dealership
-
బ్రెజిల్లో దూసుకెళ్తున్న బీవైడీ.. 5000 మందికి ఉద్యోగాలు!
చైనా కార్ల తయారీ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రెజిల్లో తన 100వ డీలర్షిప్ ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 250కి పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.బ్రెజిల్లో బీవైడీ 100వ డీలర్‌షిప్‌ను ఫ్లోరియానోపోలిస్ డౌన్టౌన్లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బ్రెజిల్లో బీవైడీ సేల్స్ నెట్వర్క్ కింద 39 డీలర్ గ్రూపులను కలిగి ఉంది. అంతే కాకుండా 100 స్టోర్లను, 135 అవుట్లెట్ల కలిగి ఉన్నట్లు సమాచారం.రాబోయే రోజుల్లో కంపెనీ బ్రెజిల్లో మరో 150 కొత్త స్టోర్లను నిర్మించనుంది. 2024 చివరి నాటికి 250 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలంటే.. నెలకు కనీసం 19 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రెజిల్లో తన ఉనికిని విస్తరిస్తూ.. విక్రయాల నెట్వర్క్ పెంచడానికి కంపెనీ యోచిస్తోంది.బీవైడీ కంపెనీ బ్రెజిల్లో అతి పెద్ద తయారీ సైట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ చాసిస్, కొత్త ఎనర్జీ ప్యాసింజర్ కార్ ప్రొడక్షన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మెటీరియల్ వంటి వాటిని తయారు చేస్తుంది. ఇక్కడ ఏడాదికి 1,50,000 యూనిట్ల కార్లను (ఎలక్ట్రిక్, హైబ్రిడ్) తయారు చేయనున్నట్లు, స్థానికంగా 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు సమాచారం.బీవైడీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఉత్పత్తి ఈ ఏడాది చివరి నుంచి లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో బీవైడీ డాల్ఫిన్, సాంగ్ ప్లస్, యువాన్ ప్లస్, డాల్ఫిన్ మినీ వంటి కార్లను తయారు చేయనుంది. -
పాత బైకుకి రెట్టింపు ధర ఆఫర్ చేసిన డీలర్షిప్ - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్100, బజాజ్ చేతక్, టీవీఎస్ సుజుకి సమురాయ్ వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్స్‌గా ప్రసిద్ధి చెందాయి. అయితే కాలక్రమంలో కొత్త బైకులు పూత్తుకు రావడంతో.. పాత బైకులకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి కూడా చాలామంది ఈ బైకులను వినియోగిస్తున్నారు. కాగా ఇటీవల టీవీఎస్ డీలర్షిప్ రెట్టింపు ధరతో ఒక పాత బైకుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేరళలోని టీవీఎస్ డీలర్షిప్ ప్రతినిధి మిస్టర్ మోటార్ వాల్ట్ వారి యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. కస్టమర్ 27 సంవత్సరాల క్రితం టీవీఎస్ సుజుకి సమురాయ్ బైక్ కొనుగోలు చేసాడు, దానిని ఇప్పటి వరకు కూడా వినియోగిస్తున్నారు. ఈ 27 సంవత్సరాల్లో ఇతర బ్రాండ్ బైకుని కొనుగోలు చేయలేదు. కస్టమర్ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ దాని అసలు ధరకంటే రెట్టింపు ధరకు సొంతం చేసుకున్నాడు. ఈ బైకుని అతడు కొనుగోలు చేసిన సమయంలో ధర రూ. 21,000. కానీ డీలర్షిప్ వారు దీన్ని రూ. 41,000లకు కొన్నారు. అంటే ఆ కస్టమర్ కొన్న కొత్త బైకు ధరలో రూ. 41 వేలు తగ్గింపు కల్పించారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12మందిపై కేసు నమోదు.. కారణం ఇదే! కస్టమర్ ఏ బైక్ కొనుగోలు చేసిందనే విషయం వెల్లడి కాలేదు. కానీ కొన్న ధరకు రెట్టింపు ధర లభించడంతో కస్టమర్ చాలా ఆనందించాడు. ఈ రోజు కొని నెల రోజుల తరువాత విక్రయిస్తేనే అసలు ధర రాని ఈ రోజుల్లో రెట్టింపు ధర రావడం అనేది గొప్పవిషయమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్షిప్ - రూ.61 లక్షలు రీఫండ్!
కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది. కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్‌షిప్‌ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్‌షిప్‌కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. -
దేశంలో బంగారం ధరలు తగ్గాయ్, తొలిసారే ఇలా
జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చు తగ్గులతో దోబూచులాడుతున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో నమోదవుతున్న వేరియంట్ కేసులు, అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం పసిడి ధరలపై చూపిస్తోంది. దీంతో జులై నెల ప్రారంభం నుంచి తారాస్థాయిలో ఉన్న ధరలు జులై 17 నాటికి కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం రోజు నాటికి పసిడి ధరలపై బంగారం వ్యాపారాలు ఆఫర్లు ప్రకటించారు. గత వారం ప్రీమియంతో పోలిస్తే ఈవారం ఔన్స్ బంగారం ధరను 5 డాలర్ల వరకు తగ్గింది.మనదేశంలో గరిష్ట స్థాయిలో రూ. 48,389 వద్ద ఉండగా శుక్రవారం 10 గ్రాములకి రూ.48,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్ లో బంగారం ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగో సారి లాభాల బాటపట్టాయి. యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటికి ఔన్స్ ధర 1815 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది.ద్రవ్యోల్బణం మందగమనంలో ఉన్నప్పటికి యుఎస్ ఆర్థిక వ్యవస్థకు సెంట్రల్ బ్యాంక్ మద్దతు ఇవ్వడాన్ని పావెల్ సమర్థించారు. ధరల ఒత్తిడిని తాత్కాలికంగా చూస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పసిడి ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి : తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా -
‘స్పీడ్ లాక్’ పేరిట మోసం
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో భాగంగా రవాణ శాఖ వాహనాల వేగ నియంత్రణపై దృష్టి పెట్టింది. 2015కు ముందు తయారైన అన్ని రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నెర్స్ అమలు చేస్తోంది. ఈ నిబంధనను క్యాష్ చేసుకున్న ఢిల్లీకి చెందిన సంస్థ స్పీడ్ కంట్రోల్ పరికరాల సరఫరా డీలర్ షిప్ పేరుతో ఎరవేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది నుంచి దండుకుని మోసం చేసింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ సంస్థతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంస్థ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా 60 మంది వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2015 తర్వాత తయారవుతున్న వాహనాలకు ఈ పరికరాలు ఉంటున్నా అంతకుముందు వాహనాలకు లేదు. దీంతో ఇప్పుడు వీటిని ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర రవాణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు కంపెనీలకే అనుమతి.. ఈ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును 3 కంపెనీలకు అప్పగించారు. ఆటోమోబైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి కేంద్రం గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థల ధ్రువీకరించిన కంపెనీలకే ఈ అనుమతి ఉంది. ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా 37 ఎస్‌ఎల్‌డీ తయారీ కంపెనీలను సర్టిఫై చేశాయి. రాష్ట్రంలో ఈ పరికరాలు సరఫరాకు కాన్వెర్జ్, మెర్సిడా, క్రిసాల్ కంపెనీలకే ఆర్టీఏ అనుమతి ఇచ్చింది. అయితే తమ కంపెనీకి దేశ వ్యాప్తంగా ఎస్‌ఎల్‌డీల సరఫరా చేయడానికి అనుమతి ఉందని, ఇప్పటికే అనేక రాష్ట్రాలకు అందిస్తున్నామని ఢిల్లీకి చెందిన రోస్‌మెర్‌ట్రా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రచారం చేసుకుంది. దీని ప్రతినిధిగా అసిస్టెంట్ డెవలప్మెంట్ మేనేజర్ సాయిరాం కొండాపూర్‌కు చెందిన సదాత్ రాజ్‌ను సంప్రదించాడు. రూ.12 లక్షలు చెల్లిస్తే డీలర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికాడు. కొంత కాలం తర్వాత ఆ కంపెనీ జీఎం మనోజ్‌తో కలసి వెళ్లిన సాయిరాం మరోసారి సదాత్ రాజ్‌ను కలిశారు. డీలర్షిప్ తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందని నమ్మబలకడంతో రూ.2 లక్షలే చెల్లిస్తానని చెప్పాడు. దీనికి కంపెనీ ప్రతినిధులు అంగీకరించడంతో ఈ ఏడాది ఆగస్టు 21న కంపెనీ ఖాతాకు రూ.లక్ష బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాయిరాం, మనోజ్‌ల నుంచి స్పందన లేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన సదాత్ రాజ్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రోస్‌మెర్‌ట్రా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఏడీఎం సాయిరాం, జీఎం మనోజ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ ఇక..బయోమెట్రిక్
బెల్లంపల్లి : రేషన్ సరకుల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా సరుకుల పంపిణీలో సాగిన అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడుతుంది. ఈ విధానంతో సరకుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఫౌరసరఫరాల శాఖ భావిస్తుంది. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 200 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా నిర్ధేశించిన ప్రకారం లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అందుతున్న సరకులు నిత్యం ఏదో ఓ రూపంలో పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారులు రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకోకున్నా పంపిణీ చేసినట్లు రికార్డులు రాసుకోవడం, ఏదేనీ కారణంతో సరుకులు ఓ నెల తీసుకెళ్లకున్నా తీసుకున్నట్లు నమోదు చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సరుకులు వంద శాతం లబ్ధిదారులకు దక్కడం లేదనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. బయోమెట్రిక్ విధానం.. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధా నం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కా రం లేకుండా ఎంతో పారదర్శకంగా సరుకులను లబ్ధిదారులకు అందించాలని నిర్ధేశించింది. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఇకపై విధిగా రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలి ముద్ర వేస్తే కానీ సరుకులు పంపిణీ కావు. కార్డుదారు సంతకం సరిపోలితేనే సరుకులు అందిస్తారు. ఇతరులు మళ్లీ సరుకులు పంపిణీ చేయాలని అడిగినా లేదా డీలర్ చేతి వాటం ప్రదర్శించడానికి యత్నించినా కుదరని పరిస్థితులు ఉంటాయి. డీలర్లకు అవగాహన.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ విధానంపై రేషన్ డీలర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. బయోమెట్రిక్ యంత్రం వినియోగంపై తహసీల్దార్ ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. యంత్రం వినియోగించే తీరు, లబ్ధిదారు వివరాల నమోదు, వేలి ముద్రలు తీసుకునే పద్ధతి, సరుకుల వివరాలను నమోదు చేసే పద్ధతి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చాలామట్టుకు డీలర్లకు ఈపాటికే బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ఆ యంత్రం వినియోగంపై డీలర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బయో మెట్రిక్ విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 1 నుంచే రేషన్ సరకుల పంపిణీలో బయోమెట్రిక్ విధానం రానుంది. దీనివల్ల కొంతవరకైనా సరుకుల పంపిణీలో అవకతవకలు నివారించే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. -
మళ్లీ మాసెరటి లగ్జరీ కార్లు
అందుబాటులోకి నాలుగు మోడళ్లు - ధరలు రూ.1.14 కోట్ల నుంచి రూ.2.2 కోట్లు - త్వరలో హైదరాబాద్‌లో డీలర్షిప్ న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ మాసెరటి మళ్లీ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారత్‌లో రూ.2.2 కోట్ల వరకూ ధరలున్న నాలుగు కార్ల మోడళ్లను అందించాలని యోచిస్తోంది. సెప్టెంబర్ కల్లా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని మాసెరటి హెడ్(భారత కార్యకలాపాలు) బోజాన్ జన్కులోవ్స్కీ చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నైలకు వీటిని విస్తరిస్తామని వివరించారు. సీబీయూ రూపంలో దిగుమతి... 2011లో భారత్‌లోకి ప్రవేశించిన ఈ కంపెనీ డీలర్ భాగస్వామితో వచ్చిన సమస్యల కారణంగా తన కార్ల విక్రయాలను ఆపేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ భారత్‌లోకి అడుగిడుతోంది. భారత్‌లో ఎక్స్‌క్లూజివ్ లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే భారత మార్కెట్లోకి మళ్లీ ప్రవేశిస్తున్నామని బోజాన్ పేర్కొన్నారు. భారత్‌లో నాలుగు మోడళ్లు... క్వాట్రోపోర్టే, ఘిబ్లి, గ్రాన్ట్యురిజ్మో, గ్రాన్క్యాబ్రియో అందించాలని యోచిస్తున్నామని చెప్పారు. ఈ మోడళ్ల ధరలు రూ.1.14 కోట్ల నుంచి రూ.2.2 కోట్ల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఇటలీలో పూర్తిగా తయారైన కార్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ల(సీబీయూ)రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఎస్‌యూవీని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
నేనేం పాపం చేశానయ్యా...!
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర రోడ్లు, భవనాల రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గంలో గత 28 సంవత్సరాలుగా రేషన్ దుకాణం నిర్వహించుకుంటున్న ఓ వికలాంగుడి డీలర్‌షిప్‌ను రద్దు చేసి మరొకరి ఇచ్చేయడంతో ‘నేను ఏ అన్యాయం చేశానయ్యా’ అంటూ సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ పరిస్థితిని మొరపెట్టుకున్నారు. దర్శి మండలం తానంచింతల గ్రామానికి చెందిన ఏకాశి శివయ్య 1986 నుంచి రేషన్ దుకాణం సక్రమంగా నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఏ తప్పు చూపించకుండానే అర్థంతరంగా తొలగించినట్లు ఈ ఏడాది అక్టోబర్ నెలలో దర్శి తహశీల్దార్ చెప్పటంతో శివయ్య కంగుతిన్నాడు. తాను ఏం నేరం చేస్తే రేషన్ షాప్‌ను తొలగించారని ప్రశ్నించినా తహశీల్దార్ నుంచి సమాధానం లేదు. అదే గ్రామానికి చెందిన సంధు నాగమణి అనే మహిళకు రేషన్ షాప్‌ను కేటాయించేశారు. ఓ పక్క పుట్టు వికలాంగుడిగా రెండు కాళ్ళు మెలికతిరిగి కర్ర ఆసరాతో సైతం నడవలేని స్థితిలో ఉన్న శివయ్య తన గోడును జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో విన్నవించుకునేందుకు సోమవారం ఒంగోలుకు చేరుకున్నాడు. ఈయన భార్య కూడా వికలాంగురాలు. వీరిరువురికితోడు వీరి బిడ్డ కూడా వికలాంగురాలిగానే పుట్టింది. -
భలే ఛాన్స్ !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎల్ఈడీ బల్బుల డీలర్ షిప్ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశమైంది. తెలుగు యువత విభాగంలోని ముఖ్య నేత ఒకరు ఈ డీలర్ షిప్ దక్కించుకుని వ్యాపారాన్ని ప్రారంభించడంతో భలే ఛాన్స్ మిస్ అయ్యామని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు, పార్టీలో చిన్నోడైనా మంచి లాభాలు వచ్చే వ్యాపారాన్ని దక్కించుకున్నాడని మరి కొందరు ప్రశంసిస్తున్నారు. ఆ డీలర్షిప్ ఎలా దక్కించుకున్నారు? ఆ నేతకు ఎవరి ఆశీస్సులు ఉన్నాయంటూ సీనియర్లు ఆరా తీస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం నిరీక్షించే కంటే ప్రభుత్వ పలుకుబడితో ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే మేలనే భావనకు సీనియర్లు వస్తున్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎల్ఈడీ బల్బుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు 20 లక్షల బల్బులు కేటాయింది. {పతీ వినియోగదారునికి రెండు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పంపిణీ బాధ్యత ‘కృషి కనస్ట్రక్షన్స్’ కంపెనీకి లభించింది. ‘ఈ’ టెండరు విధానంలో పంపిణీ బాధ్యతలను పొందిన సంస్థ ప్రతినిధులకు స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడంతో తమ సమీప బంధువు సహకారం తీసుకున్నారు. ఆయనే తెలుగు యువత విభాగంలోని ముఖ్య నాయకుడు. {పస్తుతం ఈ నాయకుడు కృషి సంస్థ తరఫున జిల్లాలో ఎల్ఈడీ బల్బుల పంపిణీని ప్రారంభించడం పార్టీలో చర్చనీయాంశమైంది. 110 రోజుల వ్యవధిలో జిల్లా వినియోగదారు లకు 20 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాల్సి ఉంది. డీలరుషిప్ పొందిన సంస్థకు ఒక్కో బల్బు పంపిణీకి రూ.5.40 పైసలను కమీషన్‌గా ప్రభు త్వం చెల్లించనుంది. వినియోగదారుని నుంచి ఆధార్‌కార్డు నకలు, విద్యుత్ బిల్లు చెల్లించిన రశీదు, రెండు 60 వాల్టుల బల్బులు తీసుకుని రూ.20 లకు రెండు ఎల్ఈడీ బల్బులను ఈ సంస్థ అందచేస్తున్నది. బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. నెడ్‌క్యాప్ సంస్థ సూచనల మేరకు కృషి సంస్థ పనిచేయాల్సి ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 20 లక్షల బల్బులను వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు 250 నుంచి 300 కార్మికులను నియమించాల్సి ఉంది. {పభుత్వ నియమ నిబంధనల ప్రకారం బల్బులు పంపిణీ చేసిన వినియోగదారుల వివరాలను కంప్యూటరీకరించాలి. వచ్చిన బల్బులను మండల కేంద్రాల్లోనిగోడౌన్లో నిల్వ చేయాలి. ఇవన్నీ చేసినందుకు డీలర్ షిప్ పొందిన సంస్థకు కోటి రూపాయల వరకు కమీషన్ లభించనున్నది. ఈ విషయమై డీలర్ షిప్ లభించినట్టుగా ప్రచారం పొందిన తెలుగు యువత జిల్లా అధ్యక్షు లు మన్నెం శివనాగమల్లేశ్వరరావును ‘సాక్షి’ వివరణ కోరగా, డీలర్ షిప్ తనది కాదని చెప్పారు. పార్టీలో రెండు రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. డీలర్ షిప్ పొందిన కృషి సంస్థ ప్రతినిధులు తనకు సమీప బంధువు లని చెప్పారు. వారికి స్థానిక పరిస్థితులు తెలియక పోవడంతో వర్కర్ల పంపిణీ, రూట్‌మ్యాప్ తదితర పనుల్లో సహాయం చేస్తున్నానని చెప్పారు. ఈ వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు చేసే దుష్ర్పచారమేనని ఆయన స్పష్టం చేశారు.