పతంజలికి రూ.4 కోట్లు జరిమానా: బాంబే హైకోర్టు | Bombay High Court Imposes Rs 4 Crore On Patanjali | Sakshi
Sakshi News home page

పతంజలికి రూ.4 కోట్లు జరిమానా: బాంబే హైకోర్టు

Published Tue, Jul 30 2024 6:15 PM | Last Updated on Tue, Jul 30 2024 6:41 PM

Bombay High Court Imposes Cost of Rs 4 Crore on Patanjali Details

పతంజలి సంస్థకు బాంబే హైకోర్టు సోమవారం రూ.4 కోట్ల జరిమానా విధించింది. మంగళం ఆర్గానిక్స్ లిమిటెడ్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుకు సంబంధించి.. కంపెనీ కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తూ 2023 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ జరిమానా విధించింది.

పతంజలి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని జస్టిస్ ఆర్‌ఐ చాగ్లా బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం పతంజలికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం పేర్కొంది. కోర్టు గతంలో ఆదేశించినప్పటికీ కంపెనీ ఉత్పత్తి విక్రయాలు, తయారీని కొనసాగించడాన్ని గమనించిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

పతంజలి కంపెనీ మునుపటి డైరెక్టర్‌కు న్యాయవాది జల్ అంధ్యారుజిన కోర్టు ఆదేశాలను తెలియజేసినప్పటికీ.. ఆయన అనుసరించలేదని ప్రస్తుత డైరెక్టర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు.. పాత డైరెక్టర్ తరపున ప్రస్తుత డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. అయితే జస్టిస్ చాగ్లా పతంజలికి రూ. 4 కోట్లు జరిమానా విధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement