Call Taxi
-
టాక్సీ డ్రైవర్‌తో డాక్టర్ ప్రేమవివాహం.. నిజం తెలిసి..
హోసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలిసి మహిళా డాక్టర్ మిద్దె మీద నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. మత్తిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కడలూరు జిల్లా బన్రుట్టి ప్రాంతానికి చెందిన నందిని (24) హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయుర్వేద విభాగంలో డాక్టర్‌గా పనిచేస్తోంది. ధర్మపురికి చెందిన మునియప్ప (29) హోసూరు సమీపంలోని కురుబట్టిలో ఉంటూ కాల్ టాక్సీ నడిపేవాడు. ఇతనితో నందినికి పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఇరువురూ మత్తిగిరి దగ్గర నివాసముంటున్నారు. మునియప్పకు గతంలోనే పెళ్లయిందనే సంగతిని నందినికి తెలియడంతో తరచూ కాపురంలో గొడవలేర్పడుతుండేది. చదవండి: (జిమ్ చేస్తూనే కుప్పకూలిపోయిన మహిళ.. వీడియో వైరల్) గత మూడు రోజుల క్రితం ఏర్పడిన గొడవల్లో ఇరువురూ నిద్ర మాత్రలు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాయం నుంచి బయటపడి ఇల్లు చేరుకొన్న వీరికి శుక్రవారం రాత్రి మళ్లీ గొడవలేర్పడింది. దీనితో జీవితంపై విరక్తి చెందిన నందిని మిద్దెపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలైన చనిపోయింది. మత్తిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్ లో బుక్ మై క్యాబ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న బుక్ మై క్యాబ్.కామ్ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. భాగ్యనగరికి చెందిన క్యాబ్ ఆన్ క్లిక్.కామ్‌ను కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 100 కార్లతో సేవలను ప్రారంభిస్తున్నట్టు బుక్ మై క్యాబ్ సీఈవో అవినాశ్ గుప్త తెలిపారు. సీవోవో వినయ్ పాండేతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ముంబై, కోల్‌కత, ఢిల్లీలో 5 వేల వాహనాలతో సర్వీసులు ఇస్తున్నట్టు చెప్పారు. ‘కస్టమర్లు గతంలో ప్రణాళిక ప్రకారం ముందుగా కారు బుక్ చేసేవారు. ఇప్పుడంతా ఇన్స్టాంట్. ప్రయాణానికి 15-45 నిముషాల ముందు కారు కావాలంటున్నారు. హైదరాబాద్, కోల్‌కతలో 50 శాతంపైగా కస్టమర్లు ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తున్నారు. ముంబై, ఢిల్లీలో 65 శాతంపైగా కస్టమర్లు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి క్యాబ్ కోరతారు’ అని వివరించారు. క్యాబ్ డ్రైవర్లు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని వారి పిల్లల చదువుల కోసం దాచుకునేలా సేవింగ్ పథకాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లేకున్నా ఎస్ఎంఎస్ ద్వారా బుకింగ్ సేవలను త్వరలో పరిచయం చేయనుంది.