ఒకప్పటి నుంచి భారతదేశంలో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాయు కాలుష్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్గార ప్రమాణాలు కఠినంగా మారాయి. దీంతో కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేసాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.10 లక్షల లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన డీజిల్ కారు. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 Bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.
మహీంద్రా బొలెరో
రూ. 9.79 లక్షల ధర మధ్య లభించే మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' (బిఎస్4 మోడల్) మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ కారు. దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
కియా సోనెట్
కియా సోనెట్ అనేది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 Bhp పవర్, 253 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మహీంద్రా బొలెరో నియో
మహీంద్రా బొలెరో నియో.. చూడటానికి కొంత బొలెరో మాదిరిగానే అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ కూడా మన జాబితాలో ఒకటి. రూ. 9.98 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 115 Bhp పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment