ప్రదర్శనకు తీసుకువచ్చిన వివిధ జాతులకు చెందిన శునకాలు
హోసూరు(బెంగళూరు): జిల్లా కేంద్రం క్రిష్ణగిరి ప్రభుత్వ బాలుర ఉన్నతోన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న 28వ అఖిల భారత మామిడి ప్రదర్శనలో ఆదివారం ఏర్పాటు చేసిన డాగ్‌షో అందరినీ అలరింపజేసింది. కార్యక్రమానికి ఆర్డీవో సతీష్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఆదివారం పశుసంవర్థక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన డాగ్‌షోలో గోల్డెన్‌రెడ్ రైవర్, జర్మన్ షపర్డ్, ల్యాబ్రడార్, రాట్‌వీలర్, టంపర్‌మేన్, టేక్‌శాండ్, క్రోటేన్, రాజపాళ్యం, కన్ని, సిప్పిపారై, కర్కార్, స్పోనియల్ తదితర 21 జాతులకు చెందిన 200కుపైగా శునకాలు పాల్గొన్నాయి.
ప్రదర్శనకు తీసుకొచ్చిన శునకాలచే విన్యాసాలు చేయించారు. ప్రధానంగా పోలీసు శాఖ తీసుకొచ్చిన శునకాలచే సాహస కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా విన్యాసాల్లో పాల్గొని గెలుపొందిన కుక్కలకు బహుమతులందజేశారు.
పశుసంవర్థక శాఖ మండల ఉపడైరెక్టర్ రాజేంద్రన్, డెప్యూటీ డైరెక్టర్ మరియ సుందర్, అరుళ్‌రాజ్, కలైయరసు, పీఆర్‌వో మోహన్, పశుసంవర్థక శాఖ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment