తిరుపూర్ : కాంగ్రెస్ హయాంలో దేశ భద్రతను పూర్తిగా విస్మరించారని, రక్షణ రంగంలో అడుగడుగునా కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షంపై ధ్వజమెత్తారు. రక్షణ రంగంలో సముద్రం నుంచి ఆకాంశం వరకూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడే క్రమంలో సైనిక బలగాల ఆధునీకరణనూ విస్మరించిందని విమర్శించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పని సంస్కృతి గత ప్రభుత్వాల కంటే భిన్నమన్నారు. తిరుపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన వారు దేశ రక్షణ రంగం గురించి పట్టించుకోలేదన్నారు. ఈ రంగంలో కుంభకోణాల ద్వారా తమ సన్నిహితులకు లబ్ధి చేకూరడమే పరమావధిగా పనిచేశారని దుయ్యబట్టారు.
జాతీయ భద్రతకు, రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. తమిళనాడులో ఏర్పాటు చేయబోయే డిఫెన్స్ కారిడార్ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment