సాక్షి ప్రతినిధి, గుంటూరు :
ఎల్‌ఈడీ బల్బుల డీలర్ షిప్ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశమైంది. తెలుగు యువత విభాగంలోని ముఖ్య నేత ఒకరు ఈ డీలర్ షిప్ దక్కించుకుని వ్యాపారాన్ని ప్రారంభించడంతో భలే ఛాన్స్ మిస్ అయ్యామని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు, పార్టీలో చిన్నోడైనా మంచి లాభాలు వచ్చే వ్యాపారాన్ని దక్కించుకున్నాడని మరి కొందరు ప్రశంసిస్తున్నారు. ఆ డీలర్‌షిప్ ఎలా దక్కించుకున్నారు? ఆ నేతకు ఎవరి ఆశీస్సులు ఉన్నాయంటూ సీనియర్లు ఆరా తీస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం నిరీక్షించే కంటే ప్రభుత్వ పలుకుబడితో ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే మేలనే భావనకు సీనియర్లు వస్తున్నారు.
విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎల్‌ఈడీ బల్బుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు 20 లక్షల బల్బులు కేటాయింది.
{పతీ వినియోగదారునికి రెండు ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ పంపిణీ బాధ్యత ‘కృషి కనస్ట్రక్షన్స్’ కంపెనీకి లభించింది. ‘ఈ’ టెండరు విధానంలో పంపిణీ బాధ్యతలను పొందిన సంస్థ ప్రతినిధులకు స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడంతో తమ సమీప బంధువు సహకారం తీసుకున్నారు. ఆయనే తెలుగు యువత విభాగంలోని ముఖ్య నాయకుడు.
{పస్తుతం ఈ నాయకుడు కృషి సంస్థ తరఫున జిల్లాలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీని ప్రారంభించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
110 రోజుల వ్యవధిలో జిల్లా వినియోగదారు లకు 20 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయాల్సి ఉంది.
డీలరుషిప్ పొందిన సంస్థకు ఒక్కో బల్బు పంపిణీకి రూ.5.40 పైసలను కమీషన్‌గా ప్రభు త్వం చెల్లించనుంది.
వినియోగదారుని నుంచి ఆధార్‌కార్డు నకలు, విద్యుత్ బిల్లు చెల్లించిన రశీదు, రెండు 60 వాల్టుల బల్బులు తీసుకుని రూ.20 లకు రెండు ఎల్‌ఈడీ బల్బులను ఈ సంస్థ అందచేస్తున్నది.
బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
నెడ్‌క్యాప్ సంస్థ సూచనల మేరకు కృషి సంస్థ పనిచేయాల్సి ఉంది.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 20 లక్షల బల్బులను వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు 250 నుంచి 300 కార్మికులను నియమించాల్సి ఉంది.
{పభుత్వ నియమ నిబంధనల ప్రకారం బల్బులు పంపిణీ చేసిన వినియోగదారుల వివరాలను కంప్యూటరీకరించాలి.
వచ్చిన బల్బులను మండల కేంద్రాల్లోనిగోడౌన్‌లో నిల్వ చేయాలి. ఇవన్నీ చేసినందుకు డీలర్ షిప్ పొందిన సంస్థకు కోటి రూపాయల వరకు కమీషన్ లభించనున్నది.
ఈ విషయమై డీలర్ షిప్ లభించినట్టుగా ప్రచారం పొందిన తెలుగు యువత జిల్లా అధ్యక్షు లు మన్నెం శివనాగమల్లేశ్వరరావును ‘సాక్షి’ వివరణ కోరగా, డీలర్ షిప్ తనది కాదని చెప్పారు. పార్టీలో రెండు రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. డీలర్ షిప్ పొందిన కృషి సంస్థ ప్రతినిధులు తనకు సమీప బంధువు లని చెప్పారు. వారికి స్థానిక పరిస్థితులు తెలియక పోవడంతో వర్కర్ల పంపిణీ, రూట్‌మ్యాప్ తదితర పనుల్లో సహాయం చేస్తున్నానని చెప్పారు. ఈ వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు చేసే దుష్ర్పచారమేనని ఆయన స్పష్టం చేశారు.
భలే ఛాన్స్ !
Published Sat, Oct 11 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement