
హోసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలిసి మహిళా డాక్టర్ మిద్దె మీద నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. మత్తిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కడలూరు జిల్లా బన్‌రుట్టి ప్రాంతానికి చెందిన నందిని (24) హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయుర్వేద విభాగంలో డాక్టర్‌గా పనిచేస్తోంది.
ధర్మపురికి చెందిన మునియప్ప (29) హోసూరు సమీపంలోని కురుబట్టిలో ఉంటూ కాల్ టాక్సీ నడిపేవాడు. ఇతనితో నందినికి పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఇరువురూ మత్తిగిరి దగ్గర నివాసముంటున్నారు. మునియప్పకు గతంలోనే పెళ్లయిందనే సంగతిని నందినికి తెలియడంతో తరచూ కాపురంలో గొడవలేర్పడుతుండేది.
చదవండి: (జిమ్ చేస్తూనే కుప్పకూలిపోయిన మహిళ.. వీడియో వైరల్)
గత మూడు రోజుల క్రితం ఏర్పడిన గొడవల్లో ఇరువురూ నిద్ర మాత్రలు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాయం నుంచి బయటపడి ఇల్లు చేరుకొన్న వీరికి శుక్రవారం రాత్రి మళ్లీ గొడవలేర్పడింది. దీనితో జీవితంపై విరక్తి చెందిన నందిని మిద్దెపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలైన చనిపోయింది. మత్తిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment