ప్రతీకాత్మక చిత్రం
హోసూరు: బెంగళూరు సమీపం లోని తమిళనాడు పట్టణం హో సూరులో భారీ బంగారం దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చొరబడి రూ.7 కోట్ల విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. విషయం తెలిసి హోసూరు డీఎస్పీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్ తెలిపారు. పట్టపగలే భారీ దోపిడీ జరగడం తీవ్ర కలకలం సృష్టించింది
Comments
Please login to add a commentAdd a comment