To Let boards
-
జనసేన దుకాణం క్లోజ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్‌రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం. ఇది రెండోసారి జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్‌నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్‌కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
కూకట్‌పల్లిలో టు లెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: పైన కనిపిస్తున్న స్తంభానికి టులెట్ పేపర్ అంటించిన వారిని అద్దెకోసం ఎవరైనా సంప్రదించారో లేదో తెలియదు కానీ.. జీహెచ్ఎంసీ ఈవీడీఎం (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేసింది. కూకట్‌పల్లిలోని దీన్ని ఈవీడీఎం సీఈసీ విభాగానికి పోస్ట్ చేస్తూ వీటివల్ల పోల్స్, గోడలు అంధ వికారంగా మారుతున్నాయంటూ ఒక సొసైటీ ఫిర్యాదు చేయడంతో జరిమానా విధించారు. ఇంతకీ జరిమానా విధించిన వ్యక్తి చిరునామా సైతం నగరంలో లేదు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామంగా పేర్కొంటూ ఈవీడీఎం జరిమానా జారీ చేసింది. మరోవైపు, అంతటితో ఆగని సదరు సొసైటీ అదే పిల్లర్‌పై ఉన్న ‘యాక్ట్ ఫైబర్‌నెట్’ సంగతేమిటని ప్రశ్నించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఈవీడీఎం నుంచి తిరిగి ఎలాంటి ప్రతి స్పందన కనిపించలేదు. చదవండి: ఎవరు పడితే వాళ్లు సీఎం కేసీఆర్‌ను తిడుతుండ్రు -
అమ్మో.. ఆఫీసుకా?
ఉద్యోగులకు కరోనా భయం..! విధులకు వెళ్లొదంటూ కుటుంబసభ్యుల ఒత్తిడి లాంగ్ లీవ్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నాలు ప్రైవేటులో ఉద్యోగాలు వదులుకుంటున్న వైనంఇప్పటికే నగరం నుంచి 30 శాతం పల్లెబాట సాక్షి, సిటీబ్యూరో: కరోనా విజృంభణ ఉద్యోగుల కుటుంబాలను వణికిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగులు కరోనా బారినా పడుతుండటంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న వారి విధులపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆఫీస్‌కు వెళ్లే వారి కుటుంబాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణాలకంటే డ్యూటీ ఎక్కువ కాదని.. విధులకు వెళ్లొదంటూ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ప్రతి కుటుంబంలోనూ వృద్ధులు, వ్యాధిగ్రస్తులతోపాటు చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఆఫీసులకు వెళితే విధి నిర్వహాణలో ఎంతో మంది కలిసే అవకాశాలు ఉన్నందున కరోనా ఉపద్రవం ఏ రూపంలో ముంచుకువస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జ్వరం, జలుబు, దగ్గు ఉంటే విధులకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆయా లక్షణాలు బయటపడే వరకు విధులకు హాజరవుతుండటంతో వారితో సన్నిహితంగా మెగిలిన వారు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులపై కుటుంబసభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నట్లు సమాచారం. (24 గంటల్లో 2.6 లక్షల మందికి) సెలవులకు సై.. కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజలతో సంబంధాలు గల ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సెలవులకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరువుతన్నా కరోనా మాత్రం వెంటాడుతూనే ఉంది. ఒక వేళ కరోనా బారిన పడితే వైద్యం ఖర్చుతో కూడుకున్నది కావడం ప్రాణాలకుసైతం భరోసా లేకపోవడం బెంబేలెత్తిస్తోంది. స్వయ నియంత్రణ తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఉద్యోగాలకు సెలవులు పెట్టడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే సెలవులు తీసుకోవచ్చునని ఉన్నతాధికారులు సూచిస్తుండటంతో పలువురు ముందు జాగ్రత్తగా సెలవుపై వెళుతున్నట్లు సమాచారం. కొందరు తమ ఈఎల్‌లను పూర్తిగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు 10 శాతం వరకు ఉద్యోగులు సెలవుపై ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొందరు సెలవుల కోసం దరఖాస్తు పెట్టుకొని మంజూరు కోసం వేచి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (దోమలతో కరోనా రాదు) దేనికైనా రెడీ కరోనా భయంతో ఉద్యోగాలు వదులుకునేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వయస్సుపై బడటంతో పాటు వివిధ రోగాల బారినపడి ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్తే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి కరోనా బారిన పడితే ప్రాణాల దక్కవన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో వారు స్వచ్ఛంద పదవీ విరమణకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు శాఖలో స్వచ్ఛంద పదవీ విరమణలపై అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రైవేటు సంస్ధలో పనిచేస్తున్నవారు సైతం ఉద్యోగాలు వదులుకునే పనిలో పడ్డారు. వర్క్ ఫ్రం హోం కాకుండా ఆఫీస్‌కు వెళ్లి విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉండటంతో ఉద్యోగాలు వదులుకుంటేనే ప్రాణాలు దక్కుతాయని భావిస్తున్నారు. పలు సంస్ధలో ఉద్యోగుల రాజీనామాల పరంపర ప్రారంభమైంది. (మానవత్వాన్ని మింగేసిన కరోనా) ఖాళీ అవుతున్న నగరం విశ్వనగరంగా దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. నగరం జనాభా కోటిపైనే. లాక్డౌన్ సమయంలోనే విద్యా సంస్థ«లు, వసతి గృహాలు మూత పడి విద్యార్థులు, పనులు లేక వలస కార్మికులు, ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగులు కలిపి సుమారు 20 లక్షల మంది వరకు స్వస్థలాలకు తరలి వెళ్లారు. లాక్డౌన్ సడలింపు అనంతరం కరోనా విశ్వ రూపం ప్రదర్శిస్తుండటంతో పలువురు మృత్య వాత పడుతున్నారు. కరోనా వైద్యం కూడా పేద, మద్య తరగతి వారికి అందుబాటులో లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగం, ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఆయా వర్గాల కుటుంబాలు కరోనా భయంతో సొంతూళ్ల బాట పడుతున్నారు. సుమారు 10లక్షల వరకు వెళ్లి ఉంటారని అంచనా. ఫలితంగా ప్రతి విధుల్లో ఇళ్లు , పోర్షన్స్ ఖాళీ అవుతున్నాయి. ఎక్కడ చూసిన ‘టు లెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే సగం నగరం ఖాళీ కావడం ఖాయమని సమాచారం. -
టు లెట్
ఒక అడుగుకు అద్దె రూ. 80! హొసూరు- బాగలూరు రోడ్డులో మొదటి అంతస్తులో ఒక చదరపుటడుగుకు నెలకు రూ.80 నుంచి రూ.90 వరకు అద్దె నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, తాలూకాఫీసు రోడ్డు, గాంధీరోడ్డు, నేతాజీ రోడ్డు ప్రధాన ంగా వ్యాపార కూడళ్లు తదితర ప్రాంతాలలో కూడా టులెట్ బోర్డులు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. హొసూరు పట్టణంలో ఏఆర్ఆర్ఎస్, చెన్నైసిల్క్స్ వంటి పెద్దపెద్ద వస్త్ర వ్యాపార షోరూంలు ఏర్పాటు కావడంతో చిన్న, మధ్య తరగతి వస్త్ర దుకాణాల వ్యాపారం దెబ్బతింది. హొసూరు పట్టణంలో జోయ్లుక్కాస్, నాదేళ్ల, ఏవీఆర్, మలబార్, జువల్వన్, శ్రీకుమరన్, ఏవిఆర్ స్వర్ణమహాల్, తనిష్కా, జీఆర్టీ వంటి బంగారు నగల షోరూంలు వెలియడంతో చిన్నచిన్న దుకాణాలలో బంగారం వ్యాపారం తగ్గిపోయింది. కంపెనీల మూతతో ఇక్కట్లు పారిశ్రామిక ప్రాంతంలో అనేక చిన్న, పెద్ద కంపెనీలు మూతపడడంతో ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. వైద్యరంగంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు గుణం, అశోక, చంద్రశేఖర్ వంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడంతో చిన్నచిన్న క్లినిక్‌లు, మధ్య తరగతి ఆస్పత్రులలో రోగుల సంఖ్య తగ్గిపోయింది. హొసూరు మున్సిపాలిటీలో సరైన రోడ్లు, ప్రాథమిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో పట్టణంలో వ్యాపారం సన్నగిల్లింది. దీంతో అద్దె భవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భవననిర్మాణానికి వెచ్చించిన డబ్బుకు బ్యాంకు రుణం చెల్లించలేకపోతున్నామని భవనాల యజమానులు లబోదిబోమంటున్నారు. ఆరు నెల లుగా హొసూరులో వాణిజ్యం పడిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.