mango festival
-
అతిఖరీదైన మామిడి ధర వింటే షాకవుతారు, కేజీ 2.75 లక్షలు
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరుగుతున్న మ్యాంగో ఫెస్టివల్ 7వ ఎడిషన్ ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇక్కడ ప్రదర్శించారు. ఒక ప్రదర్శనలో ఉంచి మామిడి పళ్ల ఫోటోలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ధర వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ‘మియాజాకి’ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు. జూన్ 9న మొదలైన ఈ ఫెస్టివల్లో 262 రకాల మామిడి పండ్లను ప్రదర్శిస్తున్నారు. వీటిలో అతి ఖరీదేన మియాజాకి స్పెషల్‌గా నిలుస్తోంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో సిలిగురి టైమ్స్ నివేదించిన ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్కు చెందిన రైతు షౌకత్ హుస్సేన్ 10 మియాజాకి మామిడి ముక్కలను ప్రదర్శించారు. ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.75 లక్షలు. Siliguri, West Bengal | World's most expensive mango 'Miyazaki' priced at around Rs 2.75 lakh per kg in International market showcased in Siliguri's three days long 7th edition of the Mango Festival. The festival kicked off on June 9 at a mall in Siliguri organised by Modella… pic.twitter.com/GweBPkXons — ANI (@ANI) June 10, 2023 -
రియల్ చార్లీ777.. షో అదిరింది!
హోసూరు(బెంగళూరు): జిల్లా కేంద్రం క్రిష్ణగిరి ప్రభుత్వ బాలుర ఉన్నతోన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న 28వ అఖిల భారత మామిడి ప్రదర్శనలో ఆదివారం ఏర్పాటు చేసిన డాగ్‌షో అందరినీ అలరింపజేసింది. కార్యక్రమానికి ఆర్డీవో సతీష్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఆదివారం పశుసంవర్థక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన డాగ్‌షోలో గోల్డెన్‌రెడ్ రైవర్, జర్మన్ షపర్డ్, ల్యాబ్రడార్, రాట్‌వీలర్, టంపర్‌మేన్, టేక్‌శాండ్, క్రోటేన్, రాజపాళ్యం, కన్ని, సిప్పిపారై, కర్కార్, స్పోనియల్ తదితర 21 జాతులకు చెందిన 200కుపైగా శునకాలు పాల్గొన్నాయి. ప్రదర్శనకు తీసుకొచ్చిన శునకాలచే విన్యాసాలు చేయించారు. ప్రధానంగా పోలీసు శాఖ తీసుకొచ్చిన శునకాలచే సాహస కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా విన్యాసాల్లో పాల్గొని గెలుపొందిన కుక్కలకు బహుమతులందజేశారు. పశుసంవర్థక శాఖ మండల ఉపడైరెక్టర్ రాజేంద్రన్, డెప్యూటీ డైరెక్టర్ మరియ సుందర్, అరుళ్‌రాజ్, కలైయరసు, పీఆర్వో మోహన్, పశుసంవర్థక శాఖ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
నవాబుల నగరంలో రాజాఫలం రుచులు!
లక్నో: నవాబుల నగరంగా పిలిచే లక్నో... పర్యాటకులకు సరికొత్త రుచులను పరిచయం చేయనుంది. రాజఫలంగా పిలిచే మామిడిని, ఘుమఘుమలాడే బిర్యానీతో జోడించి ఆమ్ బిర్యానీ పేరుతో చేసిన సరికొత్త వంటకాన్ని మెనూలో చేర్చనున్నారు. అంతేనా... ముర్గ్ ఆమ్, ఆమ్ ముర్గ్ కుర్మా వంటి పేర్లతో పసందైన రుచుల్లో కోడికూర కూడా అతిథులకు అందించనున్నారు. ఈ నెల 7వ తేదీన ఉత్తరప్రదేశ్ పర్యాటకశాఖ నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్లో ఈ రుచులను పరిచయం చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌కు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల నుంచి భోజన ప్రియులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కొత్త రుచులను పరిచయం చేస్తున్నామని యూపీ పర్యాటకశాఖ కార్యదర్శి అవనీశ్ కుమార్ తెలిపారు. ఆమ్ మలాయ్ టిక్కా, ఆమ్ షాహీ పనీర్, ఆమ్ కలేజీ వంటి మరిన్ని వంటకాలను కూడా ఈ ఫెస్టివల్ మెనూలో చేరుస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యేవారికి మరపురాని మధుర స్మృతులను మిగల్చడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. మొఘలాయీ వంటకాల రుచికి పెట్టింది పేరైన లక్నోలో ఈ కొత్త రుచులను పరిచయం చేయడం ఇదే తొలిసారని కుమార్ తెలిపారు. -
ఘనంగా మ్యాంగో ఫెస్టివల్
వడోదర: గుజరాత్ లోని వడోదరలో మ్యాంగో ఫెస్టివల్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కళ్యాణ్ రాయిజీ దేవాలయంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు పాతిక వేల బుట్టల మామిడి పళ్ల ను శ్రీ కృష్ణునికి నైవేద్యంగా సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన మామిడి పళ్లతో దేవాలయప్రాంగణమంతా కళకళలాడింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు,పురుషులు సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక మామిడిపళ్లను స్వామికి సమర్పించారు. వడోదరలో కన్నుల పండుగా నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్ ను వేలాదిమంది భక్తులు తిలకించి , ప్రసాదాన్ని స్వీకరించారు. 50 వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్భించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.