dog show
-
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
పెడిగ్రీ ప్రో హైకాన్–24 : బుజ్జి పప్పీలు, బుల్లి కూనలు సూపర్ (ఫోటోలు)
-
గుంటూరు: ఆకట్టుకున్న డాగ్ షో (ఫొటోలు)
-
అలరించిన పెట్ ఫెస్ట్–2023 (ఫొటోలు)
-
పెటెక్స్..అదుర్స్
మాదాపూర్: వివిధ దేశాలు...50 విభిన్న జాతులకు చెందిన 500 శునకాలు.. 700 రకాల చేపలు...క్యాట్ షో...అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు...నగరంలో మొదటిసారిగా ఏర్పాటైన పెటెక్స్–2023 ప్రత్యేకతలివీ. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఎనిమిది మంది అంతర్జాతీయ నిపుణులు పోటీల్లో న్యాయనిర్ణేతలుగా పాలుపంచుకుంటున్నారు. ఇక ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ క్యాట్ షోను నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమలో భారత్ ఒకటి అని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. పెంపుడు జంతువుల ప్రాముఖ్యతను వివరించేందుకే ప్రదర్శన ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆకట్టుకుంటున్న 700 రకాల చేపలు హైటెక్స్‌లో పెటెక్స్లో భాగంగా ఆక్వా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 700 రకాల చేపలు ప్రదర్శనలో ఉంచారు. చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాంటెడ్ అక్వేరియమ్, మాన్స్స్టార్, సెమీ అగ్రెసివ్ అక్వేరియమ్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో సిల్వర్ డెరోడో చేప ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ.3.50 లక్షల రూపాయలు. దీని ప్రత్యేకత..నీటిలో 12 అడుగుల లోతులో గంటకి 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో చివరి రోజు రెడ్‌చిల్లీ అర్వాన చేపను సందర్శకులు తిలకించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీని ధర. రూ.42 లక్షలు. దీని ప్రత్యేకత..నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని, అందంగా ఉంటుందని, ఇంట్లో ఉంటో వాస్తుపరంగా బాగుంటుందని జపనీయుల నమ్మకం. ఆకట్టుకుంటున్న 120 రకాల పిల్లులు ప్రదర్శనలో దాదాపు 120 రకాల పిల్లులను ఉంచారు. కొన్ని రకాల పిల్లులు చూడడానికి పులులుగా ఉన్నాయి. ఇందులో బెంగాల్ క్యాట్, ట్రెడిషనల్ లాంగ్ హేయిర్, హిమాలయన్, బ్రీటీస్ సార్ట్ హేయిర్, ఎక్సోటిక్ సార్ట్ హెయిర్, మెన్కున్ లాంటి బ్రీడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటి ధర రూ. 50 వేల నుండి రూ.3 లక్షల వరకు ఉన్నాయి. పక్షులు సైతం.. ఆస్ట్రేలియాకు చెందిన మోలుకన్ కొకాటో పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటి ధర రూ.50 నుండి ప్రారంభం. నెల ఖర్చు రూ.5 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. గృహాలలో పెంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు బ్లూగోల్డ్ మకావ్, రామచిలుకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు అందంగా తయారు చేస్తా.. నా దగ్గర ఉన్న చిన్న డాగ్ షెడ్జి. దీని ధర రూ.28 వేలు. దీనికి నెలఖర్చు రూ.10 వేల వరకు అవుతాయి. ప్రతి నెల డాక్టర్ వద్ద చెకప్ చేయిస్తా. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత ప్రేమగా చూసుకుంటాను. ప్రతి రోజు అందంగా తయారు చేస్తాను. – రమన్, జుంతుప్రేమికురాలు కుక్కలకు రక్తం అవసరం ప్రమాదాలు వాటిల్లినప్పుడు మనుషులకు రక్తం ఎలా అవసరం ఉంటుందో కుక్కలకూ అలాగే అవసరం. ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, సర్జరీలు చేసేటప్పుడు, రక్తం మార్చవలసిన పరిస్థితి కలిగినప్పుడు మాకు సమాచారం అందిస్తే సంబంధించిన ఇతర కుక్కలను తీసుకువచ్చి రక్తాన్ని ఇస్తాం. – కౌశిక్, జంతుప్రేమికుడు కేరింగ్ తీసుకోవాలి పెంపుడు జంతువులను పెంచాలనే కోరిక, ఆసక్తి ఉన్నప్పుడే వాటిని పెంచగలం, పెండుపు జంతువులను పెంచేవారు డాక్టర్ల సలహాలను, నిపుణులతో సంప్రదించాలి. వాటికి కావాల్సిన ఆహారాన్ని తగినంత మొతాదులో పెట్టాలి. వాటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. – గణేశ్, వెటర్నరీ డాక్టర్ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తాం.. బ్లాక్ల్యాబ్రో డాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పెంచుతున్నా. కుటుంబంలో ఒకరిగా చూసుకుంటాం. మా ఫ్రెండ్స్ సైతం చూడడానికి ఇంటికి వస్తారు. దీని ధర రూ.20 వేల నుండి ప్రారంభం అవుతుంది. దీనికి నెల ఖర్చు రూ.6 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. – జాగృతి, జంతు ప్రేమికురాలు -
Kutta To Dutta: దమ్ము చూపించిన సామాన్యుడు
కోల్‌కతా: సోషల్ మీడియా నుంచి మీడియాకు ఎక్కిన ఆ సామాన్యుడి నిరసనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ‘భౌ.. భౌ..’అంటూ బాధితుడు చేసిన పనికి.. అధికార యంత్రాంగం దిగొచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంతి కుమార్ దత్తా అనే వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన గురించి దేశవ్యాప్త చర్చ నడిచిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో పేరు సవరణ కోసం ఆయన మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారట. మూడవ సారికి స్పందించిన అధికారులు ఆయన ఇంటిపేరు ‘దత్తా’ కాగా.. రేషన్ కార్డులో కుత్తా(కుక్క) అని తప్పుగా అచ్చువేశారు. ఇక లాభం లేదనుకున్న ఆయన.. కుక్కలా మొరుగుతూ నిరసనను అధికారుల వద్ద తెలియజేశారు. ఆ సమయంలో ఆ అధికారి ఒకింత ఇబ్బందికి గురి కావడం చూడొచ్చు. మొత్తానికి వీడియో ప్రభావంతో.. సమస్య తెలుసుకున్న బీడీవో రేషన్ కార్డులో పేరును సవరించాలని సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియా నుంచి మీడియాకి ఎక్కడంతో.. విమర్శలపాలు కావడం ఇష్టంలేని అధికారులు సత్వరం స్పందించారు. సోమవారం ఆయన పేరును కుత్తా నుంచి దత్తాకి మార్చేస్తూ రేషన్ కార్డును చేతిలో పెట్టారు. -
శునక షోయగం (ఫోటోలు)
-
గ్రేట్ వారియర్.. గ్రామసింహంపై ప్రశంసల వర్షం
కొన్ని సందర్భాల్లో జంతువుల చేసే పనులు చూస్తే ఔరా అనిపిస్తుంది. మనుషులు ఆలోచనతో చేయలేని పనులను సైతం జంతువులు చేసి చూపిస్తాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని చేసి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలోని రోడ్డు ఆ సమయంలో రద్దీగా ఉంది. వాహనాలు బిజీ బిజీగా రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది చిన్నారులు రోడ్డు దాటడానికి సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఓ పెంపుడు కుక్క అక్కడికి వచ్చి వారికి సాయం అందించింది. రోడ్డును బ్లాక్ చేసి వాహనాలను ఆపి.. పిల్లలు రోడ్డుదాటేలా చూసుకుంది. చిన్నారులు రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో డాగ్.. క్రాసింగ్ గార్డ్లాగా విధులు నిర్వహించింది. కార్లు ముందుకు కదులుతుంటే కుక్క గర్జిస్తూ వాటిని ఆపింది. ఈ క్రమంలో చిన్నారులు సురక్షితంగా రోడ్డు దాటారు. అనంతరం కుక్క కూడా రోడ్డు మీద నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. వీడియో ఆఫ్ ది డే, గ్రేట్ వారియర్ అంటూ కామెంట్స్ చేశారు. This Will Make Your Day.❤️ pic.twitter.com/5MFETG4OA9 — Awanish Sharan (@AwanishSharan) July 30, 2022 ఇది కూడా చదవండి: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం.. ఈ వీడియో చూస్తే కాదనలేరు! -
రియల్ చార్లీ777.. షో అదిరింది!
హోసూరు(బెంగళూరు): జిల్లా కేంద్రం క్రిష్ణగిరి ప్రభుత్వ బాలుర ఉన్నతోన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న 28వ అఖిల భారత మామిడి ప్రదర్శనలో ఆదివారం ఏర్పాటు చేసిన డాగ్‌షో అందరినీ అలరింపజేసింది. కార్యక్రమానికి ఆర్డీవో సతీష్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఆదివారం పశుసంవర్థక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన డాగ్‌షోలో గోల్డెన్‌రెడ్ రైవర్, జర్మన్ షపర్డ్, ల్యాబ్రడార్, రాట్‌వీలర్, టంపర్‌మేన్, టేక్‌శాండ్, క్రోటేన్, రాజపాళ్యం, కన్ని, సిప్పిపారై, కర్కార్, స్పోనియల్ తదితర 21 జాతులకు చెందిన 200కుపైగా శునకాలు పాల్గొన్నాయి. ప్రదర్శనకు తీసుకొచ్చిన శునకాలచే విన్యాసాలు చేయించారు. ప్రధానంగా పోలీసు శాఖ తీసుకొచ్చిన శునకాలచే సాహస కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా విన్యాసాల్లో పాల్గొని గెలుపొందిన కుక్కలకు బహుమతులందజేశారు. పశుసంవర్థక శాఖ మండల ఉపడైరెక్టర్ రాజేంద్రన్, డెప్యూటీ డైరెక్టర్ మరియ సుందర్, అరుళ్‌రాజ్, కలైయరసు, పీఆర్వో మోహన్, పశుసంవర్థక శాఖ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
Dog Show: విజయవాడలో ఆకట్టుకున్న ‘డాగ్ షో’
-
ఆకట్టుకున్న ‘ఇండీస్ డాగ్ షో’
-
వైరల్ వీడియో: గొంతెత్తి పాడిన శునకం
-
వైరల్ వీడియో: నీకంటే నేనే బాగా పాడుతున్నా..
అప్పుడే మాటలు నేర్చుకున్న పిల్లలు మాట్లాడే మాటలు ఎంతో ముద్దు ముద్దుగా ఉంటాయి. అదే గొంతుతో చిన్న చిన్న రాగాలు తీస్తే చెవులకు భలే వినసొంపుగా ఉంటుంది. మరి ఓ బుజ్జి పిల్లాడితో పెంపుడు జంతువు సంభాషణ కలిపితే ఎలా ఉంటుంది. పిల్లవాడితో పోటీపడి మరి రాగం తీస్తే ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ చంటిగాడితో పాడింది ఏ చిలకో కాదు.. ఓ పెంపుడు కుక్క. అవును నిజమే.. ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్న బాబుకు ఏం అనిపించిందో ఏమో ఒక్కసారిగా కూని రాగాలు తీయడం ప్రారంభించాడు. ఆడుతూ, గెంతుతూ సింగర్‌లా రాగం ఎత్తుకున్నాడు. పక్కనే ఉన్న పెంపుడు కుక్క కూడా చిన్నారితో కలిసి పాడటం మొదలు పెట్టింది. దానికి వచ్చిన భాషలో పిల్లవాడు ఎంత శ్రుతిలో హమ్ చేస్తే ...కుక్క కూడా అదే స్థాయిలో పాడటం ప్రారంభించింది. వాడేదో అడుగుతుంటే అది సమాధానం చెప్పినట్లు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. ఇక ఈ వీడియోను ‘ఈ రోజు మీరు చూసే వాటిలో ఇదొక అందమైన వీడియో’ అంటూ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో దీన్నిచూసిన నెటిజన్లు ‘ఇద్దరి మద్య సంభాషణ బహు బాగు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
కుక్కలకు కూడా ఖరీదైన పరుపులు
సాక్షి, న్యూఢిల్లీ : మెత్తటి పరపులపై పడుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చుగానీ డబ్బున్న మహరాజులకు అదో లెక్కా! అయితే మనుషులు పడుకునేందుకు డబ్బుల గురించి లెక్క చేయలేకపోవచ్చుగానీ, కుక్కల కోసం పరుపులు కొనాలంటే, అందులో ఖరీదైనా పరువులు కొనాలంటే ఎంతటి మహరాజులకైనా లెక్కలెకుండా ఉంటుందా! ఇప్పుడు పెంపుడు కుక్కల పరుపులు కూడా పెద్ద బిజినెస్‌గా మారిపోయింది. అందులో రాయల్ పరుపుల సంగతి చెప్పక్కెర్లేదు. ఈ పరుపులను డిజైన్ చేయడానికి ప్రత్యేక డిజైనర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పరుపులు భారతీయ కరెన్సీలో 95 వేల రూపాయల వరకు పలకడం విశేషం. వీటిని రాయల్ కేటగిరీగా పేర్కొంటున్నారు. ఆస్ట్రియా రాకుమారి కటాలిన్ జూ విండిజ్గ్రేజ్ ర్యాన్ వియెన్నాలో సొంత బ్రాండ్‌తో ఈ పరుపుల అమ్మకాలను ప్రారంభించారు. ఆమె తన పేరు స్ఫురించేలా ‘కేజెడ్డబ్లూ పెట్ ఇంటీరియర్స్’ దానికి పేరు పెట్టారు. వాటికి బుల్లి మంచం పరుపు నుంచి కాస్త పెద్ద మంచం పరుపు వరకు, నేల మీద వేసుకునే పరుపులను, వాటికి అనుగుణమైన మెత్తలను కూడా డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఈ పరుపులు 800 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి. వాటికి విడివిడి గౌషన్లు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చు కోవచ్చు. ఆ తర్వాత ఆమె పెంపుడు కుక్కలు ఆడుకునే ఆట వస్తువులతో ‘డాగ్ ఫర్నీచర్’ పేరిట వ్యాపారాన్ని విస్తరించారు. మరో పరుపుల కంపెనీ ‘చార్లీ చాహు’ 800 రూపాయలకు విడుదల చేసిన ‘చార్లీ చాహు స్నగుల్ బెడ్’ పాశ్చాత్య దేశాల మార్కెట్లో పిచ్చ పిచ్చగా అమ్ముడుపోతోంది. అందుకు కారణం దాని ధర అందరికి అందుబాటులో ఉండడమే. చార్లీ చాహు కంపెనీని క్రిసై్టన్ చాహు తన సోదరి జెన్నీ చాహుతో కలసి ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కల కోసం ‘పిప్పా అండ్ కంపెనీ’ మధ్యస్థాయి లగ్జరీ పరపులను తయారీచేసి మార్కెట్లో విక్రయిస్తోంది. వీటిని వాషింగ్ మషిన్లో వేసి ఉతికే అవకాశం కూడా ఉండడం విశేషం. పరుపులోని కుషన్‌కు వాసన, నీరు అంటకుండా నిలువరించగల లైనర్లను ఈ పరపుల తయారీలో ఉపయోగించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జెన్నీఫర్ టేలర్ తెలిపారు. ‘సిగ్నేచర్ బెడ్స్’ పిప్పా అండ్ కంపెనీ పేరిట పెంపుడు కుక్కల పరపులను సరఫరా చేస్తోంది. -
హైటెక్స్‌లో పెటెక్స్ ఇండియా– 2019 ప్రారంభం
-
రక్తం చిందే ఆ ఆటపై ఎంతో ఆసక్తి!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆడు బగాంగ్’ అన్నది ఒక ఆటవిక ఆట. అందులో గాయాలవుతాయి. వాటిలో నుంచి రక్తం చిమ్ముతుంది. గాయానికో లెక్క. ఎన్ని గాయాలయితే చూసే వారికి, బెట్ కాసేవారికి అంత ఆనందం. ఇది మనుషులు ఆడే ఆట కాదు. మనుషులు ఆడించే ఆట. తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందేల లాంటిదేగానీ కొంత తేడా. తమిళనాడులో గేదెల మధ్య, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల మధ్య ఆటలు సాగితే అక్కడ కుక్క, అడవి పంది మధ్య హింసాత్మక పోటీలు జరుగుతాయి. ‘ఆడు బగాంగ్’ అన్నది ఇండోనేసియాలో కనిపించే గ్రామీణ క్రీడ. ఇది ఇప్పుడు ఎక్కువగా జావా రాష్ట్రంలో కనిపిస్తోంది. చిత్తడి చిత్తడిగా ఉన్న ఓ ప్రదేశం చుట్టూ గుండ్రంగా తడికెలతో ఓ దడి కడతారు. అందులోకి శిక్షణ ఇచ్చిన కుక్క పిల్లలను, అడవి పందులను బరిలోకి దింపుతారు. అవి వీరావేశంతో కొట్లాడుకుంటుంటే దడి చుట్టూ నిలబడి వందలాది మంది ప్రజలు చూస్తుంటారు. ఆ సందర్భంగా ఆనందంగా తాగే వారు తాగుతుంటే బెట్ కాసే వారు భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కాస్తారు. ఈ క్రీడను మగవారితోపాటు మహిళలు, పిల్లలే కాకుండా పోలీసులు, సైనికులు కూడా ఆసక్తిగా తిలకిస్తారు. ఇందులో బెట్టింగ్ ఒక సైడే ఉంటుంది. పందెంలో పాల్గొంటున్న ఓ కుక్క, తన ప్రత్యర్థి అడవి పందికి ఎన్ని గాయాలు చేస్తుందన్నదే లెక్క. పంది ప్రాణాలపై కూడా పందెం కాస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో అడవి పంది పోరాడే శక్తిని కోల్పోయినప్పుడు ఆ పందిని బరి నుంచి తప్పించి మరో పందిని ప్రవేశపెడతారు. పందిని తెచ్చి బరిలో ప్రవేశ పెట్టే వారికి కూడా పందెం నిర్వాహకులు కొంత డబ్బు చెల్లిస్తారు. వారి పందికి ఎన్ని గాయాలైతే అంత డబ్బు లెక్కగట్టి ఇవ్వడంతోపాటు వాటికి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తారు. ఈ గ్రామీణ క్రీడను రక్తి కట్టించేందుకు కుక్కలను బలిష్టంగా మేపడమే కాకుండా వాటికి తగిన శిక్షణ ఇస్తారు. కేవలం ఈ పోటీల కోసమే బలమైన కుక్క జాతుల మధ్య క్రాస్ బ్రీడింగ్ ద్వారా కుక్క పిల్లలను పుట్టిస్తారు. బెట్టింగ్ రాయుళ్లకు, పందిని తీసుకొచ్చే వారికి ఏ మాత్రం డబ్బు గిట్టుబాటు అవుతుందో తెలియదుగానీ కుక్కల యజమానులు మాత్రం లక్షల కొద్దీ రూపాయలు సంపాదిస్తున్నారు. జీవకారుణ్య కార్యకర్తల డిమాండ్ మేరకు ఇండోనేసియా ప్రభుత్వం 2017లో ఈ క్రీడను రద్దు చేసింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను నగర మేయర్లకు అప్పగించడంతో వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాల్లాగా ఆ దేశంలో ఈ పోటీలు యధేశ్చగా కొనసాగుతున్నాయి. ‘కప్’ల పేరిట కూడా ఈ పోటీలను నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మద్యం తాగడాన్ని అక్కడి షరియా చట్టం నిషేధించినప్పటికీ ఈ పోటీలప్పుడు ప్రజలు మాత్రం జాతి, మత భేదాల్లేకుండా ఆనందంగా తాగడం కనిపిస్తోంది. 1960 నుంచి ఈ పోటీలు అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట రైతులు అడవి పందుల నుంచి తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కుక్కలను పెంచేవారు. అవి వాటిని తరిమి తరిమి కొట్టేవి. ఈ వేటను ఆనందించిన రైతుల నుంచే ఈ పోటీలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. -
కనకపు సింహాసనమున!!
రాజభవంతిలాంటి భవనం.. సార్ వస్తున్నారహో..ఇంట్లో పనోడి అరుపు.. టైలు కట్టుకుని లైనులో నిల్చున్న పెద్ద పెద్ద ఉద్యోగులంతా అలర్ట్ అయ్యారు..ఇంతలో సార్ రానేవచ్చారు.. మందీమార్బలంతో.. అక్కడ ఉన్న సింహాసనంలాంటి కుర్చీమీద ఆసీనులయ్యారు.. అంతా సార్ ఏం చెబుతారా అని ఆసక్తిగా చూస్తున్నారు..అంతా నిశ్శబ్దం..ఇంతలో సార్ గంభీరంగా అన్నారు.. భౌ.. భౌ.. భౌభౌ.. వెంటనే విషయం అర్థమైనట్లుగా అందరూ హర్షధ్వానాలు చేశారు.. వినడానికి విచిత్రంగా ఉందా.. ఇదంతా నిజమేనండోయ్. అందుకే ఇక కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి.. అన్న సుమతీ శతకాన్ని పక్కనపెట్టేయండి.. చీ కుక్క బతుకు అనీ చీప్‌గా చూడటం మానేయండి.. ఎందుకంటే.. ఈ వార్తంతా చదివాక ఆహా కుక్క బతుకు అని అనాల్సిందే.. జంతువుల లగ్జరీ లైఫ్‌ను చూసి కుళ్లుకోవాల్సిందే.. ఇది 2018లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జంతువుల జాబితా మరి.. ఓసారి చూసేద్దామా.. 1 గుంథర్–4 దేశం: జర్మనీ ఆస్తి: 2,600 కోట్లు ఈ జర్మన్ షెపర్డ్‌కు ఈ ఆస్తి తన తండ్రి గుంథర్–3 నుంచి వారసత్వంగా సంక్రమించింది.గుంథర్–3 యజమాని కర్లోటా లీబెన్స్టీన్ 1991లో చనిపోయింది. యావదాస్తి తన పెంపుడు కుక్క పేరిట రాసిపోయింది. ఆ సమయంలో ఆమె ఆస్తి 740 కోట్లే. అయితే.. గుంథర్ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టులోని ట్రస్టీలు ఆ సొమ్మును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారు. అది పెరిగి ఈ స్థాయికి చేరింది. 2 గ్రంపీ క్యాట్ దేశం: అమెరికా ఆస్తి: 700 కోట్లు గుంథర్లాగా దీనికి వారసత్వంగా ఆస్తి రాలేదు. ఆ పిల్లి తన సొంత కాళ్లపై తాను నిలబడింది.కోటీశ్వరురాలైంది. దాని ముఖమే దానికి మనీ తెచ్చిపెట్టింది. ముఖం ముడుచుకున్నట్లు పెట్టే సీరియస్ లుక్ వల్ల బోలెడన్ని యాడ్లు వచ్చాయి. మోడలింగ్ చేసింది. సినిమాల్లోనూ నటించింది. 3 ఒలీవియా బెన్సన్ దేశం: బెన్సన్, అమెరికా ఆస్తి: 680 కోట్లు ప్రముఖ పాప్‌గాయని టేలర్ స్విఫ్ట్ పెంపుడు మార్జాలం. దాంతో ఆవిడలాగే దీనికీ క్రేజ్ వచ్చేసింది. తన యజమానితో కలిసి పలు యాడ్లలో నటించింది.ఇలా నాలుగు కాళ్లా సంపాదిస్తోంది. 4 శాడీ సన్నీ లారెన్ లేలా, ల్యూక్ దేశం: అమెరికా ఆస్తి: 210 కోట్లు టాక్‌షో క్వీన్ ఓప్రా విన్ఫ్రే బయటివాళ్లకే భారీ భారీ బహుమతులను ఇస్తూ ఉంటుంది. అలాంటిది తన ‘పంచ’ప్రాణాలకు ఇంకెంత ఖరీదైన బహుమతి ఇచ్చిందబ్బా అని చూస్తే.. ఏకంగా ఇదిగో ఇన్ని కోట్లు వాటికి రాసిచ్చేసి.. ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు వీలునామా రాసేసింది. 5 గిగూ దేశం: బ్రిటన్ ఆస్తి: 105 కోట్లు నిజం.. చివరికి కోడిపెట్ట కూడా కోటీశ్వరురాలే. ఎందుకంటే.. దీన్ని పెంచుకుంది బ్రిటీషు సంపన్నుడు మైల్స్ బ్లాక్ వెల్. 2011లో తాను చనిపోయే ముందు వీలునామా రాస్తూ.. దీన్ని కూడా కోటీశ్వరురాలిని చేసి పోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా జంతువులు మనుషులతో పోలిస్తే... మనీ విషయంలో ముందున్నాయి.మహారాజుల్లా బతికేస్తున్నాయి. టాప్–10 జాబితాలో బార్ట్ అనే ఎలుగుబంటి కూడా ఉంది.బార్ట్ నటుడు. ఆస్తి దాదాపు 50 కోట్లు.. అలాగే.. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పెంపుడు చింపాంజీ కూడా కాస్తో కూస్తో ఆస్తిపరురాలే. దాని ఆస్తి రూ.14 కోట్లు. ఈ మధ్య సొంతంగా కూడా సంపాదిస్తోందట. బొమ్మలు వేసి.. ఒక్కోటి లక్ష చొప్పున అమ్ముతోందట!! ఇప్పటికే వీటి ఆస్తుల వివరాలు చూసి.. మన మనసు అదో రకంగా అయిపోయి ఉంటుంది.. అందుకే ఈ ఆస్తిపాస్తుల చిట్టాకు ఫుల్స్టాప్ పెట్టేద్దామా మరి.. బై.. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
రండి.. దత్తత తీసుకోండి
సాక్షి, బెంగళూరు : మూడు రోజులుగా బెంగళూరులోని యశ్వంతపూర్‌లో పెట్ అడాప్షన్ అనే పెంపుడు కుక్కల ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు వచ్చిన వీక్షకులు తమకు నచ్చిన పెంపుడు కుక్కలను దత్తత చేసుకుని ఇంటికి తీసుకెళుతున్నారు. ఈ ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. పెడిగ్రీ, బెంగళూరు ఆప్షన్ టు అడాప్ట్, మెట్రో సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. -
అబ్బో.. అంత ఖరీదా?
సాక్షి,బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని ఉదయభాను క్రీడామైదానంలో స్వదేశీ, విదేశీ శునకాల ప్రదర్శన నిర్వహించారు. ఇది సాధారణం కంటే ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈ ప్రదర్శనలో ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ కడబమ్స్కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే టిబెటన్ మ్యాస్టిఫ్, ఆస్కాన్ మాలమ్యూట్, గ్రేట్ డేన్ తదితర విదేశీ జాతుల శునకాల ప్రదర్శనకు రావడమే. అందులో ముఖ్యంగా టిబెటన్ మ్యాస్టిఫ్ శునకం ప్రదర్శన మరింత ప్రత్యేకంగా నిలిచింది.ఆకారంలో అచ్చు సింహంలా ఉండే మ్యాస్టిఫ్ కుక్క కొనాలంటే అక్షరాలా రూ.2 కోట్లు చెల్లించాలి. గరిష్టంగా వీటి ధర రూ.10 కోట్ల వరకు పలుకుతుంది. ఇంత ధర, రూపం కలిగిన మ్యాస్టిఫ్ శునకం ఎంతో భయానక స్వభావం కలిగి ఉంటుందునకుంటే పొరబడినట్లే. ఆకారం భారీగా ఉండే ఈ శునకాలు కరవడం, కనీసం మొరిగే స్వభావం కూడా లేని మృదుస్వభావులు. దీంతో పాటు రూ.8 కోట్ల విలువ చేసే ఆస్కాన్ మాలమ్యూట్, రూ.1 కోటి విలువ చేసే కొరియన్ మ్యాపీ, రూ.6.50 లక్షల విలువ చేసే గ్రేట్‌డేన్ తదితర 20 విదేశీ జాతుల శునకాలను చూసి చూపరులు నోరెళ్లబెట్టారు. అది నా హాబీ: సతీష్ శునకాల యజమాని సతీశ్ మాట్లాడుతూ అత్యంత ఖరీదైన, అరుదైన జాతుల శునకాలను పెంచుకోవడం తమకున్న అలవాటని తెలిపారు. అంతర్జాలం ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి బ్రోకర్ల సహాయంతో అరుదైన, ఖరీదైన జాతుల శునకాలను తెప్పించుకొని వాటిని పెంచుకుంటున్నామన్నారు. శునకాల కోసమే బెంగళూరు నగర శివార్లలోని కనకపుర రోడ్లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా షెడ్‌ను నిర్మించామన్నారు. ప్రస్తుతం తమ వద్ద సుమారు 150 జాతుల శునకాలు ఉన్నాయన్నారు. ఇక అన్నింటికంటే ఖరీదైన టిబెటన్ మ్యాస్టిఫ్ జాతి శునకాలు టిబెటియన్ సింహాల జీన్స్ నుంచి ఉత్పత్తి అయిన శునకమని అందుకే వాటి ఆకారం,ఆహార్యం అచ్చు సింహాలానే ఉంటుందన్నారు.అందుకే వీటికి ప్రపంచంలో ఏ జాతి శునకాలకు లేని డిమాండ్ ఉంటుందని వీటి పోషణకు నెలకు రూ.25వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాస్టిఫ్ జాతి శునకాలకు నెలకు ఒకసారి మాత్రమే స్నానం చేయిస్తే చాలని, అప్పుడే వాటి చర్మం,వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయన్నారు. -
క్యూట్ డాగ్స్
-
మల్లారెడ్డిలో స్టూడెంట్స్ జోరు
-
హ్యాపీనెస్‌కి పెట్‌బడి
‘మా క్యూటీ తప్పిపోయిం’దంటూ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే.. ఆ క్యూటీ ఒక పెట్‌డాగ్ అని వెంటనే అర్థం చేసుకుని, ఆఘమేఘాలపై సదరు క్యూటీ గారిని పట్టి తెచ్చివ్వకపోతే ఠాణా పీకి పందిరి వేసినంత పనిచేసే వాళ్లు నగరంలో ఎందరో. ముచ్చటపడి పెంచుకుంటున్న శునకరాజం పరమపదిస్తే.. రోజుల తరబడి శోక సముద్రంలో మునిగిపోయేవాళ్లు, అంత్యక్రియలు సైతం నిర్వహించి, జ్ఞాపకార్థం సమాధులు నిర్మించే వారూ సిటీలో ఉన్నారు. అంతగా పెట్స్‌ని జీవన నేస్తాలుగా భావిస్తున్నవారు వాటి సంరక్షణ కోసం ఎంత వ్యయప్రయాసలైనా సిద్ధమంటున్నారు. నగరంలో నిర్వహిస్తున్న డాగ్షోస్...ఓనర్-పెట్ మధ్య బాండింగ్, వాటి ట్రైనింగ్ ప్రొసీజర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపకరిస్తున్నాయి . ‘కొన్నేళ్లుగా యజమానులు తమ ‘నేస్తా’లకు బెస్ట్ లైఫ్ అండ్ బెస్ట్ ఫుడ్‌ని అందించాలని కోరుకుంటున్నారు. ఆహారం, వసతి కోసం మనపైనే ఆధారపడే శునకాలకు సరైన ఫుడ్‌ని అందించడం, వాటిని ఆప్యాయంగా చూసుకోవడం మన బాధ్యతే’ అని మార్స్ ఇండియా (పెడిగ్రీ) డెరైక్టర్ శ్రీనితిన్ సూచిస్తున్నారు. ప్లై బాల్ కాంటెస్ట్, ఎడ్యుకేషన్ ఆన్ పెట్ కేర్, డాగ్స్‌ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పించే టిప్స్.. ఇవన్నీ డాగ్ షోలలో భాగమే. ఈ తరహా షోలకు విభిన్న రకాల జాతి శునకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ కెనన్ క్లబ్ ఆదివారం మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహించిన డాగ్‌షోలో దేశం నలుమూలల నుంచి ఏకంగా 40 రకాల బీడ్స్ 300 వరకు పాల్గొన్నాయి. ఇక్కడ పెట్స్‌తో కలసి కుటుంబ సపరివారంగా బయట గడిపే అవకాశాన్ని ఈ డాగ్ షో ద్వారా కల్పించారు. ఈ సందర్భంగా డాగ్ ఓనర్స్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించినప్పుడు పెట్స్‌తో తమ అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు. ..:: చల్లపల్లి శిరీష అదుంటే పం‘డాగే’... మా ఆయనకు పెట్స్ అంటే ప్రాణం. మా దగ్గర ‘జర్మన్ షెపర్డ్’ ఉంది. దాని పేరు ‘స్కై’. వాడు (స్కై) టవల్‌తో, ఫుట్‌బాల్‌తో భలే ఆడతాడు. స్కైకి ఇప్పుడు రెండున్నరేళ్లు. మేం ఏం తెచ్చుకున్నా వాడికీ తెస్తాం. పండక్కి మా బట్టల సంగతెలా ఉన్నా వాడికి మాత్రం కచ్చితంగా కొంటాం. - శ్రావణి , మలక్‌పేట ప్రైజ్‌లు తెచ్చే పెట్.. నా హనీ బ్రీడ్ పేరు ‘లాస ఆప్సో’. వాడికి మూడేళ్లు. రోజూ మమ్మల్ని నిద్ర లేపుతాడు. ఎవరైనా నన్ను ఎంత మంది పిల్లలంటే ముగ్గురని చెప్తాను. నాకు ఇద్దరు పిల్లలు. మూడోవాడు హనీగాడు. నా పిల్లలూ వాడిని ‘తమ్ముడూ’ అనే పిలుస్తారు. ఏది వండుకున్నా తొలి ముద్ద వాడికే. పెట్ షోస్‌లో 12 బెస్ట్ ప్రైజ్‌లు గెలుచుకున్నాడు. హీ ఈజ్ వెరీ క్రేజ్ అబౌట్ ఫొటోస్ అండ్ కెమెరా షూట్స్. - సునంద మిస్డ్ యూ మై డియర్... ప్రాజెక్ట్ పనిపై సిటీకి వచ్చా. నా ఫ్రెండ్ డాగ్ షో గురించి చెబితే ఇక్కడికొచ్చా. ఇన్ని రకాల బ్రీడ్స్‌ని ఒకే రూఫ్ కింద చూడటం తొలిసారి. మా హోం ప్లేస్‌కి వెళ్లాక ఇక్కడి ఫొటోలు, వీడియోలు నా ఫ్రెండ్స్‌కి చూపిస్తా. మా ఇంట్లోనూ పెట్ ఉంది. నౌ అయాం మిస్సింగ్ మై డాగీ!. - సబీనా, కాలిఫోర్నియా (యూ.ఎస్) -
అలరించిన డాగ్ షో
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : హన్మకొండలోని సెయింట్ పీటర్స హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన డాగ్‌షో అలరించింది. వివిధ రకాల శునకాలు పాల్గొ న్న ఈ ప్రదర్శనను నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కాకతీయ కెన్నల్ అసోషియేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో వరంగల్‌తోపాటు పలునగరాలకు చెంది న శునకాలు పాల్గొన్నాయి. శునకాల యజమానులు వాటితో ప్రదర్శనలు ఇప్పించారు. అంతర్జాతీయ జడ్డీ మాథ్యు సి జాన్ ఈ ప్రదర్శనలో జడ్జీగా వ్యవహరించి వాటిని పరిశీలించారు. అత్యుత్తమ ప్రదర్శనతోపాటు, ఆరోగ్యకరంగా ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాకతీయ కెన్నల్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.రామస్వామి, కార్యదర్శి వి.రమణారెడ్డి మాట్లాడుతూ కెన్నల్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా అనుబంధంగా తమ అసోషియేషన్ పనిచేస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో 28 జాతులకు చెందిన 133 డాగ్స్ పాల్గొనగా, ఇందులో వరంగల్ నుంచి 50 శునకాలు పాల్గొన్నాయి. ప్రదర్శనలో హైదరాబాద్ శ్రీనివాస్‌కు చెందిన డాగ్ రాట్వెల్లరీ ప్రథమ బహుమతి గెలుచుకుంది. హేమంత్(హైదరాబాద్)కు చెందిన జర్మన్ షెఫర్డ్ ద్వితీయ బహుమతి, ప్రవీణ్(హైదరాబాద్)కు చెందిన బిగేల్ తృతీయ బహుమతి పొందాయి. వరంగల్ ఆదిత్యకు చెందిన డాషౌండ్, అర్జున్‌కు చెందిన బ్రెడన్, కరణ్‌కు చెందిన బుల్మాసిఫ్, కృష్ణకు చెందిన ల్యాబెడ ర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వాటికి నిర్వాహకులు షీల్డ్‌లు బహుకరించారు. అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, హరి నాథ్, దేవేందర్, అనంతకృష్ణ పాల్గొన్నారు.