గుజరాత్ లోని వడోదరలో మ్యాంగో ఫెస్టివల్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు.
వడోదర: గుజరాత్ లోని వడోదరలో మ్యాంగో ఫెస్టివల్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కళ్యాణ్ రాయిజీ దేవాలయంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు పాతిక వేల బుట్టల మామిడి పళ్ల ను శ్రీ కృష్ణునికి నైవేద్యంగా సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన మామిడి పళ్లతో దేవాలయప్రాంగణమంతా కళకళలాడింది.
చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు,పురుషులు సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక మామిడిపళ్లను స్వామికి సమర్పించారు. వడోదరలో కన్నుల పండుగా నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్ ను వేలాదిమంది భక్తులు తిలకించి , ప్రసాదాన్ని స్వీకరించారు. 50 వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్భించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.