offered
-
అమ్మవారికి నాలుక సమర్పించిన భక్తుడు
భింద్: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భక్తులు అమ్మవారికి కానుకలు చెల్లించుకోవడంతో పాటు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, తన భక్తిని చాటుకున్నాడు.మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గల రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. రతన్గర్ దేవి ఆలయం భిండ్‌లోని లాహర్ నగర్లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన రామ్‌శరణ్ భగత్ తన నాలుకను తెగ్గోసుకుని, అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలుపల ఉంచిన పాత్రలో పోశాడు. దీనిని చూసిన అక్కడివారంతా తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు. ఇది కూడా చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా.. -
అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు! ఎందుకంటే.
మన హిందూ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఆ దేవాలయ ప్రసాదాలంటే చాలా ఇష్టపడతారు కూడా. అందుకోసం గుడికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేవాలయంలో దేవుడికి రాళ్లనే నైవేద్యంగా పెడతారట. పైగా అలా చేస్తే అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అక్కడ వారి నమ్మకం. వివరాల్లోకెళ్తే..శ్రీకాకుళం జిల్లా షేర్ మహ్మద్‌పురం గ్రామంలో ఈ వింత ఆచారం నెలకొంది. అక్కడ గ్రామస్తులు దేవుడికి నైవేద్యంగా ఏదోఒక రాయిని సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు స్థానికులు. వాళ్లు ఆ దేవుడిని 'వీరుడి తాతగా' కొలుస్తారు. నిజానికి అక్కడ దేవాలయం గానీ దేవుని విగ్రహం కానీ ఉండదు. అక్కడ గుట్టగా.. భక్తులు నైవేద్యంగా సమర్పించిన రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అక్కడే సమీపంలో ఉండే వేపచెట్టునే దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడిని వీరుడి తాతగా పిలుస్తుంటారు. ఆ ప్రాంతంలో కుమ్మరి వాళ్లు ఉండేవారని, ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు కుండలు తయారు చేసి పెద్ద ఊరేగింపుగా వచ్చి ఈ ప్రాంతంలో ఉండేవారని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమేణ ఆ ప్రాంతాన్ని వీరుడి తాతగా కొలవడం ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తూ ఆ స్వామికి ఏదో ఒక రాయిని సమర్పించి వెళ్తే తక్షణమే పని అవుతుందని వారి ప్రగాఢ నమ్మకం. అది కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టు పక్కడ గ్రామస్తులు సైతం ఇక్కడకు వచ్చి రాళ్లను సమర్పిస్తుంటారు. ఈ ప్రదేశం సరిగ్గా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. అత్యంత విలువైన ఈ ప్రదేశం పక్కన ఉన్న కొంత జాగా(నాలుగుసెంట్లు భూమిని) ఆ దేవుడి కోసం గ్రామస్తులు వదిలేశారు. ఈ ప్రదేశంలోనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. వినడానికి నమ్మశక్యం కాని విధంగా వింతగా ఉంది కదూ ఈ ఆచారం. ఏదీఏమైన మనిషి నమ్మకమే దేవుడు అని మరోసారి ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. (చదవండి: యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?) -
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన
-
దేశంలో బంగారం ధరలు తగ్గాయ్, తొలిసారే ఇలా
జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చు తగ్గులతో దోబూచులాడుతున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో నమోదవుతున్న వేరియంట్ కేసులు, అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం పసిడి ధరలపై చూపిస్తోంది. దీంతో జులై నెల ప్రారంభం నుంచి తారాస్థాయిలో ఉన్న ధరలు జులై 17 నాటికి కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం రోజు నాటికి పసిడి ధరలపై బంగారం వ్యాపారాలు ఆఫర్లు ప్రకటించారు. గత వారం ప్రీమియంతో పోలిస్తే ఈవారం ఔన్స్ బంగారం ధరను 5 డాలర్ల వరకు తగ్గింది.మనదేశంలో గరిష్ట స్థాయిలో రూ. 48,389 వద్ద ఉండగా శుక్రవారం 10 గ్రాములకి రూ.48,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్ లో బంగారం ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగో సారి లాభాల బాటపట్టాయి. యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటికి ఔన్స్ ధర 1815 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది.ద్రవ్యోల్బణం మందగమనంలో ఉన్నప్పటికి యుఎస్ ఆర్థిక వ్యవస్థకు సెంట్రల్ బ్యాంక్ మద్దతు ఇవ్వడాన్ని పావెల్ సమర్థించారు. ధరల ఒత్తిడిని తాత్కాలికంగా చూస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పసిడి ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి : తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా -
కేరళ ఆఫర్‌కు ఓకే చెప్పిన 'మహా' సర్కార్
ముంబై : మహారాష్ర్టలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ..కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి అత్యవసరంగా వైద్యలను పంపాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో అత్యధికంగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తుండటం, వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో శిక్షణ పొందిన 50 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 100 మంది నర్సులను వెంటనే రాష్ర్టానికి పంపిల్సిందిగా కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి? ) అయితే మహారాష్ర్టలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతకుముందే కేరళ.. మా దగ్గర తగినంత వైద్య సిబ్బంది ఉన్నారు. మీకు కావాలంటే వెంటనే సహాయం అందిస్తాం అని పేర్కొంది. దీంతో మహా సర్కార్ అధికారిక లేఖ ద్వారా వైద్యలను పంపమని కోరగా, వెంటనే కేరళ ప్రభుత్వం దానికి అంకరించింది. ఆదివారం నాటికి మహారాష్ర్టలో 3,041 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, 58 మంది మరణించారు. ఇప్పటివరకు మహారాష్ర్టలో నమోదైన మొత్తం కరోనా కేసులు 50,231 ఉండగా, ప్రస్తుతం 33,988 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ర్టంలో ఇప్పటివరకు 14,600 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది. -
అందరూ నా వెనకున్న ఆస్తినే చూశారు..
ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. జీవితమంతా కష్టపడి సంపాదించిన 50 లక్షల రూపాయాలను భారత సైన్యానికి అందించారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా బతుకుతున్నారు. 77 ఏళ్ల వయస్సులో వృద్దాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? ఆయన కొచ్చిన కష్టం ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. సాక్షిప్రతినిధులు బత్తిన ధర్మయ్య గౌడ్ (మఠంపల్లి), కీత రామనాధం (హుజూర్నగర్ రూరల్) -
వ్యాపారానికి చిన్న... ఔదార్యంలో పెద్ద
ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు.. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. తాను వృద్ధాశ్రమంలో ఉంటూ.. కష్టపడి సంపాదించిన రూ.50 లక్షలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా. సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి రూ.50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్ అందజేశారు. 78 సంవత్సరాల వయసులో, మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్ల్లదీస్తున్న విశ్వనాథం ‘‘యాభై ఏళ్లు వ్యాపారంలో ఎంతో సంపాదించా.. నేను పుట్టిన తీగుళ్ల (జగదేవ్‌పూర్)తో పాటు నేను పెరిగి, వ్యాపారం చేసిన హుజూర్నగర్ ప్రాంతంలోనూ అనేక దేవాలయాలకు ఆర్థిక సహాయం చేశా.. కానీ ఈ చరమాంకంలో దేశంకోసం పోరాడుతున్న సైన్యం, వారి కుటుంబాలకు నాకు తోచిన సహాయం చేయాలని పించింది. మిత్రుడు లక్ష్మణరావు సహకారంతో సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ను సంప్రదించి రూ.50 లక్షలను గవర్నర్ చేతుల మీదుగా సైన్యానికి విరాళమిచ్చా.. ఈ రోజు చేసిన పనే నాకు అత్యంత సంతృప్తిని కలిగిస్తోంది’ అని సాక్షితో చెప్పారు. ఇదే విషయమై సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్ మాట్లాడుతూ విశ్వనాథం భూరి విరాళం ఈ సమాజంలోని అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. -
దేవుడి హుండీలో ఐఫోన్ 6..
సాక్షి, కృష్ణా : సాధారణంగా ఆలయాల హుండీల్లో భక్తులు డబ్బులు, బంగారు ఇతర విలువైన కానుకలు వేస్తారు. కానీ, కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రసిద్ధ శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయ హుండీలో ఎవరో భక్తుడు ఖరీదైన యాపిల్ ఐ ఫోన్ 6ను కానుకగా వేశారు. శనివారం ఆలయ అధికారులు హుండీని తెరిచి అందులో ఐఫోన్ చూసి ఆశ్చర్యపోయారు.. గతంలో భక్తుల ఫోన్లు అనుకోకుండా హుండీలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ఆలయ సూపరింటెండెంట్ అధికారి తెలిపారు. అయితే, ఈ ఫోన్ కొత్తదని సీలు కూడా తీయలేదని గ్యారంటీ కార్డ్ కూడా అందులో ఉందని చెప్పారు. కొత్త మెబైల్ దుకాణాన్ని ప్రారంభించిన భక్తుడు ఎవరో దేవుడికి ఈ కానుక వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఖరీదైన ఫోన్‌ను ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి తాము లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫోన్‌ను వేలం వేసి వచ్చిన ఆ డబ్బును ఆలయ ఖాతాలో జమ చేయాలా? లేదా ఫోన్‌ను భక్తులకు సమాచారం అందించేందుకు రిసెప్షన్లో ఉంచాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. -
జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!
నాగ్ పూర్ః తప్పిపోయిన పులి ఆచూకీ తెలియాలంటూ ఇప్పటికే జనం పూజలు చేస్తుండగా.. మహరాష్ట్ర ప్రభుత్వం జై.. ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఉమ్ రెడ్-కర్హండా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి జై.. ఆచూకీ కోసం ఇప్పటికే ప్రభుత్వం.. అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రివార్డు ప్రకటించింది. నాగ్ పూర్ అభయారణ్యం నుంచి ఈ యేడాది ఏప్రిల్ 18న ఏడేళ్ళ వయసున్న భారీకాయం గల పెద్దపులి జై.. తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుతుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరించే ప్రదేశం వంటి వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని, తెలిపినవారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల బహుమానాన్ని ప్రకటించింది. అటవీశాఖ శుక్రవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ టైగర్స్ డే' సందర్భంగా అడవి నుంచీ తప్పిపోయిన పులి ఎప్పటికైనా తిరిగివస్తుందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని సమాచారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. పెద్దపులి ఆచూకీకోసం ప్రజలు పడుతున్న తాపత్రయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జై.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని అమితంగా చూరగొంది. రాచరికాన్ని ప్రదర్శించే జీవన విధానం, భారీ శరీరాకృతి కలిగిన జై... పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జై.. సుమారు 250 కేజీల బరువుంటుంది. ఇప్పటికే స్థానికులు జై.. ఆచూకీకోసం ప్రార్థనలు, పూజలు చేస్తుండగా... 100 మంది వరకూ జనం, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛందంగా గాలిస్తున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జై.. ఆచూకీకోసం ప్రయత్నించాలని అటవీ అధికారులు సైతం కోరారు. శాంక్చరీ టోపోగ్రఫీ తెలిసిన బృందం ద్వారా కూడా పులి ఆచూకీ తెలుసుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవయ్య పరకాల : ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్యంతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సంజీవయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు నెలవారీగా టార్గెట్లుగా 30 కాన్పులు చేయాల్సి ఉండగా, అన్ని లక్ష్యాన్ని దాటాయన్నారు. రాష్ట్రంలోనే మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు ఏ గ్రేడ్‌లో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో డెలివరీ కోసం ఆధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని ఆస్పత్రులకు 10 కేవీ జనరేటర్ల అందిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. శిశువు మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదు.. పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఈనెల 24వ తేదీన మృతి చెందిన శిశువు మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మ నీరు తాగడంతోనే శిశువు మృతి చెందిందన్నారు. సమావేశంలో ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి, డాక్టర్లు పద్మజ, స్వప్నలత, సిరంగి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
పులికోసం పూజలు!
నాగ్ పూర్ః తప్పిపోయిన మనుషులు, పెంపుడు జంతువులకోసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడం చూస్తాం. ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టడం వింటాం. అయితే అభయారణ్యాల్లో నివసించే జంతుజాలం కనిపిస్తే వేటాడటమే తప్పించి... కబురు చెప్పమంటూ ప్రకటనలు ఇవ్వడం, నగదు బహుమతులు ప్రకటించడం ఎక్కడైనా చూశారా? నాగ్‌పూర్‌లోని ఉమ్రెడ్-కర్హండ్లా అభయారణ్యం ప్రాంతంలో అదే జరిగింది. తప్పిపోయిన ప్రముఖ పులి జాయ్ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించడమే కాదు.. అది ఎలాగైనా తిరిగి రావాలంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్ రెడ్-కర్హండ్లా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి 'జాయ్' కోసం నాగపూర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 18 నుంచీ కనిపించకుడా పోయిన జాయ్ ( పులి) ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని ఇస్తామంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంతకు ముందే ప్రకటించగా.. జాయ్ తిరిగి రావాలని కోరుకుంటూ కొందరు అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18న జాయ్ తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారంకోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరిస్తున్న ప్రదేశం వంటి వివరాలు ఏవి తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జాయ్.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని చూరగొంది. భారీ శరీరాకృతి, రాచరికాన్ని ప్రదర్శించే తీరులో జీవన విధానం కలిగి ఉండే జాయ్... చూపరులను కళ్ళు తిప్పుకోకుండా చేసేది. అభయారణ్యానికి వచ్చిన దగ్గరనుంచీ విదేశీయులతో సహా అనేక మంది పర్యటకులను ఆకట్టుకుంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జాయ్... సుమారు 250 కేజీల దాకా బరువుంటుంది. అటువంటి ప్రముఖ పులి ఆ ప్రాంతంలో కనిపించకుండా పోవడంతో దాని ఆచూకీకోసం అనేక రకాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ ఖర్గే ఆదేశాల మేరకు.. అధికారులు జాయ్ కోసం ప్రత్యేక సెర్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాయ్ పాదముద్రలు ట్రేస్ చేసేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అటవీ సిబ్బందికి అధికారులు సూచించారు. ఇప్పటికే 100 మందివరకూ వ్యక్తులు, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా జాయ్ కోసం శోధిస్తుండగా... వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జాయ్ ను వెతికేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. -
ఘనంగా మ్యాంగో ఫెస్టివల్
వడోదర: గుజరాత్ లోని వడోదరలో మ్యాంగో ఫెస్టివల్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కళ్యాణ్ రాయిజీ దేవాలయంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు పాతిక వేల బుట్టల మామిడి పళ్ల ను శ్రీ కృష్ణునికి నైవేద్యంగా సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన మామిడి పళ్లతో దేవాలయప్రాంగణమంతా కళకళలాడింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు,పురుషులు సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక మామిడిపళ్లను స్వామికి సమర్పించారు. వడోదరలో కన్నుల పండుగా నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్ ను వేలాదిమంది భక్తులు తిలకించి , ప్రసాదాన్ని స్వీకరించారు. 50 వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్భించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
భద్రాచలంలో గోదావరి నదికి హరతి
-
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త. ఫేస్ బుక్ లో ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఉద్యోగులు (పురుషులు) నాలుగు నెలల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మినహా ఇతర ప్రాంతాల్లో ఇంతకు ముందు నాలుగువారాలు మాత్రమే ఉన్న పితృత్వ సెలవు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్నవారందరికీ నాలుగు నెలల పాటు మంజూరు చేసింది. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్.. సోషల్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న తండ్రులంతా తమ శిశువులతో బంధాన్ని పెంచుకునేందుకు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచీ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. 'మా పేరెంటల్ లీవ్ పాలసీస్ కు అనుగుణంగా మేమీ నిర్ణయం తీసుకున్నాం' అని ఫేస్ బుక్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి లోరీ మెట్లాఫ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సెలవులను పిల్లలు పుట్టిన తర్వాత లేదా దత్తత తీసుకున్న సంవత్సరం లోపు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫేస్ బుక్ ఇప్పటికే శిశువుల పెంపకానికి సహాయంగా ఇరవై లక్షల రూపాయల వరకూ బోనస్ ను కూడా అందిస్తోంది. గత నెల్లో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్.. తన భార్య ప్రిసిల్లా మొదటి సంతానానికి జన్మనివ్వడంతో రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే... పిల్లలు పుట్టిన సమయంలో వారితో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని అధ్యయనాలు కూడ చెబుతున్నాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ఉద్యోగులు వారికిచ్చే నాలుగు నెలల పెటర్నిటీ, లేదా మెటర్నిటీ సెలవును సంవత్సరం లోపు వారికి అవసరమైన విధంగా విడదీసి వాడుకునే వీలు కల్పిస్తోంది.