
గుండుసూదిని మింగిన బాలుడు యల్లేష్, స్కానింగ్‌లో బయటపడిన గుండుసూది
సాక్షి, బెంగళూరు: ఓ విద్యార్థి నోటిలో గుండుసూది వేసుకుని పొరపాటును మింగేశాడు. హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన ఆనందన్, ధనలక్ష్మి దంపతుల కొడుకు యల్లేష్ (12). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తరగతి గదిలో గుండుసూదిని నోట్లో ఉంచుకొని అకస్మాత్తుగా మింగేశాడు.
భయపడిన యల్లేష్ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు వెంటనే హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ చేయగా గుండుసూది కడుపులో ఉన్నట్లు తేలింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
చదవండి: Maharashtra: రాయ్‌గఢ్‌లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా