hosur bangalore
-
టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్‌ను 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
నోట్లో గుండుసూది వేసుకుని పొరపాటున మింగేసిన విద్యార్థి
సాక్షి, బెంగళూరు: ఓ విద్యార్థి నోటిలో గుండుసూది వేసుకుని పొరపాటును మింగేశాడు. హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన ఆనందన్, ధనలక్ష్మి దంపతుల కొడుకు యల్లేష్ (12). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తరగతి గదిలో గుండుసూదిని నోట్లో ఉంచుకొని అకస్మాత్తుగా మింగేశాడు. భయపడిన యల్లేష్ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు వెంటనే హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ చేయగా గుండుసూది కడుపులో ఉన్నట్లు తేలింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. చదవండి: Maharashtra: రాయ్‌గఢ్‌లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా -
టు లెట్
ఒక అడుగుకు అద్దె రూ. 80! హొసూరు- బాగలూరు రోడ్డులో మొదటి అంతస్తులో ఒక చదరపుటడుగుకు నెలకు రూ.80 నుంచి రూ.90 వరకు అద్దె నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, తాలూకాఫీసు రోడ్డు, గాంధీరోడ్డు, నేతాజీ రోడ్డు ప్రధాన ంగా వ్యాపార కూడళ్లు తదితర ప్రాంతాలలో కూడా టులెట్ బోర్డులు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. హొసూరు పట్టణంలో ఏఆర్ఆర్ఎస్, చెన్నైసిల్క్స్ వంటి పెద్దపెద్ద వస్త్ర వ్యాపార షోరూంలు ఏర్పాటు కావడంతో చిన్న, మధ్య తరగతి వస్త్ర దుకాణాల వ్యాపారం దెబ్బతింది. హొసూరు పట్టణంలో జోయ్లుక్కాస్, నాదేళ్ల, ఏవీఆర్, మలబార్, జువల్వన్, శ్రీకుమరన్, ఏవిఆర్ స్వర్ణమహాల్, తనిష్కా, జీఆర్టీ వంటి బంగారు నగల షోరూంలు వెలియడంతో చిన్నచిన్న దుకాణాలలో బంగారం వ్యాపారం తగ్గిపోయింది. కంపెనీల మూతతో ఇక్కట్లు పారిశ్రామిక ప్రాంతంలో అనేక చిన్న, పెద్ద కంపెనీలు మూతపడడంతో ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. వైద్యరంగంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు గుణం, అశోక, చంద్రశేఖర్ వంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడంతో చిన్నచిన్న క్లినిక్‌లు, మధ్య తరగతి ఆస్పత్రులలో రోగుల సంఖ్య తగ్గిపోయింది. హొసూరు మున్సిపాలిటీలో సరైన రోడ్లు, ప్రాథమిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో పట్టణంలో వ్యాపారం సన్నగిల్లింది. దీంతో అద్దె భవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భవననిర్మాణానికి వెచ్చించిన డబ్బుకు బ్యాంకు రుణం చెల్లించలేకపోతున్నామని భవనాల యజమానులు లబోదిబోమంటున్నారు. ఆరు నెల లుగా హొసూరులో వాణిజ్యం పడిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.