ఐఫోన్‌ వాడినందుకు రూ. 12 కోట్ల జరిమానా | Russia Samsung Brand Ambassador Sued For $1.6 Million For Using iPhone X | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 7:47 PM | Last Updated on Thu, Oct 25 2018 7:47 PM

Russia Samsung Brand Ambassador Sued For $1.6 Million For Using iPhone X - Sakshi

ఐఫోన్‌ను దాస్తున్న శాంసంగ్‌ బ్రాండ్‌అంబాసిడర్‌ క్సేనియా సోబ్‌చక్‌

మాస్కో : ఐ ఫోన్‌ వాడినందుకు ఓ రష్యన్‌ మహిళ దాదాపు 12 కోట్ల రూపాయల జరిమానా చెల్లించనున్నారు. అదేంటి ఆ దేశంలో ఐ ఫోన్‌ వాడకాన్ని నిషేధించారా ఏంటి.. ఎందుకు అంత జరిమానా అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే సదరు మహిళ శాంసంగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కాబట్టి. వివరాలు.. క్సేనియా సోబ్‌చక్‌ అనే మహిళ శాంసంగ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో క్సేనియా కొన్ని రోజుల క్రితం ఓ టీవి ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

ఈ సమయంలో క్సేనియా తన దగ్గర ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ఎక్స్‌ను కెమరా కంటికి చిక్కకుండా జాగ్రత్తగా పేపర్‌ కింద దాచే ప్రయత్న చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యి కెమరాకు చిక్కారు. ఈ విషయం కాస్తా శాంసంగ్‌ అధికారుల దృష్టికి చేరింది. దాంతో వారు క్సేనియా మీదా దావా వేశారు. మా కంపెనీ ఫోన్‌లకు ప్రచారకర్తగా ఉంటూ మా పోటీ కంపెనీ ఫోన్‌ వాడతావా అని చెప్పి శామ్‌సంగ్‌ కంపెనీ క్సేనియాను 1. 6 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల(రూ.11,71,76,480) జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement