చైనా కార్ల తయారీ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రెజిల్‌లో తన 100వ డీలర్షిప్ ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 250కి పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.
బ్రెజిల్‌లో బీవైడీ 100వ డీలర్‌షిప్‌ను ఫ్లోరియానోపోలిస్ డౌన్‌టౌన్‌లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బ్రెజిల్‌లో బీవైడీ సేల్స్ నెట్‌వర్క్ కింద 39 డీలర్ గ్రూపులను కలిగి ఉంది. అంతే కాకుండా 100 స్టోర్‌లను, 135 అవుట్‌లెట్‌ల కలిగి ఉన్నట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో కంపెనీ బ్రెజిల్‌లో మరో 150 కొత్త స్టోర్‌లను నిర్మించనుంది. 2024 చివరి నాటికి 250 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలంటే.. నెలకు కనీసం 19 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రెజిల్‌లో తన ఉనికిని విస్తరిస్తూ.. విక్రయాల నెట్‌వర్క్ పెంచడానికి కంపెనీ యోచిస్తోంది.
బీవైడీ కంపెనీ బ్రెజిల్‌లో అతి పెద్ద తయారీ సైట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ చాసిస్, కొత్త ఎనర్జీ ప్యాసింజర్ కార్ ప్రొడక్షన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మెటీరియల్ వంటి వాటిని తయారు చేస్తుంది. ఇక్కడ ఏడాదికి 1,50,000 యూనిట్ల కార్లను (ఎలక్ట్రిక్, హైబ్రిడ్) తయారు చేయనున్నట్లు, స్థానికంగా 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు సమాచారం.
బీవైడీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఉత్పత్తి ఈ ఏడాది చివరి నుంచి లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో బీవైడీ డాల్ఫిన్, సాంగ్ ప్లస్, యువాన్ ప్లస్, డాల్ఫిన్ మినీ వంటి కార్లను తయారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment