ర్యాపర్‌పై రూ.218 కోట్లకు దావా..! | Kanye West Sued for 30 Million Dollars in Damages Over Sunday Service Labor Practices | Sakshi
Sakshi News home page

ర్యాపర్‌పై రూ.218 కోట్లకు దావా..!

Published Sat, Jan 30 2021 5:51 PM | Last Updated on Sat, Jan 30 2021 8:25 PM

Kanye West Sued for 30 Million Dollars in Damages Over Sunday Service Labor Practices - Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్‌ ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌ని లీగల్‌‌ వివాదాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే విడాకులు తీసుకోవాలని భావించి కోర్టు మెట్లు ఎక్కిన కాన్యే వెస్ట్‌ తాజాగా తన సండే సర్విసెస్‌ నుంచి లీగల్‌ నోటీసులు అందుకున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే నేపంతో.. ఆయన మీద 30 మిలియన్‌ డాలర్లకు(దాదాపు 218 కోట్ల రూపాయలు) దావా వేశారు. సన్ అండ్ ది డైలీ మెయిల్ ప్రకారం, కాన్యే తన సండే సర్వీసెస్, ఇతర ప్రదర్శనలకు సంబంధించిన క్లాస్-యాక్షన్ సూట్లను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లో ఈ దావాలు దాఖలు చేశారు. ఇక వీటిలో వందలాది వర్కర్స్‌, స్టాఫ్‌ కాన్యే చెల్లింపులో చాలా ఆలస్యం చేస్తాడని, వాటిలో ఊహించని కోతలు, ఉద్యోగంలో దుర్వినియోగం వంటి వాటి గురించి వెల్లడించారు. ఇక కాన్యే మీద రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా.. మొదటిది 500 మంది వర్కర్స్‌ తరఫున దాఖలైంది. డైలీ మెయిల్ యూఎస్ ప్రకారం కాన్యే వెస్ట్‌ వారికి కనీసం భోజనం చేయడానికి సమయం ఇవ్వకుండా, విరామం లేకుండా రెండు రోజులు ఏకధాటిగా పని చేయించడాని ఆరోపించారు. 
(చదవండి: ‘విడాకులు తీసుకోబోతున్న స్టార్‌ కపుల్‌’)

దావా దాఖలు చేసిన వారిలో ఒకరైన మైఖేల్ పియర్సన్ మాట్లాడుతూ, ‘‘కాన్యే వెస్ట్‌ నిబంధనలకు మించి మాతో అధిక సమయం పని చేయించుకుంటారు. ఓవర్‌టైం పని చేసినా కేవలం 500 డాలర్ల మాత్రమే చెల్లిస్తారు’’ అని తెలిపాడు. అంతేకాక మిగతా వర్కర్స్‌ మాదిరిగానే నేను రోజంతా నిలబడి పని చేశాను. లంచ్‌, బాత్రూం బ్రేక్స్‌ కూడా తీసుకోనివ్వలేదు. ఇంత చేస్తే.. కనీసం ఇంటికి వెళ్లడానికి వెహికల్‌ కూడా ఏర్పాటు చేయలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అలానే కాన్యే వెస్ట్‌ 2019 ఒపెరా "నెబుచాడ్నెజ్జార్" ప్రదర్శనలో పని చేసిన వారు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఇక తాము కోల్పోయిన బ్రేక్‌ టైం, పని చేసిన ఓవర్‌ టైంకు సంబంధించి నష్ట పరిహారం పొందేందుకు గాను దావా దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాన్యే సండే సర్వీసులకు సంబంధించిన మరో దావాను టెక్ కంపెనీ మైచానెల్ ఇంక్ దాఖలు చేసినట్లు డైలీ మెయిల్ నివేదించింది. ఆ దావాలో వర్కర్స్‌ ఆరు నెలలుగా తమకు వేతనం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండు దావాల వల్ల కాన్యే సుమారు 30 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలి​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement