జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చు తగ్గులతో దోబూచులాడుతున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో నమోదవుతున్న వేరియంట్ కేసులు, అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం పసిడి ధరలపై చూపిస్తోంది. దీంతో జులై నెల ప్రారంభం నుంచి తారాస్థాయిలో ఉన్న ధరలు జులై 17 నాటికి కాస్త తగ్గుముఖం పట‍్టాయి.
శనివారం రోజు నాటికి పసిడి ధరలపై బంగారం వ్యాపారాలు ఆఫర్లు ప్రకటించారు. గత వారం ప్రీమియంతో పోలిస‍్తే ఈవారం ఔన్స్ బంగారం ధరను 5 డాలర‍్ల వరకు తగ్గింది.మనదేశంలో గరిష్ట స్థాయిలో రూ. 48,389 వద్ద ఉండగా శుక్రవారం 10 గ్రాములకి రూ.48,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్ లో బంగారం ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగో సారి లాభాల బాటపట్టాయి.
యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటికి ఔన్స్ ధర 1815 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది.ద్రవ్యోల్బణం మందగమనంలో ఉన్నప్పటికి యుఎస్ ఆర్థిక వ్యవస్థకు సెంట్రల్ బ్యాంక్ మద్దతు ఇవ్వడాన్ని పావెల్ సమర్థించారు. ధరల ఒత్తిడిని తాత్కాలికంగా చూస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పసిడి ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చదవండి : తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా
Comments
Please login to add a commentAdd a comment