కొన్ని సందర్భాల్లో జంతువుల చేసే పనులు చూస్తే ఔరా అనిపిస్తుంది. మనుషులు ఆలోచనతో చేయలేని పనులను సైతం జంతువులు చేసి చూపిస్తాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని చేసి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలోని రోడ్డు ఆ సమయంలో రద్దీగా ఉంది. వాహనాలు బిజీ బిజీగా రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది చిన్నారులు రోడ్డు దాటడానికి సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఓ పెంపుడు కుక్క అక్కడికి వచ్చి వారికి సాయం అందించింది. రోడ్డును బ్లాక్ చేసి వాహనాలను ఆపి.. పిల్లలు రోడ్డుదాటేలా చూసుకుంది.
చిన్నారులు రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో డాగ్.. క్రాసింగ్ గార్డ్‌లాగా విధులు నిర్వహించింది. కార్లు ముందుకు కదులుతుంటే కుక్క గర్జిస్తూ వాటిని ఆపింది. ఈ క్రమంలో చిన్నారులు సురక్షితంగా రోడ్డు దాటారు. అనంతరం కుక్క కూడా రోడ్డు మీద నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. వీడియో ఆఫ్ ది డే, గ్రేట్ వారియర్ అంటూ కామెంట్స్ చేశారు.
This Will Make Your Day.❤️ pic.twitter.com/5MFETG4OA9
— Awanish Sharan (@AwanishSharan) July 30, 2022
ఇది కూడా చదవండి: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం.. ఈ వీడియో చూస్తే కాదనలేరు!
Comments
Please login to add a commentAdd a comment