ఒక అడుగుకు అద్దె రూ. 80!
హొసూరు- బాగలూరు రోడ్డులో మొదటి అంతస్తులో ఒక చదరపుటడుగుకు నెలకు రూ.80 నుంచి రూ.90 వరకు అద్దె నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, తాలూకాఫీసు రోడ్డు, గాంధీరోడ్డు, నేతాజీ రోడ్డు ప్రధాన ంగా వ్యాపార కూడళ్లు తదితర ప్రాంతాలలో కూడా టులెట్ బోర్డులు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. హొసూరు పట్టణంలో ఏఆర్‌ఆర్‌ఎస్, చెన్నైసిల్క్స్ వంటి పెద్దపెద్ద వస్త్ర వ్యాపార షోరూంలు ఏర్పాటు కావడంతో చిన్న, మధ్య తరగతి వస్త్ర దుకాణాల వ్యాపారం దెబ్బతింది. హొసూరు పట్టణంలో జోయ్‌లుక్కాస్, నాదేళ్ల, ఏవీఆర్, మలబార్, జువల్‌వన్, శ్రీకుమరన్, ఏవిఆర్ స్వర్ణమహాల్, తనిష్కా, జీఆర్‌టీ వంటి బంగారు నగల షోరూంలు వెలియడంతో చిన్నచిన్న దుకాణాలలో బంగారం వ్యాపారం తగ్గిపోయింది.
కంపెనీల మూతతో ఇక్కట్లు
పారిశ్రామిక ప్రాంతంలో అనేక చిన్న, పెద్ద కంపెనీలు మూతపడడంతో ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. వైద్యరంగంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు గుణం, అశోక, చంద్రశేఖర్ వంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడంతో చిన్నచిన్న క్లినిక్‌లు, మధ్య తరగతి ఆస్పత్రులలో రోగుల సంఖ్య తగ్గిపోయింది. హొసూరు మున్సిపాలిటీలో సరైన రోడ్లు, ప్రాథమిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో పట్టణంలో వ్యాపారం సన్నగిల్లింది. దీంతో అద్దె భవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భవననిర్మాణానికి వెచ్చించిన డబ్బుకు బ్యాంకు రుణం చెల్లించలేకపోతున్నామని భవనాల యజమానులు లబోదిబోమంటున్నారు. ఆరు నెల లుగా హొసూరులో వాణిజ్యం పడిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
టు లెట్
Published Thu, Apr 30 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement