
సాక్షి, హైదరాబాద్: పైన కనిపిస్తున్న స్తంభానికి టులెట్ పేపర్ అంటించిన వారిని అద్దెకోసం ఎవరైనా సంప్రదించారో లేదో తెలియదు కానీ.. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేసింది. కూకట్‌పల్లిలోని దీన్ని ఈవీడీఎం సీఈసీ విభాగానికి పోస్ట్ చేస్తూ వీటివల్ల పోల్స్, గోడలు అంధ వికారంగా మారుతున్నాయంటూ ఒక సొసైటీ ఫిర్యాదు చేయడంతో జరిమానా విధించారు.
ఇంతకీ జరిమానా విధించిన వ్యక్తి చిరునామా సైతం నగరంలో లేదు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామంగా పేర్కొంటూ ఈవీడీఎం జరిమానా జారీ చేసింది. మరోవైపు, అంతటితో ఆగని సదరు సొసైటీ అదే పిల్లర్‌పై ఉన్న ‘యాక్ట్ ఫైబర్‌నెట్’ సంగతేమిటని ప్రశ్నించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఈవీడీఎం నుంచి తిరిగి ఎలాంటి ప్రతి స్పందన కనిపించలేదు.
చదవండి:
ఎవరు పడితే వాళ్లు సీఎం కేసీఆర్‌ను తిడుతుండ్రు
Comments
Please login to add a commentAdd a comment