Indians Soon Have To Pay More For Soaps, Detergents, And Shampoos, Know Reasons Inside - Sakshi
Sakshi News home page

వినియోగదారులకు మరో షాక్‌: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్‌!

Published Wed, Apr 26 2023 4:59 PM | Last Updated on Wed, Apr 26 2023 5:34 PM

You may soon have to pay more for soaps detergents shampoos here details - Sakshi

సాక్షి, ముంబై:  వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌. త్వరలోనే క్లీనింగ్‌  ప్రొడక్ట్స్‌ ధరలు మోత మోగనున్నాయి. ముఖ్యంగా ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ (ఎస్‌ఎఫ్‌ఏ)’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాబోయే నెలల్లో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (MG Comet EV: ఎంజీ కామెట్‌ కాంపాక్ట్‌ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!)

సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం లభిస్తే ధరలు భారం తప్పదు. ఎస్‌ఎఫ్‌ఏ అనేది సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో  కీలకమైంది. అలాగే  ఈ పన్ను పెంపు ద్వారా ఇతర పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సోడియం లారెత్ సల్ఫేట్ (SLS) ఉత్పత్తిదారుపై ప్రభావాన్ని చూపుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. (వివో ఎక్స్‌ 90, 90ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌, ధరలు చూస్తే)

ఇండియాకుశాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. దీంతో ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున ఇది మరింత ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది. ప్రతిపాదిత సుంకం సరుకు ఖర్చు, బీమా, సరుకువిలువలో 3 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్‌ భయ్యా! ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో)

మరోవైపు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కొత్త టారిఫ్ నిర్మాణాన్ని వర్తింపజేయవద్దని ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ఐఎస్‌జీ) కన్వీనర్, మనోజ్ ఝా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ చర్యతో దిగువ ఉత్పత్తుల దిగుమతుల ధరలు పెరుగుతాయని, కంపెనీల లాభ దాయకతపై కూడా  ప్రభావం చూపుతుందని, ఇది తదుపరి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని పేర్కొన్నారు.  (ముంబై ఇండియన్స్‌ బాస్‌ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement