చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.
స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలు
ఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment