సాక్షి, న్యూఢిల్లీ : మెత్తటి పరపులపై పడుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చుగానీ డబ్బున్న మహరాజులకు అదో లెక్కా! అయితే మనుషులు పడుకునేందుకు డబ్బుల గురించి లెక్క చేయలేకపోవచ్చుగానీ, కుక్కల కోసం పరుపులు కొనాలంటే, అందులో ఖరీదైనా పరువులు కొనాలంటే ఎంతటి మహరాజులకైనా లెక్కలెకుండా ఉంటుందా! ఇప్పుడు పెంపుడు కుక్కల పరుపులు కూడా పెద్ద బిజినెస్‌గా మారిపోయింది. అందులో రాయల్ పరుపుల సంగతి చెప్పక్కెర్లేదు. ఈ పరుపులను డిజైన్ చేయడానికి ప్రత్యేక డిజైనర్లు కూడా ముందుకు వస్తున్నారు.
ఈ పరుపులు భారతీయ కరెన్సీలో 95 వేల రూపాయల వరకు పలకడం విశేషం. వీటిని రాయల్ కేటగిరీగా పేర్కొంటున్నారు. ఆస్ట్రియా రాకుమారి కటాలిన్ జూ విండిజ్‌గ్రేజ్ ర్యాన్ వియెన్నాలో సొంత బ్రాండ్‌తో ఈ పరుపుల అమ్మకాలను ప్రారంభించారు. ఆమె తన పేరు స్ఫురించేలా ‘కేజెడ్‌డబ్లూ పెట్ ఇంటీరియర్స్’ దానికి పేరు పెట్టారు. వాటికి బుల్లి మంచం పరుపు నుంచి కాస్త పెద్ద మంచం పరుపు వరకు, నేల మీద వేసుకునే పరుపులను, వాటికి అనుగుణమైన మెత్తలను కూడా డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఈ పరుపులు 800 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి. వాటికి విడివిడి గౌషన్లు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చు కోవచ్చు. ఆ తర్వాత ఆమె పెంపుడు కుక్కలు ఆడుకునే ఆట వస్తువులతో ‘డాగ్ ఫర్నీచర్’ పేరిట వ్యాపారాన్ని విస్తరించారు.
మరో పరుపుల కంపెనీ ‘చార్లీ చాహు’ 800 రూపాయలకు విడుదల చేసిన ‘చార్లీ చాహు స్నగుల్ బెడ్’ పాశ్చాత్య దేశాల మార్కెట్‌లో పిచ్చ పిచ్చగా అమ్ముడుపోతోంది. అందుకు కారణం దాని ధర అందరికి అందుబాటులో ఉండడమే. చార్లీ చాహు కంపెనీని క్రిసై్టన్ చాహు తన సోదరి జెన్నీ చాహుతో కలసి ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కల కోసం ‘పిప్పా అండ్ కంపెనీ’ మధ్యస్థాయి లగ్జరీ పరపులను తయారీచేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటిని వాషింగ్ మషిన్‌లో వేసి ఉతికే అవకాశం కూడా ఉండడం విశేషం. పరుపులోని కుషన్‌కు వాసన, నీరు అంటకుండా నిలువరించగల లైనర్లను ఈ పరపుల తయారీలో ఉపయోగించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జెన్నీఫర్ టేలర్ తెలిపారు. ‘సిగ్నేచర్ బెడ్స్’ పిప్పా అండ్ కంపెనీ పేరిట పెంపుడు కుక్కల పరపులను సరఫరా చేస్తోంది.
కుక్కలకు కూడా ఖరీదైన పరుపులు
Published Thu, Jan 30 2020 2:04 PM | Last Updated on Thu, Jan 30 2020 2:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment