పాంచ్కుల: రాఖీ పౌర్ణమి మరొక్క రోజులో ఉందనగా.. ఉత్తరప్రదేశ్లోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంటి యజమాని తన భార్యను, ముగ్గురు కూతుళ్లను హత్య చేసి.. ఆపై తానూ ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ చుట్టుపక్కల విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని ఉన్నావో జిల్లాలో నీరజ్ అనే 30 ఏళ్ల వ్యక్తి ముందుగా తన భార్య రాజ్ కుమారిని (27) గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తన ముగ్గురు కూతుళ్లు నవిత(5), శివాని(2), అనన్య(7 నెలలు)లను కూడా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కుటుంబంలో మనస్ఫర్ధలే ఈ ఘటనకు దారి తీసి ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
కుటుంబాన్ని చంపి తాను ఉరేసుకుని..
Published Fri, Aug 28 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM
Advertisement
Advertisement