impose
-
పతంజలికి రూ.4 కోట్లు జరిమానా: బాంబే హైకోర్టు
పతంజలి సంస్థకు బాంబే హైకోర్టు సోమవారం రూ.4 కోట్ల జరిమానా విధించింది. మంగళం ఆర్గానిక్స్ లిమిటెడ్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుకు సంబంధించి.. కంపెనీ కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తూ 2023 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ జరిమానా విధించింది.పతంజలి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని జస్టిస్ ఆర్ఐ చాగ్లా బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం పతంజలికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం పేర్కొంది. కోర్టు గతంలో ఆదేశించినప్పటికీ కంపెనీ ఉత్పత్తి విక్రయాలు, తయారీని కొనసాగించడాన్ని గమనించిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.పతంజలి కంపెనీ మునుపటి డైరెక్టర్‌కు న్యాయవాది జల్ అంధ్యారుజిన కోర్టు ఆదేశాలను తెలియజేసినప్పటికీ.. ఆయన అనుసరించలేదని ప్రస్తుత డైరెక్టర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు.. పాత డైరెక్టర్ తరపున ప్రస్తుత డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. అయితే జస్టిస్ చాగ్లా పతంజలికి రూ. 4 కోట్లు జరిమానా విధించింది. -
వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!
సాక్షి, ముంబై: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ధరలు మోత మోగనున్నాయి. ముఖ్యంగా ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ (ఎస్ఎఫ్ఏ)’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాబోయే నెలల్లో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం లభిస్తే ధరలు భారం తప్పదు. ఎస్ఎఫ్ఏ అనేది సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో కీలకమైంది. అలాగే ఈ పన్ను పెంపు ద్వారా ఇతర పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సోడియం లారెత్ సల్ఫేట్ (SLS) ఉత్పత్తిదారుపై ప్రభావాన్ని చూపుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఇండియాకుశాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. దీంతో ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున ఇది మరింత ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది. ప్రతిపాదిత సుంకం సరుకు ఖర్చు, బీమా, సరుకువిలువలో 3 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) మరోవైపు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కొత్త టారిఫ్ నిర్మాణాన్ని వర్తింపజేయవద్దని ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ఐఎస్జీ) కన్వీనర్, మనోజ్ ఝా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ చర్యతో దిగువ ఉత్పత్తుల దిగుమతుల ధరలు పెరుగుతాయని, కంపెనీల లాభ దాయకతపై కూడా ప్రభావం చూపుతుందని, ఇది తదుపరి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని పేర్కొన్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
హెచ్‌డీఎఫ్‌సీకి, ఐజీహెచ్ హోల్డింగ్స్‌కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ) కి భారీ షాకిచ్చింది. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినందుకు శుక్రవారం 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీకి ఈ జరిమానా విధించింది. దీంతోపాటు IGH హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏకంగా రూ. 11.25 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది. 2019-20లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేక పోయిందని తమ పరిశీలనలో వెల్లడైందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆర్బీఐ కంపెనీ వివరణ తర్వాత, నిబంధనలకు అనుగుణంగా లేదని నిర్ధారించి జరిమానా విధించింది. వారి డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నామినేట్ చేసిన బ్యాంకు ఖాతాలకు కంపెనీ బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైనట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. అలాగే నిబంధనలు పాటించని కారణంగా ముంబైలోని ఐజీహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.11.25 లక్షల పెనాల్టీ విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లాభ, నష్టాల ఖాతాలో వెల్లడించిన నికర లాభంలో 20 శాతాన్ని రిజర్వ్ ఫండ్‌కు బదిలీ చేయాలనే చట్టబద్ధమైన నిబంధనను పాటించడంలో కంపెనీ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. -
వెనక్కి రాకుంటే.. సాలిడ్ షాక్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టేందుకు పాశ్చాత్య దేశాలకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పటికే రికార్డు స్థాయి ఆంక్షలతో రష్యాను.. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నిరసన పేరిట ప్రముఖ కంపెనీలెన్నో రష్యాను వీడాయి. అయితే.. ఆ కంపెనీలకు ఇప్పుడు సాలిడ్ షాక్ ఇచ్చింది రష్యా. విదేశీ కంపెనీలు రష్యాకు తిరిగి రావడానికి డెడ్‌లైన్ విధించింది పుతిన్ ప్రభుత్వం. మే 1వ తేదీలోపు తిరిగి తమ దేశానికి రాకుంటే, కార్యకలాపాలను మొదలుపెట్టకుంటే.. ఆయా కంపెనీలపై పదేళ్లపాటు నిషేధం విధిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా డూమా డిప్యూటీ యెవ్గెని ఫెడోరోవ్ సదరు కీలక ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ‘‘ ఇది పూర్తిగా వాళ్లకు సంబంధం లేని వ్యవహారం. వాళ్ల జోక్యం అక్కర్లేనిది. వేలమంది రష్యన్ పౌరుల పౌరులను వాళ్లు(ఆ కంపెనీలను ఉద్దేశించి) అనిశ్చితిలోకి నెట్టేశారు. వాళ్ల భవిష్యత్తు, బాగోగుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు’’. అని ఆ ప్రకటన చదివి వినిపించారు ఆయన. మే 1, 2022లోపు వారి(ఆ కంపెనీలు) కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ అది జరగకుంటే.. వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడమే కాదు.. పదేళ్ల పాటు రష్యాలో కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిషేధం కూడా విధిస్తాం అని స్పష్టం చేశారు యెవ్గెని. అంతకుముందు, రష్యాను విడిచిపెట్టిన విదేశీ కంపెనీలకు బాహ్య నిర్వహణను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. దీని ప్రకారం.. అధికారులు దీనికి తగినంత చట్టపరమైన మార్కెట్ సాధనాలను కలిగి ఉంటారు. అయితే వ్యాపారాలను నేరుగా జాతీయకరణ చేయడం కంటే.. విదేశీ కంపెనీల్లో తాత్కాలిక పాలన విభాగం ఏర్పాటు చేసుకోవడం మంచిదనే సూచనను ఎప్పటి నుంచో చేస్తున్నారు రష్యా ఆర్థిక మేధావులు. -
అమెరికాపై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. వ్యూహాత్మక లక్ష్యాలు సాధించుకొనేందుకు పాకిస్తాన్‌ను ఉపయోగించుకోవడం, అవసరం తీరాక పక్కన పెట్టేయడం, పైగా ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. ‘మిత్ర’ దేశం చైనా తమకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్షా సమయంలో చైనా తమను ఆదుకుంటోందని అన్నారు. చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడాన్ యూనివర్సిటీ సలహా కమిటీ డైరెక్టర్ ఎరిస్ లీకి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలను న్యూస్ ఇంటర్నేషన్ పత్రిక శుక్రవారం బహిర్గతం చేసింది. ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ బదులిస్తూ.. గతంలో అమెరికాతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు పాక్ అవసరం లేదని అమెరికా భావిస్తోందని, అందుకే దూరం పెడుతోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడల్లా మళ్లీ తమ దేశానికి దగ్గర కావడం అగ్రరాజ్యం విధానమని అన్నారు. అవసరం తీరాక తమవైపు కన్నెత్తి కూడా చూడదని ఆక్షేపించారు. 1980వ దశకంలో పాక్–యూఎస్ సంబంధాలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. అప్పట్లో సోవియన్ యూనియన్ సైనిక దళాలు అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టాక అమెరికా తమ దేశంతో చేతులు కలిపిందన్నారు. సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ను వాడుకుందని తెలిపారు. అఫ్గాన్ నుంచి సోవియట్ యూనియన్ సైన్యం వెనక్కి వెళ్లిపోయాక పాక్‌పై అమెరికా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. సెప్టెంబర్ 11(9/11) దాడుల అనంతరం పాక్–అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. గత ఏడాది చోటుచేసుకున్న అఫ్గానిస్తాన్ పరిణామాల తర్వాత తమ దేశాన్ని ఆమెరికా నిందిస్తోందని తప్పుపట్టారు. చైనా–పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. -
కూకట్‌పల్లిలో టు లెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: పైన కనిపిస్తున్న స్తంభానికి టులెట్ పేపర్ అంటించిన వారిని అద్దెకోసం ఎవరైనా సంప్రదించారో లేదో తెలియదు కానీ.. జీహెచ్ఎంసీ ఈవీడీఎం (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేసింది. కూకట్‌పల్లిలోని దీన్ని ఈవీడీఎం సీఈసీ విభాగానికి పోస్ట్ చేస్తూ వీటివల్ల పోల్స్, గోడలు అంధ వికారంగా మారుతున్నాయంటూ ఒక సొసైటీ ఫిర్యాదు చేయడంతో జరిమానా విధించారు. ఇంతకీ జరిమానా విధించిన వ్యక్తి చిరునామా సైతం నగరంలో లేదు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామంగా పేర్కొంటూ ఈవీడీఎం జరిమానా జారీ చేసింది. మరోవైపు, అంతటితో ఆగని సదరు సొసైటీ అదే పిల్లర్‌పై ఉన్న ‘యాక్ట్ ఫైబర్‌నెట్’ సంగతేమిటని ప్రశ్నించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఈవీడీఎం నుంచి తిరిగి ఎలాంటి ప్రతి స్పందన కనిపించలేదు. చదవండి: ఎవరు పడితే వాళ్లు సీఎం కేసీఆర్‌ను తిడుతుండ్రు -
స్టీల్ దిగుమతులపై సుంకం పెంపు? షేర్లు జూమ్..
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్టీల్ ఉత్పత్తులపై సుంకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఒక నివేదికను స్టీల్ మంత్రిత్వ శాఖ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఒక నివేదికను అందించినట్టు సమాచారం. దీంతో కేంద్ర వాణిజ్య, ఉక్కు పరిశ్రమల మంత్రిత్వ శాఖలు కనీస దిగుమతి ధరలు(మినిమం ఇంపోర్ట్ ప్రైసెస్) పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సుంకం వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ వార్తలతో స్టాక్ మార్కెట్ లో స్టీల్ రంగం షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న బుధవారం నాటి మార్కెట్ లో టాటా స్టీల్, హిందాల్కో, తదితర మెటల్ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు చైనా మార్కెట్ల పతనం మన దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. కాగా ప్రపంచ ఉక్కు సంఘం (డబ్ల్యుఎస్ఎ) నివేదికల ప్రకారం, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో పోలిస్తే 2015 లో భారతదేశంలో స్టీల్ ఉత్ప త్తిలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తక్కువ శ్రేణి ఉత్పత్తులను నిరోధించి దేశంలో స్టీల్ పరిశ్రమ విస్తరణకు ఉపకరించేందుకు కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమిస్తున్న తెలుస్తోంది. చౌకైన చైనీస్ దిగుమతుల డంపింగ్ కారణంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేందుకు, ఉక్కు మంత్రిత్వ శాఖతో సంప్రదిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.