పాత బైకుకి రెట్టింపు ధర ఆఫర్ చేసిన డీలర్‌షిప్ - వీడియో వైరల్ | Suzuki Samurai Cost is Rs 21000 But Dealer Offers Rs 41000 | Sakshi
Sakshi News home page

పాత బైకుకి రెట్టింపు ధర ఆఫర్ చేసిన డీలర్‌షిప్ - వీడియో వైరల్

Published Mon, Sep 25 2023 9:18 PM | Last Updated on Mon, Sep 25 2023 9:22 PM

Suzuki Samurai Cost is Rs 21000 But Dealer Offers Rs 41000  - Sakshi

భారతీయ మార్కెట్లో ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్100, బజాజ్ చేతక్, టీవీఎస్ సుజుకి సమురాయ్ వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్స్‌గా ప్రసిద్ధి చెందాయి. అయితే కాలక్రమంలో కొత్త బైకులు పూత్తుకు రావడంతో.. పాత బైకులకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి కూడా చాలామంది ఈ బైకులను వినియోగిస్తున్నారు. కాగా ఇటీవల టీవీఎస్ డీలర్‌షిప్ రెట్టింపు ధరతో ఒక పాత బైకుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కేరళలోని టీవీఎస్ డీలర్‌షిప్ ప్రతినిధి మిస్టర్ మోటార్ వాల్ట్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. కస్టమర్ 27 సంవత్సరాల క్రితం టీవీఎస్ సుజుకి సమురాయ్ బైక్ కొనుగోలు చేసాడు, దానిని ఇప్పటి వరకు కూడా వినియోగిస్తున్నారు. ఈ 27 సంవత్సరాల్లో ఇతర బ్రాండ్ బైకుని కొనుగోలు చేయలేదు.

కస్టమర్ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ దాని అసలు ధరకంటే రెట్టింపు ధరకు సొంతం చేసుకున్నాడు. ఈ బైకుని అతడు కొనుగోలు చేసిన సమయంలో ధర రూ. 21,000. కానీ డీలర్‌షిప్ వారు దీన్ని రూ. 41,000లకు కొన్నారు. అంటే ఆ కస్టమర్ కొన్న కొత్త బైకు ధరలో రూ. 41 వేలు తగ్గింపు కల్పించారు.

ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12మందిపై కేసు నమోదు.. కారణం ఇదే!

కస్టమర్ ఏ బైక్ కొనుగోలు చేసిందనే విషయం వెల్లడి కాలేదు. కానీ కొన్న ధరకు రెట్టింపు ధర లభించడంతో కస్టమర్ చాలా ఆనందించాడు. ఈ రోజు కొని నెల రోజుల తరువాత విక్రయిస్తేనే అసలు ధర రాని ఈ రోజుల్లో రెట్టింపు ధర రావడం అనేది గొప్పవిషయమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement