పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరుగుతున్న మ్యాంగో ఫెస్టివల్ 7వ ఎడిషన్ ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇక్కడ ప్రదర్శించారు. ఒక ప్రదర్శనలో ఉంచి మామిడి పళ్ల ఫోటోలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ధర వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే.
ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ‘మియాజాకి’ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు. జూన్ 9న మొదలైన ఈ ఫెస్టివల్‌లో 262 రకాల మామిడి పండ్లను ప్రదర్శిస్తున్నారు. వీటిలో అతి ఖరీదేన మియాజాకి స్పెషల్‌గా నిలుస్తోంది.
ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో
సిలిగురి టైమ్స్ నివేదించిన ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌కు చెందిన రైతు షౌకత్ హుస్సేన్ 10 మియాజాకి మామిడి ముక్కలను ప్రదర్శించారు. ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.75 లక్షలు.
Siliguri, West Bengal | World's most expensive mango 'Miyazaki' priced at around Rs 2.75 lakh per kg in International market showcased in Siliguri's three days long 7th edition of the Mango Festival.
— ANI (@ANI) June 10, 2023
The festival kicked off on June 9 at a mall in Siliguri organised by Modella… pic.twitter.com/GweBPkXons
Comments
Please login to add a commentAdd a comment