కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్‌షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్‌జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్‌షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది.
కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్‌షిప్‌ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు.
ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!
కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్‌షిప్‌కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment