రక్షణరంగ ఆధునీకరణను ప్రారంభించవచ్చు. లేదా బల గాల స్థాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, జీ జిన్‌పింగ్, జనరల్ క్వామర్ బజ్వాలను పిలిపించి, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ సమస్యను పరిష్కరించుకుని, మిగిలిన భారత్ రక్షణకోసం, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లాగా, అమెరికన్/ నాటోతో ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆవిధంగా జీడీపీలో 1 శాతానికి భారత రక్షణ రంగ బడ్జెట్‌ను పరిమితం చేయవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక్క శాతం కూడా ఎందుకు? ఎందుకంటే దేశం లోపలి మావోయిస్టులతో మీరు పోరాడాల్సి రావచ్చు. మరికొంత మొత్తాన్ని రిపబ్లిక్ డే పెరేడ్‌ల కోసం, సైనిక స్థావరాల్లో మంత్రులు తమ వారాంతపు ఫొటోలు దిగడానికి ఖర్చుపెట్టవలసి ఉండవచ్చు. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘రక్షణ’కు 2.46 లక్షల కోట్లు
-10.95% మేర పెరిగిన బడ్జెట్ న్యూఢిల్లీ: రక్షణ రంగానికి బడ్జెట్ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో (రూ.2.22 లక్షల కోట్లు) పోల్చుకుంటే కేటాయింపులు 10.95 శాతం మేరకు పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,46,727 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టడంతో కేటాయింపులు పెరిగాయి. గత ఏడాది బడ్జెట్లో వాస్తవానికి రూ.2.29 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ.. తర్వాత దానిని రూ.2,22,370 కోట్లకు సవరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చు (రూ.17,77,477.04 కోట్లు)లో రక్షణ బడ్జెట్ 13.88 శాతంగా ఉంది. అయితే రక్షణ రంగం కోసం చైనా చేస్తున్న ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువేనని చెప్పాలి. 2014-15లో చైనా అధికారికంగా ఈ రంగానికి వెచ్చించిన మొత్తం సుమారు రూ.8 లక్షల కోట్లు. అయితే మన మాతృభూమికి చెందిన ప్రతి అంగుళం భూమిని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ఇప్పటికే ఎఫ్‌డీఐని అనుమతించిన విషయం ప్రస్తావిస్తూ.. భారతీయ సంస్థలు రక్షణ పరికరాల ఉత్పత్తిదారులుగా మారేందుకు, కేవలం మనకోసమే కాకుండా ఎగుమతులకు కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఎయిర్ క్రాఫ్ట్‌లతో పాటు ఇతర రక్షణ పరికరాల తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందన్నారు. రక్షణ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాల్లో ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, వేగంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా కేటాయింపులు జరిపినట్లు జైట్లీ పేర్కొన్నారు. మొత్తం రక్షణ బడ్జెట్లో 38 శాతం అంటే రూ.94,588 కోట్లు మిలటరీ ఆధునీకరణ కోసం కేటాయించడం విశేషం. అయితే ఆధునీకరణ కోసం గత ఏడాది కోసం కేటాయించిన రూ.12,622 కోట్లు ఖర్చు చేయకపోవడం గమనార్హం. -
‘రక్షణ రంగ’ హబ్‌గా హైదరాబాద్
స్వావలంబనతోనే అభివృద్ధి సాధ్యం ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ సదస్సులో గవర్నర్ హైదరాబాద్: దేశ రక్షణ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని, ఉత్పత్తులను మనమే తయారు చేసుకోవడం ద్వారా దేశభద్రత, ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదం పడుతుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ‘దేశ రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన ’ అంశంపై ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అత్యంత కీలకమైన రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. దిగుమతుల ద్వారా ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతోందని, అంతే కాకుండా వివిధ దేశాలు వారి అవసరాల కోసం చేసుకున్న ఉత్పత్తులను మనం కొనాల్సి వస్తుందని అన్నారు. మన ఉత్పత్తులను మనమే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు మరింత సమర్థంగా రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షుడు షేకట్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ రంగంలో 100% ఎఫ్‌డీఐలకు ఓకే!
రక్షణ రంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రతిపాదిస్తూ వచ్చిన కేబినెట్ నోట్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి 26 శాతం మాత్రమే. యూపీఏ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ.. ఇలా రక్షణరంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మల్టీబ్రాండ్ రీటైల్లో ఎఫ్‌డీఐలను అనుమతించేది లేదని మొదటిరోజే చెప్పిన నిర్మల.. ఇప్పుడు రక్షణ రంగానికి మాత్రం ఆ సూత్రం వర్తింపజేయలేదు. -
పింఛను పేరిట యూపీఏ వంచన
ఓఆర్ఓపీ అమలుకు ఆర్థికమంత్రి రూ. 500 కోట్లు కేటాయించారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువయింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఆ రంగం నుంచి ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్న వారి సంఖ్య 25 లక్షలు. లోక్‌సభ గడువు పూర్తయిపోయింది. పార్లమెంటులో యూపీయే ప్రవేశపెట్టిన చాలా బిల్లుల సంగతి చూస్తే, ‘తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి!’ అన్న తీరులోనే ఉన్నాయి. తన్నుకు చావవలసి వస్తే మాత్రం ఆ బాధ్యత ఎన్డీఏదే. యూపీఏకు వచ్చే ఎన్నికలలో అవకాశాలు తక్కువని, ఎన్డీఏ ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. అందుకే బిల్లుల మీద బిల్లులు ప్రవేశపెట్టి, ఆ కీర్తిని యూపీఏ ఖాతాలో వేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రమించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సహా, చాలా బిల్లుల మీద ఇలాంటి హడావుడి ముద్ర సుస్పష్టం. అలాంటి బిల్లుల జాబితాలో చేరేదే భద్రతా దళాల కోసం ఉద్దేశించిన ‘ఒకే శ్రేణి, ఒకే పింఛను’. ‘ఒకే శ్రేణి, ఒకే పింఛను’(ఓఆర్ఓపీ) పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో చేర్చారు. ఇది త్రివిధ దళాల మాజీ ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సంబంధించినది. ఒకే శ్రేణితో, సేవల కాల పరిమితి ఒకటే అయిన సైనికులు ఉద్యోగ విరమణ చేసిన ట్టయితే వారికి ఒకే రకం పింఛను వర్తింపచేయడం ఈ బిల్లు ఉద్దేశం. ఇంకా సున్నితంగా చెప్పాలంటే, నిర్దిష్ట సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకీ, అదే శ్రేణికి చెంది, మరొక సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఒకే విధమైన పింఛను వర్తింపచేయడం దీని ఉద్దేశం. అంటే 1993లో ఉద్యోగ విరమణ చేసిన ఒక సిపాయికి, వేరే సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన మరో సిపాయీకి కూడా ఒకే స్థాయి పింఛను లభిస్తుంది. భారత మాజీ సైనికోద్యోగుల ఆందోళన సంఘం అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కడ్యాన్ మాటల్లో చెప్పాలంటే, ‘ఇంతవరకు ఎన్ని వేతన సంఘాలు వచ్చినా, ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెంచడమే తప్ప, మాజీ సైనికుల పింఛను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.’ దీనితో ఎప్పటి నుంచో వారి పింఛను గొర్రె తోక బెత్తెడు రీతిలో ఉండిపోయింది. నిజానికి చాలినంత పింఛను పొందడానికి నిర్దేశించినంత కాలం సైనిక దళాలలో ఉండే ఉద్యోగులు తక్కువే. 1983లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు పింఛను అనేది, ‘నష్ట పరిహారం కాదు, ఉద్యోగంలో ఉండగా చేసిన సేవకు ఇచ్చే పారితోషికం’. ఆ మేరకు ఓఆర్ఓపీ పథకాన్ని ప్రవేశపెట్టడం సబబే. దీని ప్రకారం పాత పింఛనుదారులకు కూడా పెరిగిన కొత్త పింఛనును వర్తింపచేస్తారు. 2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. 2014-15 బడ్జెట్లో రూ. 2,24,000 కోట్లు రక్షణ కేటాయింపులు చేశారు. ఇది 2013-14 బడ్జెట్లో రక్షణ అంచనాల కంటె పది శాతం ఎక్కువ. ఆ బడ్జెట్లో చేసిన కేటాయింపు రూ. 2,01,672 కోట్లు. గత బడ్జెట్లో రక్షణ రంగ పింఛన్లకు రూ. 45.000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో అది రూ. 50,000 కోట్లకు పెంచవలసి ఉంది. ఓఆర్ఓపీ అమలుకు ఆర్థికమంత్రి రూ.500 కోట్లు కేటాయించారు. మరిన్ని నిధులు అవసరమైతే, అవి రక్షణ మంత్రిత్వ శాఖకు జరిగిన కేటాయింపుల నుంచి సేకరించుకోవాలని కూడా ఆర్థికమంత్రి చెప్పేశారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువయింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఆ రంగం నుంచి ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్న వారి సంఖ్య 25 లక్షలు. ఓఆర్ఓపీ అమలుకు బీజేపీ సహా అన్ని కాంగ్రెసేతర పక్షాలు సుముఖంగానే ఉన్నాయి. ఈ విధానం కోసం ఐదేళ్లుగా మాజీ సైనికోద్యోగులు పట్టుబడుతున్నారు. యూపీఏ-2 పదవీకాలం మరో పదిహేనురోజులలో ముగుస్తుందనగా ఆదరాబాదరా ఈ పథకం అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కేవ లం కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ సైనికోద్యోగులతో భేటీ కావడంతో ఇది సాధ్యమైంది. అంతకంటె ముందు మాజీ సైనిక దళాల ప్రధాన అధిపతి జనరల్ వీకే సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కలిసి గడచిన సెప్టెంబర్ నాటి రేవారి (హర్యానా) సభలో పాల్గొన్నారు. అప్పుడే ఓఆర్ఓపీ అమలులో జరుగుతున్న జాప్యానికి వారు నిరసన వ్యక్తం చేశారు. కాబట్టే రాజకీయ కారణాలే బిల్లును పార్లమెంటుకు వెళ్లేలా చేశాయి. అయితే ఈ పథకానికి రూ. 1,730 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లు అవసరమని నిపుణుల అంచనా. కానీ కొద్ది మొత్తం పడేసి మేం ఉద్ధరించామన్న తీరులో కాంగ్రెస్ వ్యవహరించడం మాజీ సైనికులకు సంతోషానికి బదులు ఆగ్రహం తెప్పిస్తున్నది. 25 లక్షల మాజీ సైనికోద్యోగుల ఓట్లు, వారి కుటుంబాల ఓట్ల కోసమే రాహుల్ ఆదరాబాదరా బిల్లుకు బూజు దులిపించారన్న ఆరోపణ వినిపిస్తున్నది ఇందుకే. -గోపరాజు