తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే.. | Drunk Man Assassinated Friend Over Family Rivalry Hosur | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే..

Published Mon, Apr 4 2022 3:21 PM | Last Updated on Mon, Apr 4 2022 3:29 PM

Drunk Man Assassinated Friend Over Family Rivalry Hosur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హోసూరు(బెంగళూరు): హోసూరులో గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతుడు హోసూరు సీతారామ్‌దిన్న కాలేకుంట ప్రాంతానికి చెందిన యారబ్‌. కొన్ని సంవత్సరాల క్రితం శ్యానసంద్రంకి చెందిన సంతోష్‌ (20) సోదరి అశ్వినిని అదే ప్రాంతానికి చెందిన అవాస్‌ఖాన్‌ ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్లకు హత్య చేసి జైలుకెళ్లాడు. గత శుక్రవారం రాత్రి సంతోష్‌తో కలిసి మద్యం తాగుతూ యారబ్‌ మీ అక్క అశ్వినిని హత్య చేసేందుకు తాను సహకరించానని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన సంతోష్‌ యారబ్‌ మైకం నుంచి తేరుకునే లోపు ఆ పరిసరాల్లోని బండరాతితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్‌ను పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మరో ఘటనలో..
సైబర్‌ మోసగాడు అరెస్టు
హోసూరు:
ఈ–మెయిల్‌ని హ్యాక్‌ చేసి ఎలక్ట్రికల్‌ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్‌  చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోసూరుకు దినేష్‌కుమార్‌ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ  గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్‌ ఐడిని హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్‌ (24) అనే యువకున్ని అరెస్ట్‌ చేశారు.

చదవండి: చదువు కోసం మేకలు అమ్మి ఫోన్‌ కొనిచ్చిన తల్లి! ఆ కొడుకేమో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement