Hosuru
-
Valentine's Day: ప్రేమికులు మెచ్చిన హోసూరు గులాబీ
సాక్షి, బెంగళూరు: ఫిబ్రవరి 14వ ప్రేమికుల దినోత్సవం వస్తోందంటే హోసూరు గులాబీలకు రెక్కలు వస్తాయి. ప్రపంచం నలుమూలలకూ ఎగుమతి అవుతాయి. ప్రియుడు ప్రేమను చాటుకోవడానికి గులాబీల పువ్వులే సాయపడతాయి. ఈసారి 20 లక్షల గులాబీ పూలకు ఆర్డర్లు వచ్చాయి. హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతంలో గులాబీ, ఇతర పుష్పాల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో పెద్దఎత్తున రైతులు గ్రీన్షెడ్లు ఏర్పాటు చేసి జరబరా, రోజా, కార్నేషన్ తదితర పూలతోటలను పెంచుతున్నారు. విదేశాలకు ఎగుమతులు వాలెంటైన్స్ డే కి హోసూరు ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం ఆ్రస్టేలియా, దుబాయ్, ఇంగ్లాండ్, సింగపూర్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని 20 లక్షలకుగా తాజ్‌మహల్ రకం గులాబీలను ఎగుమతి చేపట్టారు. ఒక్కో పువ్వు ధర రూ. 20 నుంచి రూ. 22 దాకా పలుకుతుందని వ్యాపారులు, రైతులు తెలిపారు. స్థానిక మార్కెట్లో రూ. 14 నుంచి రూ. 18 వరకు అమ్ముతారు. మంచి ధరలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ మొక్కలకు సైతం ప్రేమికుల రోజు ఒక్క రోజా పూవు అందజేస్తే రెండో రోజుకు ఎండిపోతుందని, ప్రేమ నిలకడగా ఉండాలని ఆశిస్తూ కొంత మంది ప్రేమికులు తమ ప్రేయసికి గులాబీ మొక్కలను అందజేయడం మొదలైంది. గులాబీ మొక్కల పెంపకానికి ప్రసిద్ది పొందిన అగళకోట ప్రాంతంలోని నర్సరీలలో రోజా మొక్కలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నర్సరీలలో రోజా మొక్కలకు ముందే ఆర్డర్లు ఇవ్వడంతో మిగతావారికి దొరకడం కష్టంగా ఉంది. -
నోట్లో గుండుసూది వేసుకుని పొరపాటున మింగేసిన విద్యార్థి
సాక్షి, బెంగళూరు: ఓ విద్యార్థి నోటిలో గుండుసూది వేసుకుని పొరపాటును మింగేశాడు. హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన ఆనందన్, ధనలక్ష్మి దంపతుల కొడుకు యల్లేష్ (12). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తరగతి గదిలో గుండుసూదిని నోట్లో ఉంచుకొని అకస్మాత్తుగా మింగేశాడు. భయపడిన యల్లేష్ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు వెంటనే హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ చేయగా గుండుసూది కడుపులో ఉన్నట్లు తేలింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. చదవండి: Maharashtra: రాయ్‌గఢ్‌లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా -
రియల్ చార్లీ777.. షో అదిరింది!
హోసూరు(బెంగళూరు): జిల్లా కేంద్రం క్రిష్ణగిరి ప్రభుత్వ బాలుర ఉన్నతోన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న 28వ అఖిల భారత మామిడి ప్రదర్శనలో ఆదివారం ఏర్పాటు చేసిన డాగ్‌షో అందరినీ అలరింపజేసింది. కార్యక్రమానికి ఆర్డీవో సతీష్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఆదివారం పశుసంవర్థక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన డాగ్‌షోలో గోల్డెన్‌రెడ్ రైవర్, జర్మన్ షపర్డ్, ల్యాబ్రడార్, రాట్‌వీలర్, టంపర్‌మేన్, టేక్‌శాండ్, క్రోటేన్, రాజపాళ్యం, కన్ని, సిప్పిపారై, కర్కార్, స్పోనియల్ తదితర 21 జాతులకు చెందిన 200కుపైగా శునకాలు పాల్గొన్నాయి. ప్రదర్శనకు తీసుకొచ్చిన శునకాలచే విన్యాసాలు చేయించారు. ప్రధానంగా పోలీసు శాఖ తీసుకొచ్చిన శునకాలచే సాహస కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా విన్యాసాల్లో పాల్గొని గెలుపొందిన కుక్కలకు బహుమతులందజేశారు. పశుసంవర్థక శాఖ మండల ఉపడైరెక్టర్ రాజేంద్రన్, డెప్యూటీ డైరెక్టర్ మరియ సుందర్, అరుళ్‌రాజ్, కలైయరసు, పీఆర్వో మోహన్, పశుసంవర్థక శాఖ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే..
హోసూరు(బెంగళూరు): హోసూరులో గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతుడు హోసూరు సీతారామ్‌దిన్న కాలేకుంట ప్రాంతానికి చెందిన యారబ్. కొన్ని సంవత్సరాల క్రితం శ్యానసంద్రంకి చెందిన సంతోష్ (20) సోదరి అశ్వినిని అదే ప్రాంతానికి చెందిన అవాస్‌ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్లకు హత్య చేసి జైలుకెళ్లాడు. గత శుక్రవారం రాత్రి సంతోష్‌తో కలిసి మద్యం తాగుతూ యారబ్ మీ అక్క అశ్వినిని హత్య చేసేందుకు తాను సహకరించానని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన సంతోష్ యారబ్ మైకం నుంచి తేరుకునే లోపు ఆ పరిసరాల్లోని బండరాతితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్‌ను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరో ఘటనలో.. సైబర్ మోసగాడు అరెస్టు హోసూరు: ఈ–మెయిల్‌ని హ్యాక్ చేసి ఎలక్ట్రికల్ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్ చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరుకు దినేష్‌కుమార్ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్ (24) అనే యువకున్ని అరెస్ట్ చేశారు. చదవండి: చదువు కోసం మేకలు అమ్మి ఫోన్ కొనిచ్చిన తల్లి! ఆ కొడుకేమో.. -
టాక్సీ డ్రైవర్‌తో డాక్టర్ ప్రేమవివాహం.. నిజం తెలిసి..
హోసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలిసి మహిళా డాక్టర్ మిద్దె మీద నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. మత్తిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కడలూరు జిల్లా బన్రుట్టి ప్రాంతానికి చెందిన నందిని (24) హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయుర్వేద విభాగంలో డాక్టర్‌గా పనిచేస్తోంది. ధర్మపురికి చెందిన మునియప్ప (29) హోసూరు సమీపంలోని కురుబట్టిలో ఉంటూ కాల్ టాక్సీ నడిపేవాడు. ఇతనితో నందినికి పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఇరువురూ మత్తిగిరి దగ్గర నివాసముంటున్నారు. మునియప్పకు గతంలోనే పెళ్లయిందనే సంగతిని నందినికి తెలియడంతో తరచూ కాపురంలో గొడవలేర్పడుతుండేది. చదవండి: (జిమ్ చేస్తూనే కుప్పకూలిపోయిన మహిళ.. వీడియో వైరల్) గత మూడు రోజుల క్రితం ఏర్పడిన గొడవల్లో ఇరువురూ నిద్ర మాత్రలు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాయం నుంచి బయటపడి ఇల్లు చేరుకొన్న వీరికి శుక్రవారం రాత్రి మళ్లీ గొడవలేర్పడింది. దీనితో జీవితంపై విరక్తి చెందిన నందిని మిద్దెపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలైన చనిపోయింది. మత్తిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రసవం కోసం భార్య పుట్టింటికి.. భర్త తల నరికి గుడి ముందు ఉంచి..
హోసూరు: పెయింటర్ తలను నరికి మారియమ్మ ఆలయం ముందు ఉంచిన ఘటన కలకలం రేపింది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కొడుకు ప్రదీప్ (25). ఇతనికి చంద్రిక అనే యువతితో పెళ్లయింది, ఇద్దరు పిల్లలున్నారు. ప్రసవం కోసం భార్య పుట్టింటికెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రదీప్ తలను నరికి అదే ప్రాంతంలోని మారియమ్మ ఆలయం ముందు ఉంచి వెళ్లారు. బాగలూరు పోలీసులు పరిశీలించగా దేహం కొంచెం దూరంలో కనిపించింది. ఎస్పీ సాయ్‌చరణ్ తేజస్వి, హోసూరు డీఎస్పీ శివలింగం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన బంధువులు సంతోష్, మురళితో ప్రదీప్‌కు గత 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని, వారే హత్య చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
పెద్దకూతురి ప్రేమ; పరువు పోయిందని కొడుకుతో కలిసి ఆత్మహత్య
హోసూరు: ఓ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఆమె తల్లీ, సోదరున్ని బలితీసుకుంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని మిండగిరి గ్రామానికి చెందిన మహాలింగం (51) బెంగళూరులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య హంసవేణి (45), కూతుళ్లు ప్రియ (19), త్రిష (17), కొడుకు విష్ణు (13) ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియకు పెళ్లి సంబంధం ఖరారు చేశారు. ఈ విషయం తట్టుకోలేని ఆమె ప్రియుడు తిరుపతి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ప్రియ కూడా పురుగుల మందు తాగింది. ఈ సంఘటనలతో పరువు పోయిందని బాధపడిన ఆమె తల్లి హంసవేణి, మరో కూతురు త్రిష, కొడుకు విష్ణులు ఆత్మహత్య చేసుకోవాలని ఆదివారం రాత్రి తమ పొలంలోని బావిలో దూకారు. త్రిషకు ఈత రావడంతో ఈదుతూ బయట పడగా, హంసవేణి, విష్ణు నీట మునిగి మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసిన తిరుపతి, ప్రియలు వేర్వేరు ఆస్పత్రుల్లో కోలుకుంటుండడం గమనార్హం. ఇద్దరు వంచకుల అరెస్టు మైసూరు: మండ్యకు చెందిన సౌమ్య (29), చామరాజనగరకు చెందిన ప్రసాద్(30) అనే ఇద్దరిని మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ బంగారం వేరొకరి వద్ద కుదువలో ఉందని, మీరు డబ్బులిస్తే విడిపించి మీకే అమ్ముతామని సురేష్‌ను నమ్మించి రూ.1.75 లక్షలను తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మొబైల్ఫోన్లను స్విచ్చాఫ్ చేయడంతో బాధితుడు సాలిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి ఇద్దరినీ అరెస్టుచేశారు. -
లవర్‌పై యువకుడి బ్లేడుతో దాడి
క్రిష్ణగిరి: విబేధాల కారణంగా యువతిపై దాడి చేసిన వ్యక్తిని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు సమీపంలోని బేరికె అన్నానగర్‌కు చెందిన లావణ్య (19), అదే ప్రాంతానికి చెందిన బంధువు శివకుమార్ (29) మధ్య విభేదాలు ఉన్నా యి. బుధవారం శివకుమార్ లావణ్యపై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ప్రియుడితో సన్నిహితంగా ఉన్న భార్యను..
హోసూరు: వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టిన భార్యను, ఓ భర్త బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని హోసూరు తాలూకాలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామంలో చెన్నబసప్ప(44), గౌరమ్మ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. గౌరమ్మకు పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటంతో మందలించినా ఆమె పట్టించుకోలేదు. గురువారం రాత్రి ఆమె ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చెన్నబసప్ప కంట పడింది. దీంతో భార్యను కడతేర్చాలని పథకం రచించాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను వేపనపల్లి సమీపంలోని కే.ఎన్.పోడూరుబసవేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి తలపై బండరాయితో బాది హత్య చేశాడు. శుక్రవారం ఉదయం హోసూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సమాచారం అందుకున్న వేపనపల్లి పోలీసులు గౌరమ్మ మృతదేహాన్ని శవపరీక్ష కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య -
అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య
హోసూరు: ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన కొత్త కోడలు అత్తతో గొడవలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హోసూరు పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హోసూరు– తళి రోడ్డులోని అప్పావు నగర్‌కు చెందిన ముత్తు భార్య దేవయాని (25). 8 నెలల క్రితమే వీరికి పెళ్లి జరిగింది. అత్తా కోడళ్ల మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. బుధవారం రాత్రి కూడా రగడ పడడంతో దేవయాని ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. హోసూరు డీఎస్పీ మురళి కేసు విచారణ చేపట్టారు. తల్లి మందలించడంతో బాలుడు.. మత్తిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేళగొండపల్లికి చెందిన ప్రజాపతి కొడుకు రితీష్‌కుమార్ (16) 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి బయటకెళ్లి ఇంటికి ఆలస్యంగా వెళ్లాడు. దీంతో తల్లి నిలదీయడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పూనపల్లి సమీపంలోని రోడ్డు పక్కన చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 8వ తరగతికే మద్యానికి బానిసై 8వ తరగతికే మద్యం తాగుతున్న కొడుకును తల్లితండ్రులు మందలించడంతో ప్రాణాలు తీసుకున్నాడు. హోసూరు సున్నపువీధికి చెందిన వాసు కొడుకు కుమార్ (13) 8వ తరగతి విద్యార్థి. ఏం జరిగిందో కానీ మద్యపానానికి అలవాటు పడ్డాడు. ఈ అలవాటు మానుకుని బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు అతనిని మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. -
నవ వరుడి విషాదాంతం
హోసూరు/కర్ణాటక: అతనికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఇంకా అచ్చటా ముచ్చట తీరలేదు. అంతలోనే విధి బలి తీసుకుంది. ఈ విషాద ఘటన మత్తిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు సమీపంలోని బేళగొండపల్లి గ్రామానికి చెందిన గురురాజ్(24)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. గురువారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఆరవేస్తూ విద్యుత్తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మత్తిగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. క్రిష్ణగిరి: క్రిష్ణగిరి పాతపేటకు చెందిన సూర్య(24) అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన సూర్య.. గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. వృద్ధుడి మృతదేహం స్వాధీనం క్రిష్ణగిరి: కే.ఆర్.పీ డ్యాం సమీపంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకొని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడు ఏ ప్రాంతవాసి అనేది తెలియలేదని, వివరాలు తెలిసిన వారు తమ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. చదవండి: కరెంట్‌షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స ఇలా... -
ముత్తూట్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.7 కోట్లు చోరి
హోసూరు: బెంగళూరు సమీపం లోని తమిళనాడు పట్టణం హో సూరులో భారీ బంగారం దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చొరబడి రూ.7 కోట్ల విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. విషయం తెలిసి హోసూరు డీఎస్పీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్ తెలిపారు. పట్టపగలే భారీ దోపిడీ జరగడం తీవ్ర కలకలం సృష్టించింది -
టిక్‌టాక్.. తీసింది ప్రాణం!
హోసూరు: టిక్‌టాక్‌లో పేరుపొందాలనే తపనతో వినూత్నంగా విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణంతో ఉన్న చేపను మింగిన యువకుడు ఊపిరాడక చనిపోయిన సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం హోసూరులో చోటు చేసుకొంది. హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ కొడుకు వెట్రివేల్(22) డిగ్రీ విద్యార్థి. టిక్‌టాక్‌లో ప్రదర్శన కోసం ప్రాణంతో ఉన్న చేపను మింగాడు. అది గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక గిలగిల్లాడుతున్న వెట్రివేల్‌ను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఉల్లితో లాభాల మూట..
సాక్షి, పత్తికొండ: కష్టానికి తోడు అదృష్టం ఉండాలే కాని కరువు నేలలో కూడా సిరులు పండించవచ్చునని చాటి చెప్పారు హోసూరు రైతులు. ఇప్పటికే బోరు బావుల కింద ఆకు కూరుల సాగు చేస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రైతులు.. ఈ ఏడాది ఉల్లిలో కూడా వారికి కలిసివచ్చింది. సాధారణంగా మెట్టభూముల్లో వర్షాధారంపై శనగ, జొన్న, వాము, పత్తి తదితర సంప్రదాయక పంటలు మాత్రమే సాగు చేస్తారు. అయితే హోసూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ ఏడాది వినూత్నంగా ఆలోచించారు. వర్షాధారం కింద మెట్టభూముల్లో ఉల్లి పంటను సాగుచేసి లాభాలు మూట గట్టుకున్నారు. పత్తికొండ వ్యవసాయ సబ్ డివిజన్లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో బోరుబావుల కింద రైతులు 9,040 ఎకరాల్లో ఉల్లిని సాగుచేశారు. ఇదే సమయంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దాదాపు 120మంది రైతులు 500 ఎకరాల్లో మెట్ట భూముల్లో ఉల్లి వేశారు. సకాలంలో వర్షాలు కురవడంతో వారి పంట పండింది. కొందరు రైతలు సమీప కాల్వల్లో, వంకల్లో నీటిని సద్వినియోగం చేసుకున్నారు. ఎకరాకు 100 నుంచి 200 ప్యాకెట్ల వరకు దిగుబడి సాధించారు. ఇదే సమయంలో ఈ సారి ధర ఉల్లి రైతును సంతోషంలో ముంచెత్తింది. దీంతో క్వింటాల్‌కు కనిష్టంగా రూ.5వేలు నుంచి గరిష్టంగా రూ.12వేల వరకు ధర లభించింది. హోసూరు గ్రామంలో ఉల్లి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కనీసం రూ.5 కోట్లు వచ్చాయి. ఏటా పెట్టుబడి కూడా చేతికందని పంట ఈ సారి కాసులు కురిపించింది. ఎన్నడూ చూడని లాభాలు చూశారు. మార్కెట్లో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను చూసి ఇపుడు రబీ సీజన్లోనూ పెద్ద ఎత్తున రైతులు ఇదే పంటను సాగు చేస్తున్నారు. గట్టెక్కించింది.. పట్టువదలని విక్రమార్కుల్లా సాగు చేసిన ఉల్లి రైతుల పంట పండింది. సాధారణంగా ఎకరాకు పెట్టుబడి కనీసం రూ.30 వేలు నుంచి రూ.60 వేలు అవుతోంది. మార్కెట్లో మంచి ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతోంది. లేకపోతే అప్పులపాలే. గత ఏడాది క్వింటాల్ ఉల్లి రూ. 200 నుంచి రూ. 300 దాటలేదు. ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఉల్లికి డిమాండ్ రాడంతో మార్కెట్లో ధర ఎన్నడూ లేని విధంగా రికార్డులు బ్రేక్ అయ్యాయి. క్వింటాల్ ఉల్లి ధర రూ.3 వేల నుంచి పెరుగుతూ ఒక దశలో రూ.15 వేలు దాటింది. ప్రస్తుతం రూ. 8వేలు నుంచి రూ. 10వేలుకు పైగా పలుకుతోంది. ఇప్పుడు వచ్చిన లాభాలతో గతంలో చేసిన అప్పుల నుంచి గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. ఉల్లి.. వారికి సిరుల తల్లిగా మారింది. రూ. 8 లక్షలు మిగిలాయి నాలుగు ఎకరాల్లో ఉల్లిపంట వేశా. క్వింటంరూ.6800 ధర వచ్చింది. రూ. 10 లక్షలు వచ్చాయి. పెట్టుబడి పోను రూ. 8 లక్షలు మిగిలాయి. గత నాలుగేళ్లుగా చేసిన అప్పులు తీర్చేస్తాను. భూమి కరుణిస్తే వ్యవసాయాన్ని మించినది ఏదీ లేదు. ఏటా ఇలాగే పంటలు పండితే అందరూ సేద్యం చేస్తారు. – భైరపు పరశురాముడు ఈ ఏడాది బాగుంది నేను 6 ఎకరాలను రూ. 50 వేలకు గుత్తకు తీసుకుని ఉల్లిపంట వేశా. గడ్డ సైజు బాగానే ఉంది. ఇంకో వారం రోజుల్లో పంట కోస్తాం. కనీసం 400 ప్యాకెట్లు దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. మార్కెట్లో మంచి ధర ఉండటంతో పెట్టుబడి ఖర్చులు పోయినా గిట్టుబాటు అవుతుందనే ఆశతో ఉన్నాం. – కొత్తకాపు రంగారెడ్డి -
ఫేస్బుక్ ప్రియునితో కలిసి కాబోయే భర్తను..
హొసూరు : కాబోయే భార్యను చూడడానికి వెళ్తే అతన్ని చంపడానికి యత్నించిన కేసులో మిస్టరీ వీడింది. అమ్మాయి జాన్సీరాణి జూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె ఫేస్బుక్ ప్రియుడు, అతని అనుచరులతో కలిసి దాడి చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని జాన్సీరాణిని అరెస్టు చేసి, ప్రియుడు, అనుచరుల కోసం తిరుచ్చికి బయలుదేరారు. ఊత్తంగేరి సమీపంలోని గొల్లనూరు గ్రామానికి చెందిన చిన్నకణ్ణన్ కొడుకు శరవణన్ (27) ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బంధువులైన చెన్నప్పనాయకనూరు గ్రామానికి చెందిన జాన్సీరాణితో పెళ్లి నిశ్చయించారు. గత ఆదివారం అమ్మాయిని చూసేందుకెళ్లిన శరవణన్‌కు ఆమె జూస్‌లో మత్తుమంది ఇచ్చి ఇచ్చి ఏకాంతంగా మాట్లాడాలని తీసుకెళ్లి ఫేస్బుక్ ప్రియుడు తిరుచ్చికి చెందిన కార్తీక్ (32)తో పాటు అతడి అనుచరులతో కలిసి దాడి చేయించింది. రోడ్డుపక్కన శరవణన్ తీవ్ర గాయాలతో రక్తం కారుతూ స్థానికుల కంటబడగా, స్థానికులు ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి జాన్సీరాణిని అరెస్టు చేశారు. -
పెళ్లి చేసుకొంటానని నమ్మించి..
హొసూరు: పెళ్లి చేసుకొంటానని నమ్మించి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ సైనికునితో పాటు ఐదు మందిపై క్రిష్ణగిరి మహిళా పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. వివరాల మేరకు.. క్రిష్ణగిరి సమీపంలోని పూవత్తి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే ప్రాంతంలోని ప్రైవేట్ కళాశాలలో బిఎస్సీ రెండవ ఏడాది చదువుతోంది. ఆలంబాడి గ్రామానికి చెందిన గాంధీ (25) సైనికోద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో విద్యార్థినితో గాంధీకి పరిచయమేర్పడి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. గతేడాది డిసెంబర్ నుంచి యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. పలుమార్లు అఘాయిత్యం ఈ సమయంలో పెళ్లి చేసుకొంటానని ఆశచూపి పలు సార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని పెళ్లి చేసుకుందామని కోరగా, గాంధీ నిరాకరించడంతో మోసపోయినట్లు గ్రహించింది. న్యాయం చేయాలంటూ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో గాంధీ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకొంటానని ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డాడని, అదే ప్రాంతానికి చెందిన సుమతి, మునియమ్మ, మురుగన్, మునిరాజ్‌లు అతనికి సహకరించారని పేర్కొంది. పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. క్రిష్ణగిరి జక్కప్పనగర్‌లోని ప్రభుత్వ పోలీస్ గృహవసతి కాలనీలో నివసిస్తున్న గాంధిమతి క్రిష్ణగిరి మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, పట్టణ పోలీసులు కణ్ణన్, సెల్వరాజ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ శవాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకొందా? లేక వేరే కారణాలున్నాయా? అని విచారణ జరుపుతున్నారు. -
తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య
సిప్కాట్: తండ్రి మందలించాడని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం హోసూరు సమీపంలోని మత్తిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. మత్తిగిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని కళుకొండపల్లి గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు ప్రసాద్(24). ఇంజనీరింగ్ వరకు చదువుకొని ఉద్యోగానికి వెళ్లక ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం ఏదైన కంపెనీకి వెళ్లి, ఉద్యోగం వెతుక్కోమని తండ్రి లింగప్ప, ప్రసాద్‌కు సూచించాడు. ప్రసాద్ తండ్రి మాటను పట్టించుకోక పోవడంతో లింగప్ప అతనిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మత్తిగిరి పోలీసులకు సమాచారమందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరచుకొని హŸసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
వికలాంగురాలిపై మేనమామ అత్యాచారం
హోసూరు (కర్ణాటక) : వికలాంగురాలైన మేనకోడలిని బెదిరించి ఆరు మాసాలుగా అత్యాచారం చేస్తున్న మేనమామ కిరాతకం ఆలస్యంగా మంగళవారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం హోసూరు పట్టణం డెంకణీకోట తాలూక అంచెట్టి సమీపంలోని ఏ.పుదూరు గ్రామానికి చెందిన ఓ రైతుకు వికలాంగురాలైన కూతురు(17) ఉంది. గేరెట్టి గ్రామానికి చెందిన అమావాసి(40) ఆ అమ్మాయికి మేనమామ. కాగా ఆమెను బెదిరించి ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల కూతురి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షించగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో వారు విషయం తెలుసుకుని డెంకణీకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అమావాసి కోసం గాలిస్తున్నారు.