Diesel Vehicles
-
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
తప్పిన ముప్పు.. నడిరోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా
చిలకలగూడ: ట్రాఫిక్ రద్దీ ప్రాంతంలో నడిరోడ్డుపైన ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అటు పోలీసులు..ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాలు చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించాయి. వివరాల్లోకి వెళ్తే..చిలకలగూడ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లోడుతో వెళ్తున్న డీజల్ ట్యాంకర్ వెనుక టైర్ పగిలి.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో డీజిల్ లీకై రోడ్డుపై ప్రవహించింది. నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్‌కుమార్, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పందించి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలు అంటుకోకుండా భారీగా ఫోమ్‌ను స్ప్రే చేయించారు. మూడు క్రేన్ల సాయంతో బోల్తా పడిన ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సాయంతో రహదారులపై పడిన డీజిల్‌పై మట్టిపోయించారు. వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. సుమారు మూడున్నర గంటలు శ్రమపడి పరిస్థితిని చక్కదిద్దారు. ట్యాంకర్ వాహనం డ్రైవింగ్ చేస్తున్న మల్లాపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనుమానం వచి్చన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ చంద్రశేఖర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 105 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్)పాయింట్లు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్‌పై గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందించారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఘటన స్థలానికి చేరుకుని తన వంతు సాయం అందించారు. -
భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలు
ఒకప్పటి నుంచి భారతదేశంలో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాయు కాలుష్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్గార ప్రమాణాలు కఠినంగా మారాయి. దీంతో కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేసాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.10 లక్షల లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన డీజిల్ కారు. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 Bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోరూ. 9.79 లక్షల ధర మధ్య లభించే మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' (బిఎస్4 మోడల్) మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ కారు. దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.కియా సోనెట్కియా సోనెట్ అనేది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 Bhp పవర్, 253 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో.. చూడటానికి కొంత బొలెరో మాదిరిగానే అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలుమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ కూడా మన జాబితాలో ఒకటి. రూ. 9.98 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 115 Bhp పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
డీపీఎఫ్ సమస్య: కస్టమర్‌కు షాకిచ్చిన కంపెనీ
కియా సెల్టోస్ దేశంలోని అత్యుత్తమ డీజిల్ కార్లలో ఒకటి. బిఎస్ 6 నిబంధనల ప్రకారం.. ఇది డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) ఆధారిత ఉద్గార నియంత్రణ వ్యవస్థతో వస్తుంది. ఈ హార్డ్‌వేర్ కొంత ఖరీదైనది. ఇలాంటి క్యాటలిక్ కన్వర్టర్ విఫలం కావడంతో దానిని భర్తీ చేయడానికి 1.57 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కస్టమర్‌కు డీలర్షిప్ ఎస్టిమేట్ పంపించింది.ఈ ఘటన త్రిసూర్‌లోని వదనపల్లిలో చోటుచేసుకుంది. ఇంచియాన్ కియా డీలర్ ఒక ఎస్టిమేట్ పంపిస్తూ డీపీఎఫ్ భర్తీకి రూ. 1.57 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించింది. దీనిని కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ధర చాలా ఎక్కువని, రూ. 60వేలు నుంచి రూ. 70వేలు మధ్య ఉంటే న్యాయంగా ఉండేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు.చాలా డీజిల్ కార్లలో డీపీఎఫ్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే ఇది ఎగ్జాస్ట్ వాయువులను లేదా హానికర వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భర్తీ చేసుకుంటూ ఉండాలి.డీజిల్ కార్లలోని డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ రక్షణకు సాధారణ డీజిల్ కాకుండా.. ఎక్స్‌ట్రాగ్రీన్ డీజిల్ ఉపయోగించడం ఉత్తమం. ఇది డీపీఎఫ్ జీవితకాలాన్ని పెంచుతుంది. డీపీఎఫ్ సమర్థవంతగా పనిచేస్తే.. ఎగ్జాస్ట్ వాయువులో హాని కలిగించే వాయువులు తక్కువగా ఉంటాయి. -
గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర
భారతదేశంలో నేడు ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్ల ఉత్పత్తి & వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు దాదాపు డీజిల్ కార్ల మ్యాన్యుఫ్యాక్షరింగ్ నిలిపివేస్తున్నాయి. కాగా ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం మీద ప్రస్తావించారు. కానీ దీనిపై టాటా మోటార్స్ ఎండీ శైలేశ్ చంద్ర స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ వాహనాల ఉత్పత్తి నిలిపివేయాలని.. లేకుంటే డీజిల్ వెహికల్స్ మీద 10 శాతం జీఎస్స్టీ విధించడానికి తగిన సన్నాహాలు జరుగుతున్నాయని గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఈ మాటలపై శైలేశ్ చంద్ర స్పందిస్తూ.. మార్కెట్లో టాటా డీజిల్ వాహనాలకు డిమాండ్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2024 నాటికి పూర్తి స్థాయిలో ఈ వాహనాల ఉత్పత్తి నిలిపివేసే లక్ష్యంగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికి కూడా చాలామంది వాహన కొనుగోలుదారులు డీజిల్ వెహికల్స్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారని, దశల వారీగా వీటి ఉత్పత్తి తగ్గిస్తూ.. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నియమాలకు లోబడి ఉంటామని.. 2024 నాటికి డీజిల్ వెహికల్స్ ఉత్పత్తిని జీరో చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని శైలేశ్ చంద్ర వెల్లడించారు. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! ప్రస్తుతం కొన్ని విభాగాలలో మాత్రమే డీజిల్ మోడల్స్ ఉన్నాయి, వీటిని కూడా వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోకి మార్చడానికి సన్నద్ధమవుతామని తెలిపారు. కాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా డీజిల్ ఇంజిన్ కార్లను తమ పోర్ట్‌ఫోలియోలో తొలగించడానికి ససేమిరా అంటోంది. -
తగ్గనున్న డీజిల్ వాహన అమ్మకాలు - కారణం ఇదే!
న్యూఢిల్లీ: కఠిన ఉద్గార నిబంధనల కారణంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో డీజిల్ కార్ల శాతం తగ్గుతుందని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. వాహనం ఖరీదు కావడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. ఇప్పటికే డీజిల్ వాహన అమ్మకాలు క్షీణిస్తున్నట్టు తెలిపాయి. నిబంధనలు కఠినతరం అయితే సహజంగానే ధర పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో డీజిల్ వాహనాల విక్రయాల తగ్గుదల శాతం వేగంగా ఉంటుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డీజిల్ మోడళ్లకు స్వస్తి పలుకుతున్నట్టు ఇప్పటికే చాలా కంపెనీలు స్పష్టం చేశాయన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 2013–14లో డీజిల్ మోడళ్ల వాటా 53.2 శాతం. ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్‌లో ఇది 18.2 శాతానికి వచ్చి చేరిందన్నారు. డీజిల్–పెట్రోల్ మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం తగ్గింది. డీజిల్ వాహనాలతో లభించే వ్యయ ప్రయోజనాలు తగ్గాయన్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ మాట్లాడుతూ తమ కంపెనీ అమ్మకాల్లో డీజిల్ విభాగం వాటా 18 శాతానికి వచ్చి చేరిందన్నారు. -
డీజిల్ వాహనాలపై అదనపు పన్ను వివాదం!
న్యూఢిల్లీ: డీజిల్ వాహనాలపై మరింత పన్ను విధించాలంటూ కేంద్ర రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అయితే, అటువంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదంటూ తర్వాత ఆయనే మళ్లీ వివరణ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెడితే .. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాలుష్యం పెరిగిపోతుండటం ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీజిల్ వాహనాలను అమ్మడం కష్టతరమయ్యేంత స్థాయిలో ప్రభుత్వం పన్నులు పెంచుతుందంటూ హెచ్చరించారు. వాటిపై అదనంగా 10 శాతం పన్ను విధించాల్సిన అవసరం ఉందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘డీజిల్ ఇంజిన్లు/వాహనాలపై మరో 10 శాతం జీఎస్టీ విధించాలని నేను ఆర్థిక మంత్రిని కోరుతున్నాను. డీజిల్ వాహనాలను క్రమంగా తప్పించేసేందుకు ఇదొక్కటే మార్గం‘ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను రాసిన లేఖను అందించేందుకు ఆర్థిక మంత్రితో సమావేశం కూడా కానున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. యూటర్న్.. అయితే, గడ్కరీ ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వైఖరి గురించి వివరించారు. డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధింపును ప్రస్తావిస్తూ ‘అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు‘ అని సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విటర్)లో ఆయన స్పష్టం చేశారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించేందుకు, డీజిల్ వంటి హానికారక ఇంధనాల వల్ల తలెత్తే వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. పర్యావరణహిత మొబిలిటీ వ్యవస్థ కావాలి: మోదీ పర్యావరణానికి అనుకూలమైన, సుస్థిర ప్రయోజనాలు అందించే విధమైన రవాణా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని సియామ్ సమావేశానికి పంపిన సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ’అమృత కాలం’ లక్ష్యాలను సాధించే దిశగా బాటలు వేయాలని దేశీ ఆటోమొబైల్ రంగానికి సూచించారు. కోట్ల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆదాయాల వృద్ధికి పరిశ్రమ తోడ్పడిందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆర్థిక వృద్ధితో పెరిగిన డిమాండ్‌తో పరిశ్రమ కూడా లబ్ధి పొందిందని మోదీ చెప్పారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఆటోమొబైల్ రంగం వివిధ టెక్నాలజీలతో వాహనాలను ప్రవేశపెడుతోందని ఆయన ప్రశంసించారు. మోదీ సందేశాన్ని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ చదివి వినిపించారు. -
డీజిల్ బస్సుకు బైబై
హైదరాబాద్: ఆర్టీసీ డీజిల్ బస్సులు ఇక తుక్కు జాబితాలో చేరనున్నాయి. ఏళ్ల తరబడి లక్షల కొద్దీ కిలోమీటర్లు తిరిగిన కాలం చెల్లిన బస్సులను వదిలించుకొనేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. వీటి స్థానంలో అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడతో పాటు పలు జిల్లా కేంద్రాలకు ఈ– గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూన్ నుంచి దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 28 డిపోల్లో సుమారు 2500 బస్సులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచి క్రమంగా డీజిల్ బస్సుల వినియోగాన్ని తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఈ సంవత్సరం వెయ్యి డీజిల్ బస్సులను తొలగించడంతో పాటు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. ఇలా ప్రతి సంవత్సరం డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహితమైన బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐటీ కారిడార్లకు పరుగులు.. నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల వినియోగం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో నగర శివార్లలో బస్సుల అవసరం బాగా పెరిగింది. ఔటర్‌ను దాటి సిటీ విస్తరించింది. ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్, తదితర రంగాలకు చెందిన ప్రజలు కూడా శివార్లకు తరలివెళ్తున్నారు. చాలామంది నగరంలోని ఐటీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ శివార్లలో నివాసం ఉండడంతో రవాణా సదుపాయం సవాల్‌గానే మారింది. దీంతో జూన్ నుంచి ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను నగర శివార్ల నుంచి ఐటీ కారిడార్లకు నడపాలని అధికారులు భావిస్తున్నారు. తొలివిడత 28 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కంటోన్మెంట్ డిపో నుంచి వీటిని నిర్వహిస్తారు. ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి మణికొండ, ఇబ్రహీంపట్నం, దిల్సుఖ్నగర్లకు రాకపోకలు సాగిస్తాయి. జూలైలో మరో 32 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సులు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్. ప్రగతినగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు నడపనున్నారు. కోఠి– పటాన్చెరు డబుల్ డెక్కర్.. మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 10 డబుల్ డెక్కర్ బస్సులను కోఠి– పటాన్‌చెరుల మధ్య రెండు మార్గాల్లో నడిపేందుకు రూట్‌ను ఖరారు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కోఠి– పటాన్చెరు (218), కోఠి– పటాన్చెరు (222) రూట్లలో ఈ బస్సులు నడుస్తాయి. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు పెద్దగా ఆటంకాలు లేకపోవడంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు మార్గాలను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు, ఇవే!
2023 ఏప్రిల్ 01 నుంచి బిఎస్-6 ఫేజ్ 2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయడానికి సన్నద్ధమైపోతున్నాయి. మరి కొన్ని సంస్థలు ఉన్న కార్లను సరసమైన ధరలతో విక్రయించడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది మార్కెట్లో సరసమైన ధర వద్ద లభించే డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz): భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభిస్తున్న పాపులర్ డీజిల్ కారు. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10.40 లక్షల మధ్య ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో 90 హెచ్‌పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ దేశంలో మిగిలి ఉన్న ఏకైక డీజిల్ హ్యాచ్‌బ్యాక్. మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo): మహీంద్రా బొలెరో నియో కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ కారణంగా తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 9.62 లక్షల నుంచి రూ. 12.14 లక్షలు. ఈ కారు 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ కలిగి 100 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. మహీంద్రా బొలెరో (Mahindra Bolero): మహీంద్రా బొలెరో మన జాబితాలో తక్కువ ధరలో లభించే ఉత్తమైన డీజిల్ కారు. ఇది రూ. 9.78 లక్షల నుంచి రూ. 10.79 లక్షల మధ్య లభిస్తుంది. ఇది 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 76 హెచ్‌పి పవర్ 210 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ మైలేజ్ అందిస్తుంది. మహీంద్రా ఎక్స్యువి300 (Mahindra XUV300): ఎక్స్యువి300 మహీంద్రా కంపెనీకి చెందిన బెస్ట్ డీజిల్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 9.90 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్య ఉంది. మహీంద్రా ఎక్స్యువి300 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ద్వారా 117 హెచ్‌పి పవర్ 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ పొందుతుంది. కియా సోనెట్ (Kia Sonet): దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ దేశీయ విఫణిలో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తున్న SUV లలో ఒకటి సోనెట్. ఈ డీజిల్ కారు ధర రూ. 9.95 లక్షల నుంచి రూ. 14.89 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్ అనే మూడు ఇంజిన్ ఎంపికలతో విక్రయిస్తోంది. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. టాటా నెక్సాన్ (Tata Nexon): భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్లలో ఒకటి టాటా నెక్సాన్. టాటా నెక్సాన్ డీజిల్ మోడల్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13.70 లక్షల మధ్య ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ద్వారా 115 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మంచి మైలేజ్ అందించే వాహనాల్లో కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. -
కియా మోటార్స్ ఈ కార్లను నిలిపివేస్తుందా?
భారతదేశంలో రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. కియా మోటార్స్ కూడా దేశీయ మార్కెట్లో కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ తన డీజిల్ మాన్యువల్ వేరియంట్లను నిలివేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్లో డీజిల్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసి ఆ స్థానంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ మార్గంలోనే కియా మోటార్స్ కూడా పయనించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ఔత్సాహికులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సంతృప్తి చెందాలి, ఇది ఆటోమేటెడ్ క్లచ్ ఆపరేషన్‌తో కూడిన మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు సెల్టోస్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లతో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ iMT ఆప్సన్ అందిస్తోంది. అయితే సొనెట్, కారెన్స్ డీజిల్ వేరియంట్స్ స్టాండర్డ్ మ్యాన్యువల్ & ఆటోమాటిక్లో లభిస్తున్నాయి. డీజిల్ వేరియంట్స్‌లో ఐఎమ్టికి అనుకూలంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమాటిక్ మధ్య బ్యాలెన్స్‌ని స్ట్రైక్ చేయడం ద్వారా డ్రైవర్‌ను క్లచింగ్ అండ్ డీ-క్లచింగ్ను ఆటోమేటిక్‌గా చూసుకుంటూ షిఫ్టింగ్ పార్ట్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. గేర్ లివర్ ఉపయోగించి రెండు పెడల్ డ్రైవింగ్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో అనుకున్నంత సులభంగా ఉండదు. ఇటీవల చాలా మంది కస్టమర్లు క్లచ్‌లెస్ డ్రైవింగ్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికోసం కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం బిఎస్6 ఉద్గార ప్రమాణాలు మరింత కఠినతరం అవుతున్నాయి, ఈ సమయంలో డీజిల్ కార్ల ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ కార్ల డిస్కంటీన్యూ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు. -
Hyderabad: గుండెకు పొగ పెడుతున్న కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల కారణంగా సిటీ పొగచూరుతోందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 80 లక్షలకు చేరువైంది. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన వాహనాలు 20 లక్షలకు పైమాటే. వీటిలో డొక్కు బస్సు లు, ట్రక్కులు, కార్లు తదితర డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న పొగతో ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ప్రధానంగా మోటారు వాహనాలు, పరిశ్రమలు విడుదల చేస్తున్న పొగలో సూక్ష్మ ధూళి కణాల(పిఎం2.5) మోతాదు అనూహ్యంగా పెరగడంతో సిటీజన్లలో గుండె కండరాలు, దమనులు దెబ్బ తింటున్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నగ రంలో 28 ప్రాంతాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదును ఈ సంస్థ నిపుణులు నమోదు చేశారు. వీరి లెక్కల ప్రకారం ఘనపుమీటర్ గాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదు 32 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటి మోతాదు 60 మైక్రో గ్రాములకు పైగా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. గుండెకూ చేటు.. ఈ సూక్ష్మ ధూళికణాలు గుండెలోని సూక్ష్మ దమనులు, కెరోటిడ్ ఇంటిమా మీడియాపై పేరుకు పోవడంతో వాటి మందం పెరిగి గుండెకు రక్తసరఫరా తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామంతో గుండెదడ, గుండెపోటు తదితర హృదయ సంబంధిత సమస్యలు సిటీజన్లలో క్రమంగా పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేయడం గమనార్హం. చదవండి: Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు కాలుష్యానికి కారణాలివే.. ►పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ►పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోచెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ►శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘణపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. ►గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 80 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ►గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్‌డయాక్సైడ్,అమ్మోనియా,బెంజీన్,టోలిన్,ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. ►సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం బారిన పడకుండా ముక్కుకు మాస్‌్కలు ధరించాలి. ►కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించాలి. ►ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కువ సేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►కల్తీ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేయాలి. ప్రతీపెట్రోలు బంకులో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఇంధన నాణ్యత తనిఖీలు నిర్వహించాలి. కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం నగరంలో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు. -
‘హరిత’ వాహనాలపై బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో డీజిల్ ఆధారిత మైనింగ్ వాహనాలను బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలుగా మార్చుకునేందుకు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,270 కోట్లు) పైగా వెచ్చించనున్నట్లు, పూర్తి స్థాయిలో హరిత ఇంధనాల వైపు మళ్లనున్నట్లు హిందుస్తాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. తమకు 900 మైనింగ్ వాహనాలు ఉండగా ఇప్పటికే నాలుగింటిని ప్రయోగాత్మకంగా బ్యాటరీలతో నడిపిస్తున్నట్లు ఆయన వివరించారు. 2050 నాటికి పూర్తి కర్బన ఉద్గారాల రహిత సంస్థగా ఎదిగే దిశగా 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇటీవలే సెరెంటికా సంస్థతో పాతికేళ్ల పవర్ పర్చేజ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిశ్రా చెప్పారు. దీనితో 1.2 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను నివారించవచ్చన్నారు. 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని 40 శాతం మేర, 2027 పూర్తిగా తగ్గించుకోవాలని ప్రణాళికలు ఉన్నట్లు మిశ్రా వివరించారు. అలాగే రాజస్థాన్‌లోని చందేరియాలో రూ. 2,500 కోట్లతో 0.5 మిలియన్ టన్నుల డీఏపీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 29 శాతం వాటాలు, ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్నారు. ఈ వాటాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా విక్రయించనుందని, అయితే నిర్దిష్ట కాలవ్యవధేమీ లేదని మిశ్రా వివరించారు. దీనిపై ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. జింక్ తయారీలో హెచ్‌జెడ్‌ఎల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయంగా వెండిని తయారు చేసే ఏకైక సంస్థగాను, జింకు..సీసం అత్యధికంగా తయారు చేసే కంపెనీగాను కార్యకలాపాలు సాగిస్తోంది. -
డీజిల్ కారు ఉందా? ఆ రోడ్లపైకి వెళ్లారో రూ.20వేల ఫైన్!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్‌తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్‌ను వాహన యజమానులకు పంపించారు. మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు -
డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! ఆటోలకు రూ.15 వేల సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 5 వేల ఆటోలకు బ్యాటరీలు బిగించి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో 500 ఆటోలకు బ్యాటరీలు అమర్చాలని భావిస్తోంది. ఒక్కో ఆటోకు రూ.15 వేల సబ్సిడీని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు త్వరలో టెండర్లు పిలవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు నెలవారీ అద్దె కింద ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాలే తీసుకునేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా 138 చార్జింగ్ కేంద్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో 138 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో 118, వరంగల్, కరీంనగర్ నగరాల్లో చెరో 10 చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్ విధానంతోపాటు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పర్యాటక, పౌర సరఫరాల, రోడ్డు, రవాణా శాఖలు తమ పరిధిలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన 979 స్థలాలను గుర్తించి టీఎస్ రెడ్కోకు జాబితాను అందజేశాయి. జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖల స్థలాలను ఇప్పటికే అధీనంతోకి తీసుకోగా, మిగిలిన శాఖలతో రెవెన్యూ షేరింగ్ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి రెడ్కో చర్యలు తీసుకుంటోంది. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు 20 మంది ఆపరేటర్లను ఎంప్యానల్ చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి రుణాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారులను ప్రోత్సహించేందుకు 18 బ్రాండ్లతో రెడ్కో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీదారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంలు, సింగరేణితో కలిసి త్వరలో ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తయారీదారులకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు సహకరించనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ప్రాచుర్యం కల్పించేందుకు త్వరలో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నామని టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా రుణాలతోపాటు చార్జింగ్ కేంద్రాలను మానిటరింగ్ చేసే వీలుంటుందని తెలిపారు. -
డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం
సాక్షి, అమరావతి: డీజిల్ బస్సులకు టాటా చెబుతూ.. ఇ–బస్సులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ) ముందడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ వ్యయం తగ్గింపునకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు (ఇ–బస్సులు)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే తిరుమల–తిరుపతి మధ్య 150 ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఇ–బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ ర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఇ–బస్సులను ప్రవేశపెట్టడం భారీ వ్యయంతో కూడినది కావడంతో.. పాత డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్పు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం రెట్రోఫిట్మెంట్ (పునర్నిర్మాణ) ప్రాజెక్టును చేపట్టనుంది. ప్రాజెక్టు ఇలా.. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుపై కసరత్తును ఆర్టీసీ ముమ్మరం చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఒక డీజిల్ బస్సును ఇటీవల రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చింది. డీజిల్ ఇంజన్ చాసిస్ ఉన్న బస్సులో బ్యాటరీతో పనిచేసే ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. చాసిస్‌ను అలానే ఉంచి ఇ–బస్సుకు అనుగుణంగా రీ బాడీ బిల్డింగ్ చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం పుణేలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (సీఐఆర్టీ)’కి పంపిస్తారు. ఆ బస్సును అక్కడి నిపుణులు పరీక్షించి అన్ని ప్రమాణాల మేరకు ఉన్నాయని భావిస్తే సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం ఆర్టీసీ డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మారుస్తారు. దశలవారీగా ఇ–బస్సులుగా మార్పు ప్రస్తుతం ఆర్టీసీ వద్ద మరో పదేళ్ల జీవిత కాలం ఉన్న 2 వేల డీజిల్ బస్సులు ఉన్నాయి. వాటిని ముందుగానే దశల వారీగా ఇ–బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం నీతి ఆయోగ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మార్గనిర్దేశాల ప్రకారం కసరత్తు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే ఇ– బస్సులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చి నప్పుడు అదే రీతిలో రాయితీ ఇవ్వాలని ఆర్టీసీ కేంద్రాన్ని కోరనుంది. పుణేలోని సీఐఆర్టీ నుంచి సర్టిఫికేషన్ వచ్చిన తరువాత ఈ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల తరహాలో ఈ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచి బిడ్డర్లను ఎంపిక చేస్తుంది. డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మార్చే దిశగా రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ (ఇంజినీరింగ్) కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. దీనివల్ల కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. -
ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సు వచ్చింది. అయితే ఇది కొత్త బస్సు కాదు. డీజిల్ భారం నుంచి బయటపడేం దుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న బస్సు. అంటే డీజిల్‌తో నడిచే బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారన్న మాట. ఈ బస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపోకు చేరుకుంది. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్‌తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి. వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఖర్చు తగ్గింపే లక్ష్యం ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే. అంత వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ డీజిల్ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్ బస్సుగా కన్వర్ట్ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు! ప్రస్తుతం కన్వర్షన్ ఖర్చును కూడా ఆర్టీసీ భరించలేదు. దీంతో బస్సును కన్వర్ట్ చేసిన తర్వాత నిర్ధారిత కాలం పాటు ఆ సంస్థే బస్సులను నిర్వహించుకుని, అద్దె వసూలు చేసుకుని, నిర్ధారిత కాలం తర్వాత బస్సులను ఆర్టీసీకి అప్పగించే విధానంపై ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఖాళీ డీజిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి
సూర్యాపేట: ఖాళీ డీజిల్ ట్యాంకర్‌కు గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. సోమవారం సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేటలోని రాంకుమార్‌కు చెందిన డీజిల్ ట్యాంకర్ వాల్వ్‌లు లీకై డీజిల్ కారుతోంది. ట్యాంకర్‌కు వెల్డింగ్ చేయించేందుకు డ్రైవర్లు వెంకటనారాయణ, మల్లేష్ కొత్త బస్టాండ్ సమీపంలోని దుకాణం వద్దకు తెచ్చారు. దుకాణ యజమాని మంత్రి అర్జున్ గ్యాస్ వెలిగించి వాల్వ్‌కు వెల్డింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ట్యాంకర్ పేలింది. వెల్డింగ్ చేస్తున్న మంత్రి అర్జున్ (32)తోపాటు అక్కడే ఉన్న కుడకుడకు చెందిన గట్టు అర్జున్ (50) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. వెంకటనారాయ ణ, మల్లేష్‌కు తీవ్ర గాయాలుకాగా, మరో ట్యాంకర్ డ్రైవర్ రమణకు స్వల్పగాయాలయ్యాయి. మల్లేష్ పరిస్థితి విషమంగా ఉం డడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి అర్జున్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గట్టు అర్జున్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇళ్లపై పడిన ట్యాంకర్ శకలాలు డీజిల్ ట్యాంకర్ పేలిపోవడంతో ట్యాంకర్ శకలాలు సమీపంలోని మెకానిక్ దుకాణంతోపాటు కిలోమీటర్ దూరంలో ఉన్న బాలాజీనగర్, విద్యానగర్‌లోని ఇళ్లపై ఎగిరిపడ్డాయి. ఇళ్ల తలుపులు, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఏం జరిగిందో తెలియక ఇళ్లలో ఉన్నవారంతా బయటికి పరుగులు తీశారు. ట్యాంకర్లో నీటిని నింపి వెల్డింగ్ చేయిస్తే ప్రమాదం సంభవించేది కాదని పలువురు డ్రైవర్లు చెప్పారు. ఖాళీ ట్యాంకర్ అయినా అడుగున ఎంతో కొంత డీజిల్ ఉం టుందని, తద్వారా ప్రమాదం సంభవించి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
మీరు కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!
ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటామోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన పలు కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాల్ని చవిచూసింది.కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ.1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే ఈ నష్టాల్ని మరింత తగ్గించి లాభాల బాట పట్టేలా కొనుగోలు దారులకు ఆఫర్లను అందిస్తుంది. తాజాగా గణనీయమైన తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు పలు మోడళ్ల ఆధారంగా రూ.60,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ నివేదించింది. టాటా హారియర్ 2021 డీజిల్ వెహికల్ టాటా హారియర్ మోడల్ కారుపై రూ.20వేల వరకు నగదు ప్రయోజనాలు కలుపుకొని రూ.60వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక 2022 మోడల్ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ లో రూ.40వేల వరకు,డార్క్ ఎడిషన్ రూ. 20,000 వరకు ఎక్ఛేంజ్, ఎస్‌యూవీలో కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ. 25,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ 2021 మోడల్ సఫారీలలోరూ.60,000 వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని, దీంతోపాటు 2022 మోడల్ టాటా సఫారీ కారుపై రూ.40,000వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని పొందవచ్చు. టాటా టియాగో సెడాన్ కార్ల విభాగంగా కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న నాలుగు డోర్ల టాటా టియాగో కారుపై టాటా మోటార్స్ ఆఫర్లు ప్రకటించింది. కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వేరియంట్లు మినిహాయించి మిగిలిన కార్లపై రూ.25వేల వరకు ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా నెక్సాన్ ఇక టాటా కార్లలో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న మరో కార్ నెక్సాన్. లుక్స్‌తో పాటు దాని పనితీరు కారణంగా కొనుగోలు దారులు నెక్సాన్ ను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే టాటా మోటార్స్ సైతం కొనుగోలుదారుల కోసం నెక్సాన్ డీజిల్ వెహికల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15,000, కాంపాక్ట్ ఎస్యూవీ కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.10,000 వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. -
వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!
ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనదారులకు భారీషాకిచ్చింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 43 లక్షల వాహనాలు మూలన పడనున్నాయి. అందులో 32 లక్షల బైక్స్, 11లక్షల కార్లు ఉన్నాయని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఒకవేళ 10ఏళ్లకు పైబడిన డీజీల్ వాహనాలు, లేదంటే 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాల లైసెన్స్‌లు రద్దు చేసినా రోడ్ల మీద తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ వాహనాల్ని స్క్రాప్‌గా మార్చేస్తామని ఆర్టీఐ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ వాహనాల్ని ఏం చేయాలో అర్ధంగాక పలువురు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. 10ఏళ్లు పైబడిన డీజిల్ బండి ఉందా 10ఏళ్లు పైబడిన డీజిల్ వెహికల్ ఉంటే..ఆ వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చకుండా ఆదాయాన్ని గడించే మార్గాలు ఉన్నాయి. 10ఏళ్లు నిండిన డీజిల్ వాహనాల్ని ఎలక్ట్రిక్ కిట్ల సాయంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేసి, నో- అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. ఆ ఎన్ఓసీ సర్టిఫికెట్ సాయంతో వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవచ్చని ఢిల్లీ ఆర్టీఓ అధికారులు తెలిపారు. Delhi govt in a bid to provide relief to the Delhiites affected by the NGT order mandating de-registration of Petrol & Diesel Vehicles above 15 & 10 yrs resp., has allowed ✅Provision of NOC for registering in other states ✅Retrofitment to Electric & continue plying in Delhi pic.twitter.com/ZaqnoS0f0M — Transport for Delhi (@TransportDelhi) December 17, 2021 స్క్రాప్‌గా మార్చకుండా లైసెన్స్ రద్దు చేసిన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ విభాగం గుర్తించిన ఆరు మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీల్లో మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని, ఆ వాహనాల్ని మళ్లీ వినియోగించుకోవచ్చని చెప్పింది. ఏజెన్సీలతో ప్రభుత్వం సంప్రదింపులు ఓల్డ్ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చే ఏజెన్సీలతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అందులో ఆరు ఏజెన్సీలకు ఢిల్లీ ఆర్టీఓ విభాగం- ప్రముఖ టెస్టింగ్ సర్టిఫికేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంటర్నేషన్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ(ఐసీఏటీ)లు ఆమోదం తెలిపాయి. వాటిలో ఎట్రియో ఆటోమొబైల్, 3ఈవీ ఇండస్ట్రీస్, బూమా ఇన్నోవేటివ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ రెన్యూవబుల్, జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, వీఈఎల్ఈవీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మీ పాత వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చుకొని వినియోగించుకోవచ్చు. లేదంటే అమ్ముకోవచ్చు. చదవండి: ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే -
డీజిల్ కోసం వాహనాల అపహరణ
భవానీపురం(విజయవాడ పశ్చిమ): భారీ వాహనాల్లోని డీజిల్ దొంగిలించేందుకు ఏకంగా ఆరు లారీలు, ఒక కాలేజీ బస్‌ను చోరీ చేసిన నిందితుడిని, డీజిల్ కొనుగోలు చేసే వ్యక్తిని విజయవాడ భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం భవానీపురం ఐరన్ యార్డ్‌లోని ఒక లారీని ఎత్తుకుపోగా..దానికి ఏర్పాటు చేసిన జీపీఎస్ ద్వారా డీజిల్ అమ్ముతున్న దొంగ గుట్టు రట్టయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన వరుస లారీ దొంగతనాలపై భవానీపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. భవానీపురంలో నివసించే ఆటో డ్రైవర్ వెంకటరెడ్డి హాల్టింగ్ డ్రైవర్‌గా లారీ, బస్, కారు తోలేవాడు. మద్యం ఇతర దుర్వ్యసనాలకు బానిస అయిన అతను దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తద్వారా వచ్చే డబ్బుతో జల్సా చేయడం మొదలు పెట్టాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అతన్ని దూరంగా పెట్టారు. ఈ క్రమంలోనే భవానీపురంలోని లారీ స్టాండ్‌పై పూర్తి అవగాహన ఉన్న అతను గత నెల 15వ తేదీ తరువాత స్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న లారీని ఎత్తుకు పోయాడు. రెండు మూడు రోజులు గడిచిన తరువాత మరో లారీ, ఆ తరువాత మరో లారీ చోరీ చేశాడు. ఈ దొంగతనాలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం. అదే విధంగా లారీ స్టాండ్‌కు కూతవేటు దూరంలో పార్క్ చేసి ఉంచిన ఎన్ఆర్ఐ కాలేజీ బస్‌ను ఎత్తుకు పోయాడు. వరుస దొంగతనాలతో స్టాండ్‌లో అలజడి మొదలు కావడంతో ఇక అక్కడ క్షేమం కాదనుకున్నాడో ఏమో డీజిల్ దొంగ భవానీపురం ఐరన్ యార్డ్‌పై దృష్టి పెట్టి, మూడు లారీలను చోరీ చేశాడు. అందులో యార్డ్‌లో సాయినాథ్ ట్రాన్స్పోర్ట్కు చెందిన పార్శిల్ లారీ ఒకటి. దానిని ఎత్తుకుపోవడంతో సంబంధిత వ్యక్తులు అప్రమత్తమయ్యారు. ఆ లారీకి ఉన్న జీపీఎస్ ద్వారా లారీ గన్నవరం మండలం ముస్తాబాదలోని ఒక రేకుల షెడ్ ముందు ఉండటాన్ని గుర్తించారు. లోపలకు వెళ్లి చూడగా దొంగిలించిన డీజిల్‌ను కొనుగోలు చేసే వ్యక్తి దొరికాడు. అతన్ని నిలదీయటంతో డీజిల్ దొంగ పట్టుబడ్డాడు. ఇద్దర్నీ పట్టుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. చోరీకి గురైన లారీల్లో ఒకటి గన్నవరం మండలం కేసరపల్లి రోడ్డు మీద, మరో రెండు రామవరప్పాడు బైపాస్‌లో, ఎన్ఆర్ఐ కాలేజీ బస్ విద్యాధరపురం రామరాజ్యనగర్ రైలు కట్ట వద్ద దొరికాయి. ఈ ఘటనకు సంబంధించి భవానీపురం పీఎస్‌లో శనివారం కేసు నమోదైంది. -
TSRTC: డీజిల్ టు ఎలక్ట్రిక్..
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రాజెక్టుకు తెలంగాణ ఆర్టీసీ పచ్చ జెండా ఊపింది. ప్రయోగాత్మకంగా ఓ బస్సును మార్చేం దుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్స్‌కు సంబంధించిన పరికరాలు రూపొందించే ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారుస్తోంది. ఇది విజయవంతమైతే మిగతా బస్సులను మార్చే దిశగా యోచించనుంది. ఒక్కో బస్సుకు రూ.60 లక్షలు.. బ్యాటరీ బస్సులతో డీజిల్ భారం పూర్తిగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ ధరలను బేరీజు వేసుకుంటే ఓ బస్సును నడిపేందుకు కిలోమీటరుకు రూ.20 వరకు ఖర్చవుతుంది. బ్యాటరీ బస్సుల నిర్వహణలో మాత్రం రూ.6గా మాత్రమే ఉండనుంది. ఇది ఆర్టీసీకి బాగా కలిసొస్తుంది. కాకపోతే బ్యాటరీ బస్సుల ఖరీదు చాలా ఎక్కువ. ప్రస్తుతం మన దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సులు తయారవుతున్నాయి. కానీ వాటిల్లో వినియోగించే బ్యాటరీలను మాత్రం చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మొత్తం బస్సు ధరలో బ్యాటరీ ఖర్చే 70 శాతం వరకు ఉంటోంది. ఒక బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.కోటిన్నర వరకు ఉంటోంది. అయితే డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారిస్తే రూ.60 లక్షల వరకు ఖర్చవుతోంది. రైల్వే లోకోమోటివ్ పరికరాలు తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఇటీవల ముందుకొచ్చి ఆర్టీసీ ప్రతిపాదనకు అంగీకరించింది. ఒక బస్సును పరీక్షించి.. ప్రస్తుతం ఒక బస్సును ఆ సంస్థ సిద్ధం చేస్తోంది. అనంతరం దాన్ని నడిపేందుకు అనుమతులు తీసుకుని రోడ్డుపైకి తీసుకొస్తారు. కీలక మార్గంలో దాన్ని తిప్పి, పని తీరును అంచనా వేయనున్నారు. ఫలితం బాగుంటే మిగతా బస్సలను కూడా మార్చేందుకు ముందడుగు వేయనున్నారు. అన్ని బస్సులను మార్చాలంటే భారీ వ్యయం అవుతుంది. అలా నేరుగా కన్వర్షన్‌కు అప్పగించకుండా, నిర్ధారిత కాలం పాటు బస్సులను ఆ సంస్థనే నిర్వహించి, డీజిల్ భారం లేకపోవడంతో ఆదా అయ్యే మొత్తాన్ని తీసుకునే ఓ ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంపిక చేయనున్నారు. ఇది కూడా టెండర్ల ద్వారా అప్పగించనున్నారు. దీన్ని ఖరారు చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తారని సమాచారం. సజ్జనార్ చొరవతో.. కొన్నేళ్లుగా డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఆర్టీసీపై భారం పెరుగుతోంది. దీంతో ఆ ఖర్చును తగ్గించుకునేందుకు దాదాపు రెండేళ్లుగా ఆర్టీసీ ఈ కన్వర్షన్ ఆలోచన చేస్తోంది. ఉన్నతాధికారుల నుంచి స్పందన రాకపోవటంతో పెండింగులో ఉండిపోయింది. ఇటీవల అధికారులు ఈ విషయాన్ని ఎండీ సజ్జనార్ దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన ఓ బస్సును మార్చేందుకు అనుమతించారు. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్న డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాటిని నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య మన నగరాన్ని తాకేంతవరకు చూడకుండా తొందరగానే మేల్కోవాలని సర్కారు యోచిస్తోంది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నగరాన్ని వాహనాల పొగ ఉక్కిరిబిక్కిరి చేయకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్.. మొక్కలు పెంచడంతోపాటు డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు ఇవ్వడం వంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. కొత్త జరిమానాలను ప్రతిపాదిస్తూ చట్ట సవరణ చేయనున్నట్టు తెలిసింది. పన్ను పెంపు యోచన..: హైదరాబాద్ నగర రహదారులపై దాదాపు 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ వాహనాల సంఖ్య పెరగకుండా చూడాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే పెట్రోల్ వాహనాల కంటే డీజిల్ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే, దీనిని చాలామంది పెద్ద భారంగా భావించడంలేదు. దీంతో ఈ పన్ను మొత్తాన్ని మరింత పెంచితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక 12 ఏళ్లు తిరిగిన డీజిల్ వాహనాలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో బ్యాటరీ వాహనాలకు పన్నులు, ఇతరత్రా అంశాల్లో మినహాయింపులు ఇవ్వడం ద్వారా జనం వాటి పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ప్రభుత్వానికి రవాణాశాఖ ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. -
డీజిల్ వాహనాలకు రెనో గుడ్‌బై!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–6 నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో డీజిల్ వాహన విక్రయాలను క్రమంగా నిలిపివేయనున్నట్లు ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో బుధవారం ప్రకటించింది. ట్రైబర్ కాంపాక్ట్ 7–సీటర్ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించిన ఈ సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఈ కారులో కూడా ఎలక్ట్రిక్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కారు 1–లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుండగా.. ఈ ఏడా ది ద్వితీయార్థం నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ట్రైబర్ కాంపాక్ట్ ధరల శ్రేణి రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉండనుందని తెలిపింది. -
2020 నుంచి ఆ కార్ల అమ్మకాల నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి డీజిల్ కార్లను విక్రయించబోమని అతిపెద్ద కారు తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్ భారీగా పడిపోవడంతో తాము 2020, ఏప్రిల్ 1 నుంచి డీజిల్ కార్ల అమ్మకాన్ని చేపట్టడంలేదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. కాగా 1500 సీసీ పైబడిన డీజిల్ కార్లను మాత్రం విక్రయించేందుకు కంపెనీ మొగ్గుచూపుతోంది. మారుతి ఇటీవల లాంఛ్ చేసిన బాలెనో ఇదే కేటగిరీకి చెందిన వాహనం కావడం గమనార్హం. కేవలం 1500 సీసీ డీజిల్ వాహనానికే భవిష్యత్ ఉందని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా డీజిల్ వాహనాల తయారీపై తాము ఓ నిర్ణయం తీసుకుంటామని భార్గవ వెల్లడించారు. బీఎస్ 5 ప్రమాణాలు అమల్లోకి వస్తే 1500 సీసీ లోపు డీజిల్ ఇంజన్లకు ఆదరణ ఉండదని మారుతి భావిస్తోంది. బీఎస్ 4 వాహనాల విక్రయం, రిజిస్ర్టేషన్‌కు 2020 మార్చి 31ని డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్ధారించిన సంగతి తెలిసిందే. బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు గిరాకీ పెరుగుతుందని తదనుగుణంగా తమతో పాటు డీలర్లు సమిష్టిగా పనిచేసి ధరలు నిలకడగా ఉండేందుకు పూనుకోవాలని అన్నారు. గడువులోగా తాము తమ 16 మోడళ్లను అప్డేట్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల విషయంలో అనిశ్చితి నెలకొందని అభిప్రాయపడ్డారు. -
లీటరుకు 1,491 కిలోమీటర్లు..
లీటరు డీజిల్‌కు కారు ఎంత మైలేజీ ఇస్తుంది.. మహా అయితే ఓ 30 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. కానీ ఈ ఫొటోలో ఉన్న కారు ఎంత ఇస్తుందో తెలుసా..? లీటరు డీజిల్‌కు ఏకంగా 1,491 కిలోమీటర్లు! ఇది రికార్డు స్థాయి అనే చెప్పుకోవచ్చు. దీన్ని నమ్మక తప్పదు.. ఇంతకీ ఈ కారు విశేషాలేంటో తెలుసా..? షెల్ మారథాన్ అనే ఈ కారును ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ 1982లో తయారు చేసింది. గంటకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. ఈ కారును ఇటీవల జర్మనీలోని ఎస్సెన్లో జరిగిన క్లాసిక్, ప్రెస్టిజ్ ఆటోమొబైల్స్ టెక్నో క్లాసికా అనే కార్ల ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన వారందరినీ ఈ కారు ఎంతగానో ఆకట్టుకుంది. -
ఫోక్స్‌వాగన్‌కు భారీ జరిమానా
జర్మన్ ఆటోమోబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఉద్గారాల నిబంధనల ఉల్లంఘన కింద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 500 కోట్ల జరిమానా విధించింది. ఫోక్స్‌వ్యాగన్ డీజిల్ కార్ల వల్ల దేశంలో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని ఆ సంస్థపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఈ పెనాల్టీ విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా నగదును జమచేయాలని ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీచేశారు. ట్రైబ్యూనల్ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సెంట్రల్ పొల్యూషన్ బోర్డు) వద్ద రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో ట్రిబ్యునల్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చేసిన ఈ పని వల్ల పర్యావరణానికి కలిగిన అసలు నష్టాన్ని అంచనా వేయడానికి పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో ఓ కమిషన్‌ను ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. -
10 లక్షల బీఎండబ్ల్యూ కార్లు వెనక్కి
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన అత్యున్నత శ్రేణి కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూలోని డీజిల్ వాహనాల్లో సమస్యలు తలెత్తుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షలకు పైగా కార్లను వెనక్కి రప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీఎండబ్ల్యూ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘కొన్ని డిజిల్ వాహనాల్లో గ్లైకాల్ కూలింగ్ ఫ్లూయిడ్ లీక్ అవుతోంది. ఎక్జాస్టింగ్ సిస్టమ్‌లో (వాహనాల్లో పొగను రీసైక్లింగ్ చేసి బయటకు పంపే యూనిట్) ప్రాబ్లం ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోంది. దీని వల్ల అగ్రి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్లను వెనక్కి రప్పించాలని భావిస్తున్నాము’ అని తెలిపారు. అంతేకాక ‘ఇప్పటికే ఈ విషయం గురించి కార్ ఓనర్లకు కూడా సమాచారం ఇచ్చాము. ఈ వాహనాల్లోని ఎక్జాస్ట్ రిసర్క్యూలేషన్ మాడ్యూల్‌ని చెక్ చేస్తాము. ఏదైనా సమస్య ఉంటే ఆయా భాగాలను మారుస్తాము’ అని వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా ఇదే సమస్య తలెత్తడంతో దక్షిణ కొరియాలో 30 కార్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ ఇందుకు క్షమాపణలు చెప్పడమే కాకా యూరోప్, ఆసియా దేశాల్లో ఉన్న 4, 80, 000 డీజిల్ కార్లను వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే. -
టాటా ‘టిగోర్’ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: కాంపాక్ట్ సెడాన్ కారు టిగోర్ కొత్త వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.5.20లక్షలు–6.65 లక్షలు కాగా, ఇందులో 1.2 లీటర్ల ఇంజిన్ అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు–7.38 లక్షలుగా నిర్ణయించామని, 1.05 లీటర్ల ఇంజిన్‌తో ఈ సెడాన్ అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గుంటెర్ బుషెక్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రీమియం కస్టమర్ల విభాగంలో కాంపాక్ట్ సెడాన్ అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ విలువైన, ఆకర్షణీయమైన ఈ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేశాం’ అని అన్నారయన. -
పాత డీజిల్ కార్లను పట్టుకెళ్లిపోతున్నారు!!
న్యూఢిల్లీ : పొద్దున్న ఆరు అయినా కూడా చీకటి మబ్బులు దుప్పటి తెరవని రోజులు రాబోతున్నాయి. దీంతో ఓ వైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం దేశ రాజధానిని పట్టి పీడించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్లపైకి ఎక్కకుండా ఉండేందుకు ఆ వాహనాలను డీరిజిస్ట్రర్ చేయడం, రద్దు చేయడం చేస్తోంది. సీజ్ చేసి పట్టుకెళ్లిన వాహనాలను తిరిగి యజమానులకు ఇవ్వకూడదని కూడా ఢిల్లీ రవాణా శాఖ ఆలోచిస్తోంది. సీజ్ చేసిన, రద్దు చేసిన వాహనాలను ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ లిమిటెడ్‌కు అప్పజెప్పబోతున్నారు. అంతేకాక ఆ వాహనాలు వాడిన యజమానులకు మున్సిపల్ కార్పొరేషన్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు కలిసి అదనంగా జరిమానాలు కూడా విధించబోతున్నాయి. ‘మరికొన్ని రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతుంది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోబోతుంది. దీంతో 15 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను సీజ్ చేసే డ్రైవ్ ప్రారంభించాం. పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేసినా, ఇళ్లలో ఉన్నా వీటిని తీసుకెళ్లిపోతాం. ఇతర వాహనాల విషయంలో పొల్యుషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్లు ఉన్నాయో లేవో తమ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ పరిశీలించనున్నాయి’ అని రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ చెప్పారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఢిల్లీలో కోటికి పైగా రిజిస్ట్రర్ వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 ఏళ్లకు పైబడినవి 3,70,000. 15 ఏళ్లకు పైబడినవి రోడ్లపై తిరగడానికి వీలులేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆర్డర్‌తో 2016 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,23,000 డీజిల్ వాహనాలను డీరిజిస్ట్రర్ చేశారు. ఎన్జీటీ ఆర్డర్ ప్రకారం వాటిని పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేయడానికి కూడా వీలు లేదు. ఢిల్లీలో చాలా ఇళ్లలో సొంత పార్కింగ్ స్థలం లేదు. యజమానులు ఈ వాహనాలను ఢిల్లీ వెలుపల అమ్మేయాల్సి ఉంది. అయితే అమ్మేయకుండా అలానే ఉంచుకుని, రోడ్లపైకి తీస్తున్న ఆ వాహనాలను ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పట్టుకుపోతున్నారు. రోడ్లపై ఉన్నా.. పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్నా.. ఇళ్లలో ఉన్నా వీటిని రవాణా శాఖ సీజ్ చేస్తోంది. -
డీజిల్ కార్ల విక్రయాలకు బ్రేకులు..!
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం దాకా జోరుగా సాగిన డీజిల్ వాహనాల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ఇంధనాల రేట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతుండటం, డీజిల్ వాహనాల వినియోగంపై నియంత్రణలతో అనిశ్చితి తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. డీజిల్ వాహనాల డిమాండ్ తగ్గుతోందనడానికి ఇటీవలే కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టిన పలు ఆటోమొబైల్ సంస్థలు ఎదుర్కొన్న పరిస్థితే నిదర్శనం. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం మూణ్నెల్ల క్రితం తమ కంపాక్ట్ యుటిలిటీ వాహనం ఫ్రీస్టయిల్ను పెట్రోల్, డీజిల్ వేరియంట్స్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సాధారణంగా యుటిలిటీ వెహికల్స్‌కి సంబంధించి కొనుగోలుదారులు ఎక్కువగా డీజిల్ వేరియంట్ వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే, ఫ్రీస్టయిల్కి వచ్చిన బుకింగ్స్‌లో ఏకంగా 65 శాతం పెట్రోల్ వేరియంట్స్వి కాగా, డీజిల్ వాహనాలకు వచ్చిన బుకింగ్స్ కేవలం 35 శాతమే. ఈ ధోరణి కంపెనీని ఆశ్చర్యపర్చింది. మరో నెల రోజుల అనంతరం ఇంకో దిగ్గజం హోండా .. అమేజ్ కారులో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దానికి కూడా దాదాపు ఫ్రీస్టయిల్ అనుభవమే ఎదురైంది. 2013లో అమేజ్ తొలితరం కారును ప్రవేశపెట్టినప్పటికి.. ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయని రూఢీ చేసింది. అప్పట్లో అమేజ్ కారుకొచ్చిన బుకింగ్స్‌లో ఏకంగా 80 శాతం వాటా డీజిల్ వేరియంట్‌దే ఉంది. డిమాండ్‌కి అనుగుణంగా సరఫరా చేసేందుకు డీజిల్ కార్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సి వచ్చింది కూడా. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ పరిస్థితి చాలా మటుకు మారిపోయింది. మారుతున్న ప్రాధాన్యాలు.. దేశీయంగా డీజిల్ ఇంజిన్ టెక్నాలజీ ఇటీవలి కాలంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. వివిధ సందర్భాల్లో డీజిల్ వాహనాల వినియోగంపై న్యాయస్థానాలు, ప్రభుత్వాల నుంచి ఆంక్షల రూపంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఢిల్లీ వంటి కీలక మార్కెట్లో నియంత్రణలతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వీటి రీసేల్ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోవడం కూడా చాలా మటుకు కార్ల కొనుగోలుదారులు (యుటిలిటీ వాహనాలు మినహా) డీజిల్ కార్లతో పోలిస్తే ఎక్కువగా పెట్రోల్ కార్లవైపే మొగ్గు చూపేలా చేస్తోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. 2013–14 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్ముడైన కొత్త కార్లలో డీజిల్ కార్ల వాటా 42%గా ఉండగా.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో సగానికి సగం తగ్గి సుమారు 22%కి పరిమితమైంది. పెరగనున్న పెట్రోల్ కార్ల ఉత్పత్తి.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడంపై ఆటోమొబైల్ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు కేవలం పెట్రోల్ కార్లనే తయారు చేసే వ్యూహంలో కూడా ఉన్నాయి. ఇకపై భారత్‌లో నాన్–స్పోర్ట్ యుటిలిటీ వాహనాల్లో కేవలం పెట్రోల్ వేరియంట్ మాత్రమే విక్రయించే దిశగా జపాన్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కసరత్తు చేస్తోంది. ఈ మధ్యే ప్రవేశపెట్టిన యారిస్ సెడాన్ కారులో అసలు డీజిల్ వేరియంట్ లేకపోవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. కంపెనీకి చెందిన మరో కారు కరోలా సెడాన్‌లో పెట్రోల్ వేరియంట్స్ అమ్మకాలు 75% నుంచి 89%కి పెరగడం కూడా ఈ వ్యూహానికి కారణం కానుంది. సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం.. డీజిల్ కార్లకు భారీగా డిమాండ్ ఉండేది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా డీజిల్ ఇంజిన్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాయి. కానీ ఆ తర్వాత.. కొన్నాళ్లు పెట్రోల్.. మళ్లీ డీజిల్.. తిరిగి పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరిగింది. రాబోయే రోజు ల్లోనూ కొన్ని సెగ్మెంట్స్‌లో పెట్రోల్ ఆధిపత్యమే ఉంటుందని.. అయితే మరికొన్ని విభాగాల్లో డీజిల్‌కి డిమాండ్ కొనసాగవచ్చని ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాహ్ మెహ్రోత్రా అభిప్రాయపడ్డారు. యూవీల్లోనూ పెట్రోల్ జోరు .. యుటిలిటీ వాహనాల్లో (యూవీ) డీజిల్ వేరియంట్స్దే ఆధిపత్యం ఉంటున్నప్పటికీ.. క్రమంగా పెట్రోల్ వేరియంట్స్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2011–12లో యూవీల అమ్మకాల్లో పెట్రోల్ వేరియంట్స్ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి పెరిగింది. మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను తీసుకుంటే (యూవీలు, కార్లు, వ్యాన్లు సహా) డీజిల్ వాహనాల వాటా 38%కి తగ్గింది. 2016–17లో ఇది 40 శాతంగా ఉంది. అదే 2012–13 గణాంకాలు తీసుకుంటే డీజిల్ వాటా ఏకంగా 58 శాతంగా ఉండేది. మరింత గడ్డుకాలం.. డీజిల్ కార్ల విక్రయాలు ఇంకా పడిపోయే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయంటున్నాయి మార్కెట్‌వర్గాలు. 2020 ఏప్రిల్ నుంచి భారత్ స్టేజ్ సిక్స్(బీఎస్–6) ఉద్గార ప్రమాణాలు అమల్లోకి వచ్చాయంటే డీజిల్, పెట్రోల్ కార్ల రేట్ల మధ్య వ్యత్యాసం మరింతగా పెరిగిపోనుంది. ప్రస్తుతం ఈ రెండింటి ధరల మధ్య తేడా సుమారు రూ. లక్ష ఉండగా.. ఇది రూ. 2 లక్షలకు పెరిగిపోవచ్చని అంచనా. అదే జరిగిందంటే.. మెరుగైన ప్రత్యామ్నాయంగా మరింత మంది కొనుగోలుదారులు పెట్రోల్ కార్లవైపే మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ముందుగానే పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం..
గాలి కాల్యుష్యంపై ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాలి నాణ్యతను పెంచేందుకు పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం కూడా చేపట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ నిషేధాన్ని ఇంకా కాస్త ముందుగానే చేపట్టబోతున్నాయి. కొత్త డీజిల్, పెట్రోల్ కార్ల విక్రయాలను ముందుగా నిర్ణయించిన దానికంటే 10 ఏళ్లు ముందుగా అంటే 2030 నుంచే నిషేధించబోతున్నట్టు లండన్ మేయర్ సదిక్ ఖాన్, బ్రిటన్‌లోని ఇతర నగరాల నేతలు సోమవారం ప్రకటించారు. ప్రధానమంత్రి థెరెస్సా మే కన్జర్వేటివ్ ప్రభుత్వం 2040 నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గతేడాది పేర్కొంది. ప్రస్తుతం ఆ గడువును పదేళ్లు ముందుకు జరిపారు ఈ నేతలు. అయితే హైబ్రిడ్ వాహనాలను కూడా నిషేధిస్తారా? లేదా? అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. ఖాన్‌తో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో మాంచెస్టర్, లివర్‌పూల్, ఆక్స్ఫర్డ్, షెఫీల్డ్, బ్రిస్టల్ నుంచి వచ్చిన నేతలున్నారు. కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై త్వరగా నిషేధం విధించే విషయంపై సమగ్రంగా చర్చించారు. నగరాల్లో క్లీన్ ఎయిర్ జోన్స్‌ను అందించడానికి 2030 నుంచే ఈ నిషేధాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు ఖాన్ చెప్పారు. అదేవిధంగా నేషనల్ వెహికిల్ రెన్యూవల్ స్కీమ్ కూడా గాలి నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. -
ఇక కార్ల ధరలు మోతే..?
సాక్షి, న్యూఢిల్లీ:భారతదేశంలో డీజిల్ వాహనాలు, ఇతర ఖరీదైన కార్లు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి. కొత్త కార్లపై దేశవ్యాప్తంగా కొత్త ఏకీకృత పన్ను అమలుకు రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. అన్ని రకాల వాహనాలపై వన్ నేషన్-వన్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మంటలు పుట్టిస్తోంటే వాహనదారులకు మరో షాక్ తగిలింది. అలాగే డీజిల్ వాహనాలపై పన్నును 2శాతం పెంచాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించి. విద్యుత్ వాహనాలపై పన్నులు తగ్గించాలని సిఫారసు చేసింది. డీజిల్ వాహనాలపై 2 శాతం వరకు పన్నులు విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. అలాగే శుక్రవారం వరుస ట్వీట్లు చేసింది. తాజా పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అటు డీజిల్ వాహనాలు, ఇటు ఎస్‌యూవీల ధరలు కొండెక్కడం ఖాయం. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులను మరింత తగ్గించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వాహనాల కోసం ప్రత్యామ్నాయ ఇంధనాన్ని, విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహమిచ్చే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తగ్గించాలని కోరింది. ప్రస్తుతం వీటిపై 12శాతం పన్ను ఉంది. దీన్ని మరింత తగ్గిస్తే వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని మంత్రిత్వ శాఖ ఆలోచన. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ప్రతిపాదనల ప్రకారం డీజిల్ వాహనాలపై పన్ను 2శాతం పెరగనుంది. ప్రస్తుతం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల డీజిల్ కార్లపై 31శాతం పన్ను ఉంది. తాజా ప్రతిపాదనలతో ఇది 33శాతం కానుంది. దీంతో జీఎస్టీకి ముందు డీజిల్ కార్లపై పన్నులు ఎలా ఉండావో.. మళ్లీ అలాగే ఉండనున్నాయి. కాగా తాజా ప్రతిపాదనలు ఎపుడు అమల్లోకి వచ్చేది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. 1/4 GoM on Transport deliberates upon One Nation- One Tax and One Nation- One Permit in Guwahati today.@nitin_gadkari @transform_ind @PMOIndia pic.twitter.com/xpspqN1hz8 — MORTHINDIA (@MORTHIndia) April 20, 2018 -
జేఎల్ఆర్లోఉద్యోగాల కోత
లండన్ : టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉద్యోగులపై వేటు వేస్తోంది. 1000 మంది ఉద్యోగులను తీసేస్తూ... తన రెండు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించనున్నట్టు జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ప్రకటించింది. ఓ వైపు బ్రెగ్జిట్, మరోవైపు డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గిపోవడం, రెగ్యులేటరీ సమస్యలు వంటి కారణాలతో ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు జేఎల్ఆర్ తెలిపింది. జాగ్వార్ విక్రయాలు ఈ ఏడాది 26 శాతం తగ్గగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తన రెండు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వెయ్యి మంది తాత్కాలిక ఉద్యోగులను తీసేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. యూకేలో జేఎల్ఆర్ కంపెనీలో 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు ఏడాదికి 5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. సోలిహుల్ వద్ద 1000 ఏజెన్సీ స్టాఫ్ తమ కాంట్రాక్ట్‌లను రెన్యూవల్ చేయించుకోలేదని కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అదేవిధంగా మరో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ సైట్లో 362 మంది శాశ్వత ఉద్యోగులను సోలిహుల్కు తరలించినట్టు పేర్కొన్నారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ వల్ల యూరోప్‌లో జేఎల్ఆర్ వాహనాలకు డిమాండ్ తగ్గి, విక్రయాలు పడిపోయాయి. డీజిల్ వాహనాలకు డిమాండ్ భారీగా తగ్గిందని జేఎల్ఆర్ చెబుతోంది. ఈ ఏడాది మొదట్లో కూడా జేఎల్ఆర్ తన ఉత్పత్తి తగ్గించింది. జేఎల్ఆర్ ఉత్పత్తి చేసే వాహనాల్లో 90 శాతం డీడిజల్ ఇంజిల్వే. జేఎల్ఆర్ ఉద్యోగాల కోత ప్రకటించడంతో, భారత స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేర్లు సుమారు 5 శాతం మేర కిందకి పడిపోయాయి. రూ.351.50 వద్ద ప్రారంభమైన కంపెనీ స్టాక్, ఇంట్రాడేలో రూ.337.90 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. చివరికి రూ.338.95 వద్ద ముగిసింది. -
కోటిన్నర కార్ల భవిష్యత్ తేలేది నేడే
2015లో ఫోక్స్‌వాగన్ చీటింగ్ కేసు బయటికి వచ్చినప్పటి నుంచి డీజిల్ ఇంజిన్ కార్లపై ఇటు పర్యావరణవేత్తలు, అటు ప్రభుత్వాలు, కోర్టులు వాటిపై తీవ్ర దృష్టిసారించాయి. కర్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న ఈ కార్లపై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జర్మన్‌లోని కోటిన్నర డీజిల్ కార్ల భవిష్యత్ నేడు తేలబోతుంది. ఈ కార్లు జర్మన్ నగర రోడ్లపై నడవాలో వద్దో జర్మన్ కోర్టు నేడు తేల్చబోతుంది. పర్యావరణ గ్రూప్ డీయూహెచ్ వేసిన దావాలో యూరోపియన్ యూనియన్ పరిమితులకు మించి సుమారు కోటిన్నర డీజిల్ కార్లు ఎక్కువ మొత్తంలో ఉద్గారాలను కలిగి ఉన్నట్టు తెలిసింది. తాజా ప్రమాణాలకు అనుగుణంగా లేని, కాలుష్యం భారీగా ఉన్న డీజిల్ కార్లపై నిషేధం విధించాలని స్థానిక కోర్టులు ఆదేశించాయి. ఈ ఆదేశాలపై జర్మన్ రాష్ట్రాలు అప్పీల్ పెట్టుకున్నాయి. దీనిపై నేడు జర్మన్ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ఈ విషయం కేవలం జర్మన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. మరికొన్ని అతిపెద్ద కార్ల తయారీదారుల ఖండాలకు కూడా విస్తరించింది. పారిస్, మెక్సికో సిటీ, అథెన్స్ అధికారులు కూడా 2025 నాటికి తమ నగరాల్లో డీజిల్ వాహనాలు తిరగకుండా నిషేధం విధిస్తామని తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి తమ నగరంలోకి కొత్త డీజిల్ కార్లు రాకుండా నిషేధం విధిస్తామని ఇటు కోపెన్హాగన్ మేయర్ కూడా చెప్పారు. ఫ్రాన్స్, బ్రిటన్లు కూడా 2040 నాటికి కొత్త పెట్రోల్, డీజిల్ కార్లను బ్యాన్ చేసి, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లోకి మారతామని తెలిపాయి. -
డీజిల్ కారు కొంటే 2 శాతం అదనపు పన్ను!
సాక్షి, హైదరాబాద్: డీజిల్ కారు కొంటే ఇకపై 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించనుంది. ప్రస్తుతం రూ.10 లక్షల లోపు ధర ఉన్న డీజిల్ కారుకు 12 శాతం పన్ను విధిస్తుండగా.. ఇకపై అది 14 శాతానికి పెరుగుతుంది. అదే రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న డీజిల్ కార్లపై పన్ను 16 శాతంగా ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణలో అమ్ముడవుతున్న డీజిల్ కార్ల సంఖ్య ఆధారంగా బేరీజు వేసుకుంటే ప్రభుత్వానికి ఈ అదనపు పన్ను రూపంలో కనిష్టంగా ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే అంత మొత్తం వాహనదారులపై భారం పడినట్లేనన్నమాట. డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సమీప భవిష్యత్తులో ఏకంగా డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధించే యోచన కూడా ఉంది. వాటితో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో నిషేధం అమలులోకి కూడా వచ్చింది. తెలంగాణలో అంత ప్రమాదం లేనందున, డీజిల్ కార్ల కొనుగోలుపై వాహనదారుల్లో ఆసక్తి తగ్గించేందుకు పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 2 శాతం అదనపు పన్ను విధించాలంటూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రెండో వాహనం కొంటే అదనపు భారం లేనట్టే.. ఇక రెండో వాహనం కొనటాన్ని తగ్గించే యోచనతో గతంలో విధించిన రెండు శాతం అదనపు పన్నును ఎత్తేయబోతున్నారు. వాహనం ఏదైనా రెండోది కొంటే 2 శాతం అదనపు పన్ను చెల్లించే విధానం అమలులో ఉంది. దాని వల్ల కొత్త రిజిస్ట్రేషన్లు ఏమాత్రం తగ్గలేదని, ఆ ఆలోచన ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదని రవాణా శాఖ అభిప్రాయపడుతోంది. పైపెచ్చు దాని వల్ల తీవ్ర గందరగోళం నెలకొని వాహనదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యక్తి ఎప్పుడో కొన్న తొలి వాహనాన్ని విక్రయించిన తర్వాత మరో వాహనం కొన్నా ఈ రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. తాను మొదటి వాహనాన్ని వాడటం లేదని, దాన్ని ఎన్నడో అమ్మేసినట్టు మొత్తుకున్నా అధికారులు వినటం లేదు. మరోవైపు కొన్ని వర్గాల్లో ఎక్కువ మందికి ఒకే రకం పేర్లు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వారి తండ్రుల పేర్లు కూడా ఒకేలా ఉంటున్నాయి. అలాంటి వారు తొలి వాహనం కొన్నా, అదే పేరున్న మరో వ్యక్తికి అప్పటికే ఓ వాహనం ఉంటే, దాన్ని మరొకరు రెండో వాహనం కొన్నట్టుగా పొరబడుతూ అధికారులు ఈ రెండు శాతం పన్ను విధిస్తున్నారు. తనకు మరో వాహనం లేదని మొత్తుకుంటున్నా, కంప్యూటర్లోని జాబితాలో ఆ పేరు గల వ్యక్తికి అప్పటికే ఓ వాహనం ఉన్నట్టు చూపుతోందని అధికారులు చెబుతున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులకు వెరిఫికేషన్ పెద్ద సమస్యగా మారింది. వీటిని దృష్టిలో ఉంచుకుని రెండో వాహనం కొంటే 2 శాతం అదనపు పన్ను చెల్లించే విధానం ఎత్తేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదించింది. దీన్ని ఎత్తేయటం వల్ల ప్రభుత్వం ఏడాదికి రూ.21 కోట్ల మేర అదనపు రాబడి కోల్పోతుందని నివేదికలో పేర్కొంది. డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించటం వల్ల వచ్చే రాబడితో పోలిస్తే ఇది పెద్ద నష్టం కాదని సూచించింది. -
పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం
ఆటో పరిశ్రమకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధం విధించాలని చైనా వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు దానికి సంబంధించిన పరిశోధనను కూడా ఆ దేశం ప్రారంభించిందని, కానీ ఎప్పడి నుంచి ఈ రద్దు నిర్ణయం అమల్లోకి తీసుకురావాలో ఇంకా నిర్ణయించాల్సి ఉందంటూ ఆ దేశ ఇండస్ట్రి ఉపమంత్రి చెప్పారు. తమ కారు పరిశ్రమ అభివృద్ధి కోసం తీవ్ర మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి జిన్ గుబిన్ జిన్హువాకు చెప్పారు. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయం ఆటోమొబైల్ తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని తెలిసింది. ప్రపంచంలో కార్లకు అతిపెద్ద మార్కెట్‌గా చైనానే ఉంది. ప్రపంచంలో మూడోవంతు కార్లు ఈ దేశంలోనే తయారవుతాయి. ఎక్కువగా చైనా సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడుతుందని, దీంతో కాలుష్యం, కర్బన్ ఉద్గారాల విడుదల ఎక్కువగా జరుగుతుందని తెలిసింది. ఈ కారణంతో చైనా సంప్రదాయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ఇప్పటికే ఈ ప్లాన్‌ను ఆటోమొబైల్ తయారీదారులకు చెప్పింది. 2020 కల్లా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పెట్రోల్-ఎలక్ట్రిక్ వాహనాల షేరును 12 శాతం పెంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేయాలని ఆ దేశ ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీలనూ ఆదేశించింది. గీలి, వోల్వో చైనీస్ యజమాన్యం 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెనాల్ట్-నిస్సాన్, ఫోర్డ్, జనరల్ మోటార్స్ కూడా చైనాలో ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. -
కొత్త పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం
కొత్త డీజిల్, పెట్రోల్ కార్లు, వ్యాన్లపై బ్రిటన్ నిషేధం విధించింది. ఈ వాహనాల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్టు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న ''ఎయిర్ క్వాలిటీ ప్లాన్'' ను బుధవారం బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2040 నుంచి అన్ని వాహనాలు, కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచేవి ఉండేలా ప్లాన్ చేస్తున్నామని గోవ్ చెప్పారు. హైబ్రిడ్ వెహికిల్స్‌తో సహా అన్ని ఇతర ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనున్నట్టు పేర్కొన్నారు. 2040 నుంచి జీరో ఎమిషన్స్ కార్లే రోడ్లపై నడిచేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల వైపుకి మరలుతున్న ఈ ప్రక్రియను ఓ మైలురాయిలాగా గోవ్ అభివర్ణించారు. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. గోవ్ ఈ ప్లాన్‌ను ప్రకటించిన వెంటనే లగ్జరీ ఆటో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ మినీని బ్రిటన్‌లో అసెంబ్లింగ్ చేసినట్టు తెలిపింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్గారాలపై పోరాటం చేయడానికి మంత్రులు కూడా 225 మిలియన్ పౌండ్ల(రూ.2140 కోట్లకు పైగా) ఫండ్‌ను ఆవిష్కరించారు. ఒకవేళ పర్యావరణానికి ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్ను తగ్గించలేకపోయినప్పుడు, స్థానిక అథారిటీలు ఛార్జర్లను ప్రవేశపెట్టేలా లేదా రోజులో కొంత సమయం ఆ వాహనాలపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లోనే ఆ దేశ సంకీర్ణ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీనిలోనే 2050 నుంచి ఎలాంటి పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై నడవకుండా చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. -
భారీ మొత్తంలో ఆడి కార్ల రీకాల్
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ కార్ మేకర్ ఆడి భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల 50 వేల డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కార్ల ఉద్గారాల వృద్ధికిగాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆరు సిలిండర్ల , ఎనిమిది-సిలిండర్ డీజిల్ ఇంజిన్ల కార్లను రీకాల్ చేస్తోంది. ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్లతో ఉన్న కార్ల కోసం "రెట్రోఫైట్ ప్రోగ్రాం" ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ గాఉన్న ఆడి కర్బన ఉద్గారాల కుంభకోణంలో ఆరోపణలుఎదుర్కొంటున్న ఆడి ఈ పరిహార కార్యక్రమాన్ని కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. ఈ రీకాల్ ద్వారా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఉద్గారాలు తగ్గించేందుకు, అలాగే డీజిల్ ఇంజన్ల భవిష్యత్తులో సాధ్యత నిర్వహించాలని ఆడి భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇదే కారణంగా, మరో జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఆటోమొబైల్ దిగ్గజం డైమ్లెర్ ఏజీ కూడా "డీజిల్ ఇంజిన్లు సమగ్ర ప్రణాళిక’’ లో భాగంగా యూరోప్ అంతటా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్, మూడు మిలియన్లకు పైగా డీజిల్ కార్లు రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆడి, డైమ్లెర్ రెండూ కర్బన ఉద్గారాల కుంభకోణంలో నిందిత కంపెనీలే. ఉద్గార పరీక్షల్లో మోసం చేయడానికి ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించాన్న ఆరోపణలున్నాయి. -
డీజిల్ కార్లకు అదనపు పన్ను
- రెండో వాహనానికి మరింత వడ్డింపు - పెట్రోలు కార్లకు మాత్రం మినహాయింపు - ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. త్వరలో ఉత్తర్వు జారీ సాక్షి, హైదరాబాద్: డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ కార్ల పెరుగుదలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వు వెలువడనుంది. దేశ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తీవ్రమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పెరుగుదలకు దోహదం చేస్తున్న డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశంతో... దేశంలో డీజిల్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాతావరణ కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ వాహనాలపై నియంత్రణ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్ స్టేజ్–3 (బీఎస్–3) వాహనాలను పూర్తిగా నిషేధిం చారు. తెలంగాణలో క్రమంగా కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు డీజిల్ కార్ల కొను గోలుకే మక్కువ చూపుతున్నారు. దీంతో ఇక్కడ కూడా వాటిపై మోజు తగ్గేలా చేసేందు కు డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు సమాచారం. రెండో డీజిల్ వాహనానికి మరింత పన్ను రెండో వాహనం కొంటే అదనపు పన్ను విధించే నిబంధనను కూడా సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ వాహనాలకు ఈ పన్ను ను మరింతగా పెంచనున్నారు. ప్రస్తుతం రూ. 10 లక్షలు, అంతకంటే తక్కువ ధర ఉన్న కార్లకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. అంతే విలువైన రెండో కారు కొంటే అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలి. ఇప్పుడు పెట్రోలు కార్లకు ఈ అదనపు పన్ను ఉండదు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. సీఎం సంతకం కాగానే ఉత్తర్వు వెలువడనుంది. ‘రెండో వాహనం పన్ను’ అక్రమాలపై మళ్లీ విచారణ ‘రెండో వాహనం పన్ను’ అక్రమాలపై మళ్లీ విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014–15 సంవత్సరానికి గాను రెండో వాహనం కొన్నవారికి ఈ పన్ను భారం పడకుండా కొంతమంది రవాణాశాఖ సిబ్బంది కమీషన్లు దండుకుని కథ నడిపారు. అప్పటికే ఓ వాహనం ఉందని గుర్తించే సాఫ్ట్వేర్ లేకపోవడం, వివరాల నమోదు లోపభూయిష్టంగా ఉండటాన్ని సిబ్బంది ‘క్యాష్’చేసుకున్నారు. దీంతో నాటి రవాణా కమిషనర్ సుల్తానియా విచారణకు ఆదేశించారు. ఇందులో 200 వాహనాలకు పన్ను వసూలు చేయలేదని, దీనికి పది మంది బాధ్యులని గుర్తించారు. కానీ ఉన్నట్టుండి విచారణను అక్కడితో నిలిపి వేయటమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఆ విచారణను అటకెక్కించేం దుకు సిబ్బంది తరపున కొందరు వకాల్తా పుచ్చుకుని తెరవెనక తతంగం నడిపారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ వ్యవహారం పై కూడా విచారణ జరపాలని నిర్ణయించి నట్టు సమాచారం. అసలు మధ్యలో ఆ విచారణను ఎందుకు ఆపారో తేల్చి సీఎంకు Sనివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. -
పెట్రోల్, డీజిల్ కార్లపై కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : ఖర్చుల్లో అత్యధిక భారమైన ఇంధన వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఇంధన వ్యయాల్లో 60 బిలియన్ డాలర్లను పొదుపు చేసుకోవాలని ప్రభుత్వం మార్గ నిర్దేశం చేసుకుంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎలక్ట్రిక్, షేర్డ్ వాహనాల శాతాన్ని మరింత పెంచడానికి, పెట్రోల్, డీజిల్ కార్లపై వేటు వేయనుందని శుక్రవారం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ కార్లకు పరిమితంగా రిజిస్ట్రేషన్ చేపట్టాలని నీతి ఆయోగ్ రిపోర్టు ప్రతిపాదించింది. పబ్లిక్ లాటరీల ద్వారా ఈ కార్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిమితంగా చేపట్టనున్నట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ఇండియా ట్రాన్స్ ఫర్మేటివ్ మొబిలిటీ సొల్యుషన్స్ పేరుతో ఈ రిపోర్టును విడుదల చేసింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచడానికి సబ్సిడీలను, ప్రోత్సహకాలను అందించాలని చూస్తోంది. న్యూ గ్రీన్ కారు పాలసీ ఇన్ ఇండియా బేసిస్ తో ఈ రిపోర్టు రూపొందించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఒకటి వచ్చేసింది.. ఇంకోటి రాబోతోంది
ఎవరు అవునన్నా... ఎవరు కాదన్నా... పెట్రోలు, డీజిల్ కార్లకు త్వరలోనే కాలం చెల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటి స్థానాన్ని విద్యుత్తుతో నడిచే వాహనాలు తీసుకోవడమూ అంతే నిజం. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఫొటోలో కనిపిస్తున్న వాహనాలు. ఒకటేమో ద్విచక్ర వాహనం మరోటి నాలుగు చక్రాల బండి. కరెంటుతో నడవడం రెండింటిలోనూ కామన్ అంశం. అంతేకాదు... బైక్ మాదిరిగా కనిపిస్తోంది చూశారూ... అదేమో ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 242 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. యూరప్‌లోని క్రొయేషియా కంపెనీ రిమాక్ తయారు చేసిన ఈ బైక్ పేరు గ్రిప్. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల గ్రిప్‌లో దాదాపు మూడు కిలోవాట్స్ (గంటకు) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగని ఛార్జింగ్‌కు ఎక్కువ సేపు పట్టదు. కేవలం 80 నిమిషాల్లో పూర్తిస్థాయిలో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీని ఖరీదు మాత్రం కొంచెం ఎక్కువే. డిమాండ్ పెరిగితే తగ్గే అవకాశం లేకపోలేదు. ఇక పక్కనున్న బుల్లి కారు వివరాలు చూద్దాం. ఇది స్వీడన్లో తయారైంది. పేరు యూనిటి. దీని స్పీడెక్కువ. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇద్దరు హాయిగా కూర్చునేంత స్థలం ఉంటుంది దీంట్లో. ఇంకో విశేషం ఏమిటంటే... దీని విండోస్క్రీన్ టీవీ తెరగానూ పనిచేస్తుంది. దాదాపు 400 కిలోల బరువుండే యూనిటీలో 15 కిలోవాట్ల ఏసీ మోటర్ ఉంటుంది. మరో రెండేళ్లలో అంటే... 2018లో అందుబాటులోకి రానుంది. -
ఆటో పరిశ్రమకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఢిల్లీలో భారీ డీజిల్ వాహనాల నిషేధంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తప్పుడు సమాచారం ఆధారంగా కోర్టులు ఈ నిషేధాన్ని విధించాయంటోంది. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్య వాహనాల నిషేధంతో ఆటో పరిశ్రమ భారీగా నష్టపోయిందని సియామ్ ఆరోపిస్తోంది. ఈ నిషేధం మూలంగా గత 8 నెలల్లో రూ .4,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అశోక్ లేలాండ్ ఎండీ, సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) యొక్క 58 వ వార్షిక సమావేశాలలో మాట్లాడిన దాసరి ఈ విషయాన్ని వెల్లడించారు. వాతారణ కాలుష్యానికి గల అసలు కారణాన్ని గుర్తించకుండా ఆటో పరిశ్రమను నియంత్రించాలని ప్రతివారూ చూస్తున్నారని విమ్శించారు. మీడియా సృష్టించిన హైప్, తప్పుడు సమాచారాన్ని ఆధారంగా కోర్టులు నిషేధం విధించాయన్నారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాహనాలపై నిషేధం విధించడం సరికాదన్నారు. దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 50 శాతం తమదేనని, ముప్పయి మిలియన్ల ఉద్యోగాలను ఆటో పరిశ్రమ కల్పిస్తోందని ఇందుకు చాలా గర్వంగాఉందని దాసరి పేర్కొన్నారు.కానీ ఎక్కడ కాలుష్య ఉన్నా.. ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఆటో పరిశ్రమనే తప్పుపడుతున్నారని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిషేధం పొల్యూషన్ నియంత్రించడానికి ఎంతమాత్రం ఉపయోగపడదని దాసరి వ్యాఖ్యానించారు. పర్యావరణ సెస్ 1 శాతం విధింపు మూలంగా 2000 సీసీ పైన డీజిల్ వాహనాలను ప్రజలుకొనడం మానేస్తారా? దాని వలన ఢిల్లీ నగరంలో కాలుష్యం తగ్గిపోతుందనా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆటో పరిశ్రమకు సవాల్ లాంటిదని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆటో పరిశ్రమ తిరిగి తమ ఇమేజ్ పునర్నిర్మాణానికి కలిసి పని చేయాల్సి అవసరం ఉందని దాసరి పిలుపునిచ్చారు. -
మారుతి వెటారా బ్రెజా పెట్రోల్ వెర్షన్ త్వరలో
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ మేకర్ మారుతి సుజికి తమన సక్సెస్ ఫుల్ కారు విటారా బ్రెజా పెట్రోల్ వెర్షన్ ను కూడా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2017లో దీన్ని మార్కెట్ లో లాంచ్ చేయనుంది. పెట్రోల్ ధరలు తగ్గడం, ఇటీవల పరిణామాల నేపథ్యంలో పెట్రోల్ ఇంజీన్ బ్రెజ్జాను రిలీజ్ చేసేందుకు యోచిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇంధన ధరలు నుండి ఉపశమనం, ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు పెట్రోల్ తో నడిచే వాహనాల వైపే మొగ్గు చూపడం కారణాలుగా భావిస్తున్నాయి. దీనికి తోడు డీజిల్ వాహనాలకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కఠినమైన వైఖరి మూలంగా మారుతి తన హ్యాచ్ బ్యాక్ మోడళ్లను పెట్రోల్ వెర్షన్ లో కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంటున్నారు. డీజిల్ ఇంజీన్ కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజా వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నప్పటికీ మరింతమంది యూజర్లను ఆకట్టుకునేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో ఎబీఎస్ అండ్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. అంతేకాకుండా దీనిలో టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, ఆపిల్ కార్ప్లే, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఈ పెట్రోల్ వెర్షన్ లో కూడా లభించనున్నాయి. పెట్రోల్ ఇంజీన్ తో విటారా బ్రెజా లాంచ్ అయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ , టియువి300 తో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. -
ఆ వెహికిల్స్ పై ఢిల్లీలో నిషేధం
-
పదేళ్లు దాటిన వాహనాలకు శరాఘతం
-
ఆ వెహికిల్స్ పై ఢిల్లీలో నిషేధం
న్యూఢిల్లీ : దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో పదేళ్లకు పైబడిన అన్ని డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. పదేళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ నూ వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ ఆర్టీవోకు పేర్కొంది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్లపై ఇక కనిపించవద్దని కూడా చెప్పింది. ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. పర్యావరణ సమస్యపై ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే డి-రిజిస్ట్రర్ చేసిన వాహనాల సమాచారాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్ ట్రాఫిక్ పోలీసుకు ఢిల్లీ ఆర్టీవో వెంటనే అందించాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆర్డర్ ను పబ్లిక్ గా నోటీసు ప్రచురితం చేయాలని కూడా ఢిల్లీ ఆర్టీవోకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే 15ఏళ్లు దాటిన వాహనాలను ఢిల్లీలో రద్దు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే పాత వాహనాలను కూడా నిలిపివేయాలని ట్రిబ్ర్యునల్ అభిప్రాయం వ్యక్తంచేసింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలతో ముంచుకొస్తున్న కాలుష్య ముప్పును నివారించేందుకు, వెంటనే ఆ వాహనాలను ఢిల్లీలో నిషేధించాలని ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కోరిన సంగతి తెలిసిందే. డీజిల్ కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, హృద్రోగ సమ్యలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు దేశంలోనే అత్యధిక వాయుకాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు రకరకాల చర్యలను తీసుకుంటున్నారు. సరి-భేసి విధానం ప్రయోగాత్మకంగా రెండుసార్లు అమలు చేసింది కూడా ఈ కారణంతోనే. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వాహనదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. -
పదేళ్లు దాటిన వాహనాలకు శరాఘతం
న్యూఢిల్లీ: పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను వెంటనే నిషేధించాలని నేసనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ ఆదేశాలు ఉన్నపలంగా సత్వరమే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్లపై ఇక కనిపించవద్దని కూడా చెప్పింది. ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. పర్యావరణ సమస్యపై ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనే అత్యధిక వాయుకాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు రకరకాల చర్యలను తీసుకుంటున్నారు. సరి-భేసి విధానం ప్రయోగాత్మకంగా రెండుసార్లు అమలు చేసింది కూడా ఈ కారణంతోనే. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వాహనదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. -
భారీ మొత్తంలో ఫోక్స్ వాగన్ నష్టపరిహారం
శాన్ ఫ్రాన్సిస్కో : కర్బన ఉద్గారాల స్కాంకు పాల్పడినందుకు జర్మన్ కార్ల తయారీదారు ఫోక్స్ వాగన్ భారీ మొత్తంలో సెటిల్ మెంట్ కుదుర్చుకుంది. ఈ దావా కేసులో నష్టపరిహారంగా 1500 కోట్ల డాలర్లును నగదు రూపంలో చెల్లించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాలుష్యానికి పాల్పడిన డీజిల్ వాహనాలను బాగుచేయడం కాని, బై బ్యాక్ చేయడం కాని చేస్తామని ఒప్పుకున్నట్టు ఒప్పంద చర్చల ఓ అధికారి చెప్పారు. స్కాంకు పాల్పడిన కార్లు కొన్న ప్రతి యజమానికి 1500 కోట్ల డాలర్ల కింద 10వేల డాలర్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. అమెరికా ఆటో స్కాండల్ సెటిల్ మెంట్ లో ఇదే అతిపెద్ద మొత్తమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెటిల్ మెంట్ ను కంపెనీ మంగళవారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ, ఫోక్స్ వాగన్ స్పందించడానికి తిరస్కరించాయి. . 1000 కోట్ల డాలర్లను యజమానులకు బైబ్యాక్ ఆఫర్ ను ప్రకటిస్తుండగా.. దాదాపు 500 కోట్ల డాలర్లను కర్బన ఉద్గారాలకు నష్టపరిహారంగా.. జీరో ఉద్గారాలకు తెచ్చుకోవడానికి ఫండ్స్ చెల్లిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.అయితే ఈ సెటిల్ మెంట్ వ్యవహారంలో మరో వెర్షన్ చీటింగ్ పాల్పడిన 3 లీటర్ల ఫోక్స్ వాగన్ డీజిల్ వాహనాలకు వర్తించదని తెలుస్తోంది. ఇప్పటికే ఫోక్స్ వాగన్ జరిమానాల మీద జరిమానాలు భరించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. 2.0 లీటర్ డీజిల్ ఫోక్స్ వాగన్ 2009-15 కార్ల యజమానులు సెప్టెంబర్ నాటి అంచనా విలువతోపాటు కనీసం 5,100 డాలర్లను నష్టపరిహారంగా పొందుతారని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఓనర్లు 10వేల డాలర్లను నష్టపరిహారంగా పొందచ్చని, కారు విలువను బట్టి నష్టపరిహారం ఉంటుందని పేర్కొంటున్నారు. 2015 సెప్టెంబర్ 18న ఈ స్కాం బయటికి పొక్కింది. స్కాండల్ మొదలైనప్పటినుంచి ఫోక్స్ వాగన్ డీజిల్ సగటు విలువ 19 శాతం పడిపోయింది. జడ్జి అనుమతితో ఈ సెటిల్ మెంట్ అమల్లోకి రానుంది. -
డీజిల్ వాహనాల నిషేధం పరిష్కారం కాదు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఢిల్లీ రోడ్లపై డీజిల్ వాహనాలను నిషేధిస్తూ తీర్పును ఇవ్వడం సరైంది కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఇది దురదృష్టకరమైన నిర్ణయమని అన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నిర్ణయం కొత్త టెక్నాలజీతో తయారయ్యే వాహనాలపై పడుతుందని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్యనిర్వాహక శాఖ చేస్తున్నకృషిని న్యాయశాఖ అభినందిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. చట్టాలు రూపొందిచడం కార్యానిర్వాహక శాఖ పని అని దానిలో లోపాలుంటే చెప్పడం న్యాయశాఖ విధి అని జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు భారీ డీజిల్ వాహనాలను న్యాయస్థానం గతేడాది డిసెంబర్ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. -
నిషేధం అమలు మరో 11 సిటీల్లో ?
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం మరో 11 సిటీలపై కూడా విధించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) నేడు నిర్ణయం తీసుకోనుంది. 11 సిటీల్లో గాలి కాలుష్య డేటా ఆధారంగా ఎన్ జీటీ ఈ నిషేధాన్ని ఆ ప్రాంతాలకు కూడా విధించనుంది. ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పట్నా, లక్నో, అలహాబాద్, కాన్పూర్, వారణాసి, పుణే, నాగ్ పూర్, లుథీనా, జలంధర్, అమృత్ సర్ వంటి సిటీలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని పరిసర ప్రాంతాల్లో రెండు లీటర్లు, అంతకు ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ వాహనాలను నిషేధిస్తున్నట్టు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో ఎక్కువ డీజిల్ ఇంజన్ సామర్థ్యమున్న వాహనాల అమ్మకాలు జరగడం లేదు. ఇదే నిషేధాన్ని కేరళలో కొన్ని సిటీల్లో కూడా ఇటీవలే విధించారు. దీంతో ఆటో పరిశ్రమలో పెట్టుబడులు కోల్పోయాయి. 11వేల వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల్లో ఉద్యోగులపై పడి, 5,500 మంది ఉద్యోగాలు కోల్పోయారని భారత ఆటో మొబైల్ తయారీదారుల సొసైటీ(సియామ్) పేర్కొంది. ఒకవేళ ఈ నిషేధం దేశమంతటా విధిస్తే దాదాపు 44 వేల ఉద్యోగాలకు నష్టం చేకూరుతుందని సియామ్ రిపోర్టు నివేదించింది. ఈ నిషేధం నిర్ణయం ఆటో పరిశ్రమల్లో తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. ఉత్పత్తి, ఉద్యోగాల్లో నష్టాలు చేకూరుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
పదేళ్లు దాటితే.. కారు షెడ్డుకే!
మీకు డీజిల్ కారు ఉందా.. అది కూడా తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే ఇక దాన్ని షెడ్డుకు పరిమితం చేయాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇది ఢిల్లీ, కేరళలలో మాత్రమే అమలవుతోంది. అచ్చం దేశ రాజధాని ఢిల్లీలోలాగే పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్నాకులం బెంచి ఆదేశిచింది. లాయర్స్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఫోరమ్ (లీఫ్) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనంతరం జస్టిస్ జె.స్వతంత్రకుమార్ నేతృత్వంలోని బెంచి ఈ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పదేళ్లు దాటిన నెల రోజుల తర్వాత కూడా అలాంటి వాహనాలను నడిపిస్తుంటే రూ. 10 వేల జరిమానా విధించాలని కూడా ఆదేశించారు. కొచ్చి నగరం అత్యంత కలుషిత నగరంగా ముద్ర పడిందని, కేరళలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల పరిస్థితి కూడా ఇంతేనని పిటిషన్లో పేర్కొన్నారు. పాత కాలం నాటి లారీలు, బస్సుల నుంచి వెలువడుతున్న విషవాయువులను వెంటనే అరికట్టాలని కోరారు. -
ఆ నిషేధం 5వేల ఉద్యోగాలకు గండికొట్టింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో(ఎన్ సీఆర్ రీజియన్) డీజిల్ కార్ల, 2000 సీసీ ఇంజన్ సామర్థ్య ఎస్ యూవీల రాకపోకలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఆటో పరిశ్రమలోని ఉద్యోగులకు గండిపడింది. ఆటో సెక్టార్ లో 5వేల ఉద్యోగాలపై ప్రభావం చూపిందని ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంస్థ(సియామ్) తెలిపింది. నిషేధం అమలులోకి వచ్చిన డిసెంబర్ 16 నుంచి ఆగష్టు 30 వరకు దాదాపు 11వేల యూనిట్ల ఉత్పత్తిని ఆటోమొబైల్ పరిశ్రమ నష్టపోయిందని పేర్కొంది. నిషేధం వల్ల ఏర్పడిన నష్టాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టుకు సియామ్ రిపోర్టు నివేదించింది. సుప్రీంకోర్టు ఆంక్షల ప్రభావాన్ని గ్రౌండ్ లెవల్ గానే పేర్కొన్నామని, ఒకవేళ ఈ నిషేధాన్ని దేశమంతటా అమలుచేసి ఉంటే, లక్ష వాహనాల ఉత్పత్తిని నష్టపోయేవారని.. ఇదే సమయంలో 47వేల ఉద్యోగాలకు కూడా కోత పడేదని రిపోర్టులో పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతంలో నిషేధానికి గురైన వాహనాలను నాన్-ఎన్ సీఆర్ ప్రాంతాల డీలర్లకు తరలించారని తెలిపింది. డీజిల్ వాహనాలపై పర్యావరణ నష్టపరిహార చార్జీల(ఈసీసీ) లెవీని వ్యతిరేకిస్తే, ఈ నిషేధం దేశంలో మిగతా ప్రాంతాలకు కూడా వర్తింపజేస్తారని, దానివల్ల ఈ పరిశ్రమలో ఉద్యోగులు శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆటో మొబైల్ పరిశ్రమ సంస్థ వెల్లడించింది. ఇప్పుడే కాక, భవిష్యత్తులోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను నష్టపోతారని సియామ్ రిపోర్టులో తెలిపింది. ఇప్పటికే ఈ నాలుగు చక్రాల వాహనాల నిషేధంపై చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు అయ్యాయి. -
డీజిల్ కార్లకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2000 సీసీ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన కొత్త కార్ల వినియోగానికి మంగళవారం సుప్రీంకోర్టు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. డీజిల్ కార్లు సాధారణ వాహనాల కంటే ఎక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయని కోర్టు నమ్మిందనీ... ఈ విషయం తప్పు కూడా కావొచ్చని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంజన్ సామర్థ్యం, కారు ధరను బట్టి ఓనర్లందరూ వన్ టైమ్ పర్యావరణ సెస్ కట్టాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రాజధాని ప్రాంతం నుంచి డీజిల్ కార్లను తొలగించడంపై ఢిల్లీ ప్రభుత్వం, వాతావరణ కాలుష్య పర్యవేక్షణ సంస్థ, టాక్సీ ఓనర్ అసోసియేషన్లను రోడ్ మ్యాప్ చూపాలని ఆదేశించింది. డీజిల్ కార్లు మాత్రమే వాతావరణ కాలుష్యానికి కారణం కాదని.. పెట్రోల్, సీఎన్జీలు కూడా కాలుష్యానికి కారణమవుతాయని, పెట్రోలు కార్లు కార్బన్ మోనాక్సైడ్, సీఎన్జీ కార్లు నైట్రోజన్ ఆక్సైడ్ లను విడుదల చేస్తాయని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. మేక్ ఇన్ ఇండియా పాలసీలో ఆటో మొబైల్ రంగానికి ప్రాధాన్యతనిచ్చారని, కాలుష్యం కారణంగా పాలసీని విరమించుకోలేమని రంజిత్ కోర్టుకు తెలిపారు. 2015లో ఐఐటీ కాన్పూర్ చేసిన సర్వే ఆధారాలను చూపుతూ.. దుమ్ము, సహజంగా మంటల కారణంగా వచ్చే కాలుష్యాన్ని ఎవరూ ఆపలేరని, డీజిల్ కార్లకు రాజధాని ప్రాంతంలో సడలింపునివ్వాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం లగ్జరీ కార్ల వినియోగానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. -
దేశం నుంచి బీపీఓ పరిశ్రమ ఔట్!
కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డీజిల్ క్యాబ్‌లపై నిషేధం విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇలా నిషేధం విధిస్తే బీపీఓ పరిశ్రమ మొత్తం దేశం నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపింది. బీపీఓ ఉద్యోగులంతా దాదాపు కంపెనీలు ఏర్పాటుచేసే క్యాబ్‌లలోనే ఆఫీసులకు, ఇళ్లకు వెళ్తారు. వాటిలో చాలావరకు డీజిల్ వాహనాలే. ఈ పరిశ్రమ నుంచి ప్రతియేటా దేశానికి దాదాపు వంద కోట్ల డాలర్లకు పైగా ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు ఈ నిషేధం నిర్ణయం వల్ల మన దేశం నుంచి బీపీఓ పరిశ్రమ వేరే దేశానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనానికి సాలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలో దశల వారీగా మొత్తం డీజిల్ క్యాబ్‌లు అన్నింటినీ ఢిల్లీ రోడ్ల నుంచి తీసేయిస్తామని, అంతవరకు గడువు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కూడా కోర్టును కోరింది. ఢిల్లీ రోడ్లపై డీజిల్ క్యాబ్‌లు నడవడానికి వీల్లేదంటూ తాము పెట్టిన మే 1వ తేదీ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు ఏప్రిల్ 30న నిరాకరించింది. అయితే బీపీఓ ఉద్యోగుల భద్రత అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఈ పరిశ్రమ మనుగడను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర చెప్పింది. తమ ఉద్యోగులకు అసౌకర్యంగా ఉంటే బీపీఓ పరిశ్రమ దేశం నుంచి వెళ్లిపోవచ్చని, అది దేశ ఆర్థిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతుందని సాలిసిటర్ జనరల్ అన్నారు. అయితే, బీపీఓ కంపెనీలు బస్సులను అద్దెకు తీసుకుని తమ ఉద్యోగులకు పికప్, డ్రాప్ అందించొచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. -
ఢిల్లీలో అమల్లోకి డీజిల్ క్యాబ్‌ల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో డీజిల్ క్యాబ్‌లపై ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి రావడంతో 27 వేల వాహనాలు రోడ్డెక్కలేదు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదివారం కావడంతో నిషేధం వల్ల ప్రజా రవాణాకు పెద్ద ఇబ్బంది లేకపోయినా... నేటి నుంచి క్యాబ్‌ల కొరత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా ఉబర్ క్యాబ్స్ చార్జీల్ని ఒక్కసారిగా పెంచేసింది. డీజిల్‌తో నడిచే క్యాబ్‌లను సీఎన్జీకి మార్చేందుకు గడువు పెంచాలన్న విజ్ఞప్తిని శనివారం సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో 2 వేల ట్యాక్సీల్ని డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చారు. -
సుప్రీంకోర్టు అనూహ్య తీర్పు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో విపరీతంగా పెరిగిపోతోన్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను సమర్థిస్తూ, డీజిల్ వాహనాలపై సైతం నిషేధం విధించిన సుప్రీంకోర్టు.. ఆ వాహనాలను మళ్లీ అనుమతిస్తూ శనివారం అనూహ్య తీర్పు ఇచ్చింది. ఢిల్లీ పోలీస్, ఢిల్లీ జలమండల్ లకు వాహనాల కొరత తీవ్రంగా ఉండటంతో 460 హెవీ డ్యూటీ డీజిల్ వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. దీంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీ రోడ్లపై మళ్లీ డీజిల్ వాహనాలు దూసుకుపోనున్నాయి. వీవీఐపీల భద్రతతోపాటు విచారణ ఖైదీల తరలింపు, శాంతిభద్రతల పర్యవేక్షణకుగానూ పోలీస్ శాఖ 190 డీజిల్ వాహనాలు, నీటి సరఫరా కోసం జలమండలికి 290 ట్యాంకర్లు అవసరం ఉంది. ఈ మేరకు రూ.2000కోట్లతో ఆ వాహనాలు కొనుగోలుచేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఢిల్లీలో డీజిల్ వెయికిల్స్ పై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరైంది. ఈ వాహనాలు సాధారణ డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లేవే అయినప్పటికీ ఢిల్లీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాలుష్య నియంత్రణ మండలికి భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలని పోలీస్ శాఖ, జలమండలిలను కోర్టు ఆదేశించింది. ఆ రెండు శాఖలు వాహనాల కొనుగోలుకు అయ్యే ఖర్చు (రూ.2000 కోట్ల)లో 30 శాతాన్ని(రూ.600 కోట్ల) పరిహారాన్ని చెల్లించనున్నాయి. -
డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ ?
న్యూఢిల్లీ: డీజిల్ వాహనాలతో ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. డీజిల్ ఉద్గారాలు మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఎ) అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టుముందు ఉంచనుంది. డీజిల్ వాహనాలను నియంత్రించే లక్ష్యంతో సుప్రీం కోర్టు లో ఏప్రిల్ 30 న ఒక రోజంతా విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈపీసీఎ ఈ తాజా ప్రతిపాదను చేయనున్నట్టు సమాచారం. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్వైరాన్ మెంట్ సెంటర్ ( సీఎస్ సీ) మంగళవారం డీజిల్ ఉద్గార సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ సూచన చేసింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రతినిధి రే మింజారేస్ 'డీజిల్ ఉద్గారాలు- తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు' అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజల్ యొక్క ఆరోగ్య ప్రభావాలపై కెనడా ప్రభుత్వం ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక సహా మూడు నివేదికలను వివరించారు. డీజల్ కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, హృద్రోగ సమ్యలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నివేదించారు. ఈ సమస్యపై కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాని తెలిపారు. ఈ రిపోర్టును సుప్రీం ముందుంచాలని ఆయన సూచించారు. మార్చి 2016లో భారత ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ నిర్వహించిన పరీక్షల్లో దాదాపు లక్షన్నర డీజిల్ కార్లు అత్యధిక కార్బన్ ఉద్గారాలను కలిగివున్నట్టు తేలిందని ఐసిసీటీ మరో అధికారి ఫాంటా తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న విధానాన్ని సమీక్షించాలని, ఉద్గార ప్రమాణాలపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. కాగా పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు 2016-17 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై 1 శాతం, డీజిల్ కార్లపై 2.5 శాతం, విలాసవంతమైన కార్లు, ఎస్‌యూవీలపై 4 శాతం పన్ను,పదిలక్షల విలువదాటిన కార్లపై1 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. మరి ఈపీసీఎ సూచనలపై సుప్రీం ఎలా స్పందించనుందో వేచి చూడాలి. -
డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా
కాలుష్యభూతం కోరలు చాస్తున్న దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీ డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. 2000 సీసీ దాటిన డీజిల్ ఎస్‌యూవీలు, కార్ల అమ్మకాలపై మార్చి 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువరించింది. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఇకమీదట అసలు కొత్త డీజిల్ వాహనాలను రిజిస్టర్ చేయకూడదని ఇంతకుముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో డీజిల్ కార్ల కొనుగోళ్లు ఆపాలని ఎన్జీటీ తెలిపింది. జనవరి 6వ తేదీన తదుపరి విచారణ జరిగేవరకు ఇవి తాత్కాలిక ఉత్తర్వులుగా ఉంటాయని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ కాలుష్యంపై స్పందించింది. 2005 కంటే ముందుగా రిజస్టర్ అయిన ట్రక్కులను ఢిల్లీ పరిసరాల్లోకి ప్రవేశించకుండా నిషేధించేందుకు సుప్రీం అనుమతించింది. అలాగే, అసలు దేశ రాజధానిలోకి వచ్చే ట్రక్కుల మీద గ్రీన్ టాక్స్‌ను కూడా రెట్టింపు చేసింది. సరి - బేసి సంఖ్యల కోడ్ ఆధారంగా రోజూ రోడ్డుమీదకు వచ్చే కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలన్న ఢిల్లీ సర్కారు నిర్ణయం ఫలితాన్నిస్తుందని తాము అనుకోవట్లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే తాము దాన్ని ఆపబోమని, కావాలంటే కొనసాగించుకోవచ్చని చెప్పింది. అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఇప్పటికే చెడ్డపేరు తెచ్చుకుందని, దేశ రాజధానిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో కూడా ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న మొత్తం కార్లలో 23 శాతం డీజిల్ కార్లే ఉన్నాయి. పెట్రోలు కార్ల కంటే వీటినుంచి ఏడున్నర రెట్లు ఎక్కువగా కలుషిత పదార్థాలు బయటకు వస్తాయి. డీజిల్ పొగ కేన్సర్ కారకం అవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇంతకుముందు హెచ్చరించింది. -
'డీజిల్ కార్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దు'
-
'డీజిల్ కార్లను నిషేధిస్తారా?'
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని బయటపడేసేందుకు ఒక్కో ప్రయత్నం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కాలుష్యానికి ఎక్కువకారణం అవుతున్న డీజిల్ కార్లను నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసనం పేర్కొంది. వచ్చే మంగళవారం నాటికి కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పారు. డీజిల్ కార్లను ఢిల్లీ నగర వీధుల్లో నుంచి పూర్తిగా బహిష్కరించాలా లేక పరిమితులు విధిస్తే సరిపోతుందా అనే అంశాలను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం వెల్లడించనుంది. ఏదేమైనా ఢిల్లీ గుండా ట్రక్కులను వెళ్లకుండా తీసుకునే నిర్ణయానికి సుప్రీంకోర్టు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క, కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న సరి-భేసి పాలసీపై స్పందిస్తూ ఏదో ఒక పరిష్కారంతో సమస్య మొత్తం అంతంకాదని, ఇందుకోసం బహుళకార్యక్రమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. -
ఫేక్ వ్యాగన్
-
కోటి ఫోక్స్‌వ్యాగన్ కార్లలో చీటింగ్ పరికరం
ఫ్రాంక్ఫర్ట్: డీజిల్ కార్లలో కాలుష్యకారక వాయువుల విడుదలను కప్పిపుచ్చే పరికరం వివాదం జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కంపెనీపై అమెరికా క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అటు ఫ్రాన్స్ నుంచి దక్షిణ కొరియా దాకా మిగతా దేశాలు తాము కూడా విచారణ జరపనున్నట్లు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన వాహనాల్లో దాదాపు 1.1 కోటి కార్లలో ఇటువంటి పరికరం ఉండి ఉండొచ్చని సంస్థ వెల్లడించింది. వివాద పరిష్కార వ్యయాల కోసం మూడో త్రైమాసికంలో దాదాపు 7.3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పక్కన పెడుతున్నట్లు, దీని వల్ల లాభాలు కూడా తగ్గొచ్చని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. దీంతో, ఫ్రాంక్ఫర్ట్ స్టాక్ ఎక్స్చేంజీలో క్రితం రోజు 17 శాతం క్షీణించిన కంపెనీ షేరు తాజాగా మరో 23 శాతం పతనమైంది. పూర్తి పారదర్శకతతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఫోక్స్‌వ్యాగన్ యాజమాన్యానికి సూచించారు. ఈ పరిణామాలన్నింటి దరిమిలా సంస్థ సీఈవో మార్టిన్ వింటర్కోర్న్కి కంపెనీ యాజమాన్యం ఉద్వాసన పలకడం దాదాపు ఖరారైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాలుష్యకారక వాయువుల విషయంలో నియంత్రణ సంస్థలను మోసపుచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించిందని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) గుర్తించిన సంగతి తెలిసిందే, దీనికి పరిహారంగా 18 బిలియన్ డాలర్ల మేర పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. -
డీజిల్ కొంటే..వాటర్ ఫ్రీ..
-
పెట్రోలు కార్లకే జనం మొగ్గు!
ఇంధన ధరల్లో తేడా తగ్గటంతో డీజిల్‌పై తగ్గిన ఆసక్తి సాక్షి, బిజినెస్ బ్యూరో : డీజిల్‌కు, పెట్రోల్‌కు మధ్య ధరల్లో తేడా వ్యత్యాసం తగ్గుతోంది. దీంతో డీజిల్ కారుకు ప్రీమియం ధర పెట్టి కొనటమెందుకులే అని భావిస్తున్నట్టున్నారు కొనుగోలుదారులు. ఫలితం... డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి!!. కారు కొనేటపుడు మొదట ఆలోచించేది ఏ బ్రాండ్ కొనాలా అని కాదు... డీజిల్ కారా... లేక పెట్రోల్ కారా అని. ఎందుకంటే ఇంధనమనేది ఆ కారు నడిపినన్నాళ్లూ అవసరమే. పెట్రోల్ ధరలకన్నా డీజిల్ ధరలు చాలా తక్కువ. రోజూ గనక ఎక్కువ కిలోమీటర్లు తిరిగే వాళ్లకు డీజిల్ వల్ల బాగా ఆదా అవుతుంది. అందుకని ప్రీమియం రేటు పెట్టి కొనాల్సి వచ్చినా... డీజిల్ కారు వైపే చాలామంది మొగ్గు చూపేవారు. కానీ ఇపుడా పరిస్థితి మారింది. డీజిల్‌కు, పెట్రోల్‌కు ధరల్లో తేడా తగ్గుతుండటంతో కొనుగోలు దారులు కూడా పెట్రోల్ కార్లకే మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ నెలనే తీసుకుంటే... మొత్తం కార్ల అమ్మకాల్లో డీజిల్ వాటా 34 శాతానికి పడిపోయింది. రీసేల్ మార్కెట్లో డీజిల్ కార్ల విలువ తగ్గుతుండటం, ట్రాలీల వంటి యుటిలిటీ వాహనాల విక్రయాలు తగ్గుతుండటం దీనికి మరో కారణంగా కనిపిస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహనాల్లో 47 శాతంగా ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాలు 2013-14కు వచ్చేసరికి 42 శాతానికి పడిపోయాయి. ఇక 2014-15లో ఈ వాటా 37 శాతానికి పరిమితమైంది. ఈ ట్రెండ్ పర్యావరణానికి మాత్రం మంచిదేనని ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ చెబుతోంది. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ కాలుష్యం కాస్త ఎక్కువ. ఇదీ... డీజిల్ కథ: ఇప్పటిదాకా నియంత్ర ణల్లో ఉంటూ వచ్చిన డీజిల్‌పై గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలను ఎత్తివేసింది. అప్పట్నుంచి దాని ధరలు కూడా మార్కెట్‌ను అనుసరించి హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఒక్క మే నెల్లోనే డీజిల్ ధర ఏకంగా 11 శాతం పెరిగింది. గతేడాది జనవరిలో పెట్రోల్-డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ.18 వరకూ తేడా ఉండగా అక్టోబర్‌లో నియంత్రణలు తొలగించేనాటికి ఈ తేడా కేవలం రూ.11కు తగ్గింది. ప్రస్తుతం ఈ తేడా దాదాపు 16 రూపాయలుగా ఉన్నప్పటికీ ఈ ధరలు మార్కెట్ ప్రకారం కదులుతాయి కనక మున్ముందు మరీ ఎక్కువగా తేడా ఉండదన్నది బహిరంగమే. ‘‘డీజిల్ కార్లు కొనటానికి ప్రధాన కారణం ఇంధన ధరల్లో వ్యత్యాసమే. ఇపుడా వ్యత్యాసం బాగా తగ్గుతోంది కనక పెట్రోల్ కార్లు కొనటానికే ఇష్టపడుతున్నారు. పెట్రోల్ కార్లు డీజిల్ కన్నా చౌక కనక ఇపుడు వీటిని ఎంచుకోవటమే ఉత్తమం. పెపైచ్చు కాస్త ఫన్ని ఇష్టపడేవారు కూడా పెట్రోల్‌కే మొగ్గుతున్నారు’’ అని వోల్వో ఇండియా డిజిటల్ విభాగ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ చెప్పారు. మున్ముందు ఎంట్రీలెవల్, లగ్జరీ, సెడాన్ సెగ్మెంట్లలో పెట్రోల్ వాహనాల వాటా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పదేళ్లకు మించిన డీజిల్ వాహనాలను నడపవద్దని ఆదేశించిన నేపథ్యంలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వినియోగదారులు పెట్రోల్‌కే ఓటేస్తున్నారు. ‘‘ఈ ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. కానీ దాని ప్రభావం మాత్రం అమ్మకాలపై కనిపిస్తోంది’’ అని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. డీజిల్ కార్ల వాటా 30-35 శాతం మధ్య స్థిరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కృత్రిమ ధరలు... కృత్రిమ డిమాండ్ ఇదివరకు డీజిల్ ధరలు కృత్రిమంగా తక్కువగా ఉండేవని, అందుకే డీజిల్ వాహనాలకు కూడా కృత్రిమ డిమాండ్ ఉండేదని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. ‘‘మున్ముందు ఇంధన సామర్థ్యం, వాహన ధర బట్టే డీజిల్ కార్ల అమ్మకాలు ఆధారపడి ఉంటాయి’’ అన్నారాయన. పెట్రోలు వాడకంలో రెండంకెల వృద్ధి కనిపిస్తుండటంతో ఇది కూడా డీజిల్ వాహనాలు తగ్గుముఖం పడుతున్నాయనటానికి తిరుగులేని సాక్ష్యమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోలియం శాఖలోని పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ విభాగం చెబుతున ్న దాని ప్రకారం 2014-15లో డీజిల్ వాడకం 1.5 శాతం పెరగ్గా, పెట్రోల్ వాడకం మాత్రం ఏకంగా 11.4 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో పెట్రోల్ వాడకం 18.7 శాతం, డీజిల్ వాడకం 9.3 శాతం పెరిగాయి. -
మార్కెట్లోకి సెలెరియో డీజిల్
ధర రూ. 4.65 - 5.71 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ సెలెరియో మోడల్లో డీజిల్ వేరియంట్‌ను బుదవారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.4.65 లక్షల నుంచి రూ.5.71 లక్షల శ్రేణిలో ఉంటాయని మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ మాతృసంస్థ సుజుకి రూపొందించిన తొలి డీజిల్ ఇంజిన్, 793సీసీ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించామని పేర్కొన్నారు. ఈ డీజిల్ సెలెరియో 27.62 కి.మీ. మైలేజీనిస్తుందని ఆయన వివరించారు. డీజిల్ కార్లకు డిమాండ్ సెలెరియో మోడల్లో పెట్రోల్ (ధరలు రూ.3.90 లక్షల నుంచి రూ.5 లక్షల రేంజ్లో), సీఎన్జీ (ధర రూ.4.85 లక్షలు) రకాలను కూడా మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తోంది. 2014లో మార్కెట్లోకి తెచ్చిన ఈ కారు ఇప్పటిదాకా 95 వేల యూనిట్లు అమ్ముడుపోయింది. దిగువ స్థాయి హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లో డీజిల్ కార్లకు డిమాండ్ ఉందని తమ కంపెనీ అధ్యయనంలో తేలిందని, అందుకే ఈ డీజిల్ కారును మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. మారుతీ లాంటి కంపెనీలు డీజిల్ కార్లు తయారు చేస్తే కొనడానికి 86 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2020 కల్లా ఏడాదికి 20 లక్షల మారుతీ కార్లు విక్రయించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధన కోసం అధునాతన టెక్నాలజీలతో కూడిన మరిన్ని కొత్త కార్లను అందించనున్నామని తెలియజేశారు. -
దేశ రాజధానిలో పాత వాహనాలకు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ: దేశ రాజధానిలో 10 ఏళ్ల దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ ఢిల్లీ సర్కారు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఢిల్లీలో పర్యావరణాన్ని రక్షించి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు 10 ఏళ్ల పై బడిన డీజిల్ వాహనాలను నిషేధించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కొట్టివేసింది. ఆ వాహనాలపై నిషేధం విధించి వారిని నిరుత్సాహ పరచడం సమంజసం కాదంటూ ధర్మాసనం పేర్కొంది. గత డిసెంబర్ నెలలో 10 ఏళ్ల పై బడిన డీజిల్ వాహనాలతో పాటు, 15 ఏళ్లకు పైగా రోడ్లుపై తిరుగుతున్నపెట్రోల్ వాహనాల నిషేధంపై నిర్ణయం తీసుకున్నా.. ఆ ఉత్తర్వులను ఏప్రిల్ 8 నుంచి అమలు చేసింది. అయితే సుప్రీం తీర్పుతో మరోసారి పాత వాహనాలు దేశ రాజధానిలో చక్కర్లుకొట్టనున్నాయి. -
డీజిల్ వాహనాలపై నిషేధం వాయిదా
రెండు వారాలు వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఎన్జీటీ మే1 లోగా తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం నిషేధం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రభుత్వం ట్రక్కులు నడపబోమని హెచ్చరించిన యజమానులు పాత డీజిల్ కారు వాహనదారులకు ఊరట సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్ల దాటిన అన్ని డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోవలసిందిగా జారీ చేసిన ఆదేశాల అమలును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రెండు వారాల పాటు వాయిదా వేసింది. డీజిల్ వాహనాల నిషేధం అమలు చేస్తే ఎదురయ్యే సమస్యలను తెలుపుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తిని సోమవారం పరిశీలించిన ట్రిబ్యునల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే1న తదుపరి విచారణ జరిపే లోగా నిషేధాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల వరకు డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోరని ఎన్జీటీ చైరపర్సన్, న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. రెండు వారాల పాటు మాత్రమే తమ ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాలుష్యాన్ని కలిగించే పాత డీజిల్ వాహనాలను స్వచ్ఛందంగా తరలించి తుక్కుగా మార్చే వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడంపై సూచనలు సమర్పించ వలసిందిగా కూడా ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా నగరంలో రిజిష్టరయ్యే వాహనాల సంఖ్యపై పరిమితి విధించడం గురించి ట్రిబ్యునల్ ప్రభుత్వ సూచనలను కోరింది. వాహనాలను రోడ్లపై పార్క్ చేయకుండా ఉండడం కోసం పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని చెప్పింది. అంతే కాకుండా వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పార్కింగ్ చార్జీలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగరంలో కాలుష్య స్థాయి ప్రమాద స్థితికి చేరిందని, రాజధాని వాసులకు మెరుగైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ట్రిబ్యునల్ చెప్పింది. నగరంలోని కాలుష్యానికి డీజిల్ ప్రధాన కారణాలలో ఒకటని అభిప్రాయపడిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వును అమలుచేయడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్నే ప్రభుత్వం తరపు న్యాయవాది జుబేదాబేగం సోమవారం ట్రిబ్యునల్‌కు వివరించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వుల వల్ల నగరానికి కూరగాయలు సరఫరా చేసే, చెత్తను ఎత్తే వాహనాలు వ ంటి వాటిపై ప్రభావం పడుతుందని తెలిపారు. తద్వారా నగరవాసుల నిత్యావసర సేవలకు ఇబ్బంది కలుగుతుందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వానికి మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. దాంతో నిషేధాన్ని మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో మే 1 లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ కోరింది. నిషేధం అమలుకు శాస్త్రీయ ఆధారం కలిగిన సూచనలు ఇవ్వాలని, అంతవరకు పాత డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముం దుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ట్రిబ్యునల్ నిషేధం విధించిందని ఫిర్యాదు చేస్తున్న పాత డీజిల్ కారు యజమానులకు ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఊరటనిచ్చింది. పాత వాహనాలపై నిషేధం విధిస్తే ఢిల్లీ దాని పరిసరాలలో ట్రక్కులు నడపబోమని ట్రక్కర్లు హెచ్చరించారు. ఢిల్లీలో పది లక్షల డీజిల్ వాహనాలుండగా 2.5 లక్షల వాహనాలు పదేళ్లు దాటినవని ఒక అంచనా. -
పాత వాహనాలపై నిషేధాన్ని ఎత్తేయండి
వాహనదారుల డిమాండ్ న్యూఢిల్లీ : పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు నగర రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను విరమించుకోవాలని వాహనదారుల సంఘం ఏఐటీఎమ్టీసీ అధ్యక్షుడు భీం వాధ్వా శుక్రవారం డిమాండ్ చేశారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే మార్చి 13 (సోమవారం) అర్ధరాత్రి నుంచి అన్ని వాణిజ్య వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. వాహనదారుల సంఘం శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొందరి ఒత్తిడి కారణంగానే నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల లక్షల సంఖ్యలో ఉన్న ట్రక్కు డ్రైవర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 250 వాహనాలను నగరంలో తిరగకుండా చేశారని చెప్పారు. -
పదేళ్లు వాడి.. పడేయండి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పదేళ్ల కిందటి డీజిల్ వాహనాలన్నింటిని పక్కన పెట్టేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. అలా చేయడం వల్ల విపరీతంగా పెరిగిపోయి ప్రమాదకరంగా మారిన వాతావరణ కాలుష్యం నుంచి ఢిల్లీ ప్రజలను బయటపడేసినట్లవుతుందని పేర్కొంది. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అలాంటి వాహనాలను కూడా నగరంలోకి అనుమతించకూడదని సూచించింది. ఈ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తులతో ఉన్న ట్రిబ్యునల్ కోర్టు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను తీవ్రంగా తప్పుబట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఆ రాష్ట్రాలు విఫలమయ్యాయని పేర్కొంది. -
పదేళ్లు దాటిన డీజిల్ వాహనాల్ని నడపొద్దు
♦ ఆదేశించిన ఎన్జీటీ ♦ ఢిల్లీకి మాత్రమే వర్తింపు ♦ బుధవారం నుంచే తనిఖీలు ♦ వాయు నాణ్యత మెరుగుపరిచేందుకు చర్యలు సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నగరంలో నడపకూడదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మంగళవారం ఆదేశించింది. నగరంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాల కాలుష్య స్థాయి, బరువు, వయసును తనిఖీ చేసే విభాగాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, సంబంధిత సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) 20 గంటల సమయం ఇచ్చింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రో లు వాహనాల జాబితాను ఈ నెల 9 లోగా తనకు సమర్పించాలని ఢిల్లీ, హరియాణా, యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. బుధవారం నుంచి ఆకస్మిక తనిఖీలు బుధవారం నుంచి నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు సరిహద్దుల వద్ద కాలుష్య స్థాయి, బరువు, వయసు తనిఖీలు జరుపుతారు. ట్రిబ్యునల్ నియమించిన స్థానిక కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఢిల్లీ, ఎన్సీఆర్లలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నడపడంపై ఎన్జీటి చైర్పర్సన్, న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నిషేధం విధించింది. తేలిక, భారీ వాహనాలకు ఈ నిషేధం వ ర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు నగరంలోని దాదాపు పది లక్షల వాహనాలకు వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. నిషేధానికి గురయ్యే జాబితాలో ఎక్కువ సంఖ్యలో టాక్సీలున్నాయి. డీజిల్ వాహనాలపై నిషేధంతో పాటు ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలు 28 లక్షలు నగరంలో 15 సంవత్సరాలు దాటిన పెట్రోలు వాహనాల వాడకంపై ఎన్జీటి గతేడాది నవంబర్‌లో నిషేధం విధించింది. నగరంలో 15 ఏళ్లు దాటిన వాహనాలు 28 లక్షలకు పైగా ఉన్నాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. అయితే గడిచిన మూడేళ్లలో రవాణా అధికారులు 1,110 వాహనాలను మాత్రమే స్వాధీనపరచుకున్నారు. గాలిలో ధూళి విడుదల చేస్తూ కాలుష్యానికి తోడ్పడుతున్న అక్రమ నిర్మాణాలపై ధర్మాసనం కఠిన ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలను, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్న ఆనేక ప్రాజెక్టులపై ట్రిబ్యునల్ స్టే విధించింది. లజ్‌పత్‌నగర్, చాందినీచౌక్‌లోని రోడ్ల పక్కన సామాగ్రిని విక్రయించే హాకర్లు, చిల్లర దుకాణాలపై కూడా ఎన్జీటి నిషేధించింది. అనేక దేశాల్లో డీజిల్ వాహనాలపై నిషేధం ఉంది: ధర్మాసనం డెన్మార్క్, బ్రెజిల్, చైనా, శ్రీలంక దే శాలు అన్ని డీజిల్ వాహనాలను నిషేధించే ప్రక్రియలో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే డీజిల్ వాహనాలపై నిషేధం విధించాయని, మరికొన్ని ఈ ప్రక్రియలో ఉన్నాయని చెప్పింది. అలాగే కొన్ని దేశాలు అధిక పన్నులు విధించడం ద్వారా డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. నగరవాసులు తాము పీల్చే శ్వాసతో అనారోగ్యానికి చేరువ కాకుండా ఉండేలా చూసేందుకు కొన్ని కఠిన చర్యలను చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఎన్జీటీ తెలిపింది. కాగా, గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఎన్జీటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో చూడడం కోసం ఒరిజినల్ ఫైళ్లు సమర్పించాలని ఢిల్లీ, హరియాణా, యూపీ సర్కారులను ఆదేశించింది. -
ఆపదలో 108
ఆదిలాబాద్ రిమ్స్ : కుయ్.. కుయ్.. కుయ్ అంటూ రోగులను అత్యవసర సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడే అపర సంజీవనికి ఆపద వచ్చింది. జిల్లాలో 108 సేవలకు గ్రహణం పట్టింది. తరచూ ఇంధన కొరత.. వాహనాలు రిపేర్‌కు రావడం.. వెరసి ప్రజలకు సేవలందించలేకపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 108 రాక.. ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజు వారీగా వందల సంఖ్యలో ప్రాణాలు కాపాడుతున్న ఈ వాహనాల రాకపోకలు నిలిచిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంధనం కొరత.. జిల్లాలో 2006 ఆగస్టులో ఆదిలాబాద్, మంచిర్యాలలో ఒక్కో వాహనంతో 108 సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంవత్సర కాలంలో విడుతల వారీగా 30 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. వీటిలో డీజిల్ ఇంధనం లేకపోవడంతో తరచూ సేవలు నిలిచిపోతున్నాయి. పది రోజులుగా డీజిల్ కొరతతో దాదాపు 20కి పైగా వాహనాల సేవలు ఆగిపోయాయి. శనివారం జిల్లా కేంద్రంలో సైతం డిజిల్ లేదని నాలుగు వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో 108 సేవల కోసం ఫోన్‌చేసే వారికి డీజిల్ లేదని.. వాహనం నడవడం లేదని సమాధానం చెప్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఒక్కో వాహనానికి 20 నుంచి 30 ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఎంతో అత్యవసర సమయం అయితే కానీ 108కు ఫోన్ చేయరు. అలాంటిది ఫోన్ చేసినా వాహనం రాకపోవడంతో పలువురు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్‌ను అరువుగా పోయించుకుంటున్నా వాటి బకాయిలు పెరిగిపోయింది. దీంతో బంక్ యజమానులు ఇంధనం పోయడం నిలిపివేశారు. కొన్నిచోట్ల మాత్రం ఇంకా అరువుగా ఇంధనం పోయించుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో వాహనానికి నెలకు రూ.20 వేల చొప్పున ఇంధన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, నార్నూర్, జైనూర్‌తోపాటు చాలా ప్రాంతాలకు ఇప్పటికే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతుకు నోచుకోని వాహనాలు.. తొమ్మిది సంవత్సరాలుగా అవే వాహనాలు నడిపిస్తుండడంతో అవి కండీషన్ కోల్పోయి మూలనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో వాహనం సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగిన వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి అందించాలి. కానీ.. ఇప్పటి కీ కొత్తవి మంజూరు లేక అవే వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో వాహనాలు తప్పుపట్టి తరచూ ఏదో ఒక సమస్యతో గ్యారేజీకి తరలుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అయితే జిల్లాలో వాహనాల మరమ్మతుల కోసం చేసిన బిల్లులు కూడా 6 నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 15 మంది మెకానిక్‌లకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనాలు మెకానిక్ షెడ్‌కు వెళ్లినప్పుడు బిల్లులు ఇవ్వలేడం లేదంటూ.. ఆ వాహనాలను రోజుల తరబడి షెడ్డులోనే పెట్టుకుంటున్నారు. వాహనాల్లో పరికరాల కొరత.. 108 వాహనాల్లో పరికరాల కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిదేళ్లుగా అవే పరికరాలు వాడుతుండడంతో సరిగా పనిచేయడం లేదు. కొన్ని పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. రోగులకు ప్రథమ చికిత్సకు చేయాల్సిన పరికరాలు సైతం అందుబాటులో లేక వాహనాల్లో రోగులను తీసుకొచ్చే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని వాహనాల్లో బీపీ ఆపరేటర్స్, పల్స్‌మిషన్, స్టెతస్కోప్, తర్మామీటర్, మానిటర్, వెంటిలేటర్, నెఫ్లేజర్, గ్లూకోమీటర్లు కూడా లేని దుస్థితి నెలకొంది. తుప్పుపట్టి వాహనాల్లో పరికరాలు లేకుండానే బాధితులను తరలిస్తున్నామని సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇందులో పనిచేసే 180 మంది సిబ్బందికి కూడా రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సేవల నిర్వహణకు నయాపైసా విడుదల కాలేదు. ఇటు ఇంధన, పరికరాల కొరత, అటు మరమ్మతు సమస్య వేధిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు చేపడుతాం.. - శాంతిసాగర్, 108 జిల్లా కోఆర్డినేటర్ 108 వాహనాల్లో డిజిల్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. మూడు నెలల నుంచి బిల్లులు అందకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. త్వరలోనే పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించి వాహనాలు నిలిచిపోకుండా చూస్తాం. -
హీరో డీజిల్ బైక్!
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ త్వరలో డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఆర్ఎన్టీ 150 సీసీ పేరుతో కాన్సెప్ట్ డీజిల్ బైక్ కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. దీంతో పాటు హైబ్రిడ్ స్కూటర్, మరో మూడు మోడళ్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. డీజిల్ బైక్ మినహా ఇతర మోడళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. ఈ కొత్త మోడళ్లలో మూడు మోడళ్లు -ఆర్ఎన్టీ డీజిల్ బైక్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 250 సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్‌ఎక్స్‌ఆర్250ఆర్లు పూర్తిగా కొత్తవని వివరించారు. వీటితో పాటు 110 సీసీ స్కూటర్ డాష్, 150 సీసీ బైక్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్-ఇవి రెండూ ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లపైనే తయారు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 150 సీసీ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌ను, రెండో క్వార్టర్లో డాష్ స్కూటర్‌ను అందిస్తామని వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో హైబ్రిడ్ స్కూటర్‌ను, 250 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. డీజిల్ బైక్‌పై మరింత కసరత్తు డీజిల్ ఇంజిన్ బైక్‌పై మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందని పవన్ ముంజాల్ వివరించారు. ఈ డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు మరింత సమయం పడుతుందని వివరించారు. రానున్న కాలంలో ఈ బైక్‌కు యాక్సెసరీలు అందిస్తామని, మరిన్ని వేరియంట్లను తెస్తామని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ బైక్‌ను విక్రయిస్తామని పేర్కొన్నారు. మంచి మైలేజీ ఇచ్చేలా, టూ-వీల్ డ్రైవ్ తదితర ఫీచర్లతో ఈ బైక్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోల్‌తోనూ, కరెంట్తోనూ నడిచే హైబ్రిడ్ స్కూటర్ లీప్‌ను మొదటగా పాశ్చాత్య దేశాల్లో మార్కెట్ చేస్తామని, ఆ తర్వాత భారత్‌లోకి తెస్తామని వివరించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే లేదా ట్యాంక్ ఫుల్ చేస్తే 340 కి.మీ. దూరాన్ని ఈ స్కూటర్ ప్రయాణిస్తుందని వివరించారు. -
ఈ కార్ మైలేజీ 110 కి.మీ.
పేరు: ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్ 1 రేటు: జస్ట్.. 94 లక్షలు ఏంటి స్పెషాలిటీ: మామూలు కారైతే మహా అయితే లీటరుకు 20 కిలోమీటర్లు వస్తుంది. ఈ కారు కొంటే.. లీటరు కొట్టిస్తే.. కనీసం 110 కిలోమీటర్లు తిరిగేయొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు(మనం రెగ్యులర్‌గా వాడుకునే వీలుండేది) అని రూపకర్తలు చెబుతున్నారు. ఇంకా ఏమున్నాయ్: అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొం దించిన ఈ డీజిల్-ఎలక్ట్రిక్ హైబ్రీడ్ కారు తక్కువ బరువు(795 కిలోలు) ఉండటంతోపాటు తక్కువ కాలుష్యాన్నీ విడుదల చేస్తుంది. చెప్పుకోవడానికి హైబ్రీడ్ అయినా.. చూడ్డానికి లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోదు. ఏరోడైనమిక్ డిజైన్‌తో మన దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. సాధారణ కార్లకు ఉండేలా వీటికి వింగ్ మిర్రర్స్ లేవు. వాటి స్థానంలో చిన్నపాటి కెమెరాలను అమర్చారు. ఆ కెమెరాలే కారు లోపల ఉండే స్క్రీన్‌పై బయటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అత్యధిక వేగం గంటకు 160 కిలోమీటర్లు. మైనస్సుల్లేవా: ఒక్కటే.. ఇందులో ఉండేవి 2 సీట్లే. అంటే వెనుక సీట్లు లేవన్నమాట. -
హోండా సిటీలో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: జపాన్ కంపెనీ హోండా... అంతా కొత్తదైన హోండా సిటీ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా సిటీ బ్రాండ్ కింద ఈ ఫోర్త్ జనరేషన్ మోడల్లో డీజిల్ వేరియంట్‌ను కూడా అందిస్తున్నామని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో హిరోనోరి కనయమ తెలిపారు. జపాన్‌లోని తొచిగిలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్లో ఈ హోండా కార్లను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. భారత్‌తో సహా ఇతర ఆసియా దేశాల్లో సర్వేలు నిర్వహించి వీటిని రూపొందించామన్నారు. తొలి తరం హోండా సిటీ కారును ఈ కంపెనీ 1998లో భారత్‌లోకి తెచ్చింది. ఇప్పటి వరకూ 4.3 లక్షల కార్లను విక్రయించింది. ఇవీ కొత్త హోండా వివరాలు: ధర: రూ.8.62-11.1 లక్షలు డీజిల్(5 వేరియంట్లు- ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) మైలేజీ: 26 కిలోమీటర్లు పెట్రోల్ వెర్షన్ రూ.7.42 - 10.98 లక్షలు మైలేజీ: 18 కిలోమీటర్లు ఇతర ప్రత్యేకతలు: టచ్ స్క్రీన్ ఆటో ఏసీ, 5 అంగుళాల ఎల్సీడీ మానిటర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పార్కింగ్ కెమెరా, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్.